కనుచూపు మేర పచ్చని పంటపొలాలు కనిపిస్తున్నాయి.
వాటి మధ్యలొ ఓ చిన్న పంటకాలువ ప్రవహిస్తొంది...దాని గట్టుమీద జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ... అభిరామ్ వెనుక భవ్య నడుస్తుంది.
"ఇంకొంచెం
ముందుకు వెల్తే... మా
మావిడితొట వస్తుంది. ఆ
తొటలొ చాలా బాగుంటుంది..
నీకు ఆ ప్లేస్
చాలా బాగా నచ్చుతుంది”… అని అభిరామ్ చెప్పాడు.
ఇద్దరూ కొంతదూరం నడిచాక
మావిడితొట చేరుకున్నారు. అక్కడ
ఒక చిన్న గట్టులాంటిది
కనబడితే దాని మీద
కూర్చొన్నారు. భవ్య తొట
చూట్టూ పరిశీలిస్తూ కూర్చొంది.
ఏదొ మాట్లాడాలి
అని చెప్పిన అభిరామ్
ఎలా మొదలు పెట్టాలొ
అర్దంకాక నిశబ్దంగా ఆలొచిస్తున్నాడు.
ఆ నిశబ్దాన్ని కదిలిస్తూ...చెట్టు
మీదనుండి ఓ కాకి
అదేపనిగా అరుస్తోంది. చుట్టూ
చూస్తున్న భవ్య..."మీ
ఊరు నాకు చాలా
బాగా నచ్చేసింది...ఇక్కడే
శాశ్వతంగా ఉండిపొవాలనిపిస్తుంది" అంది.
అతని నిశబ్దాన్ని
గమనించి, "ఏదొ
చెప్పాలని అన్నారు?" అసలు
విషయం గుర్తుచేసింది.
"మన
పెళ్ళి కి ఇంట్లొ
అమ్మా, నాన్న ఒప్పుకున్నారు.
మీ ఇంట్లొ ఎలాంటి
ఇబ్బంది లేదనుకొ... కావాల్సిందల్లా మనద్దరి అంగీకారమే!"
అన్నాడు.
భవ్య కి
వెంటనే ఏం చెప్పాలొ
అర్దం కాలేదు. ఆమె
మళ్ళీ ఆలొచినల్లొకి వెళ్ళింది...అతను...అతని
కుటంబం నచ్చాయి. అతని
వ్యక్తిత్వం నచ్చింది...నచ్చలేదు
అని చెప్పడానికి కారణాలేమీ
కనబడలేదు.. తనకి కూడా
ఈ పెళ్ళి ఇష్టమే
అని ఎలా చెప్పాలొ
అర్దం కాక సంశయిస్తుంటే...
"నీ
అంగీకారం చెప్పేముందు నీకు
కొన్ని విషయాలు తెల్సి
తీరాలి." అన్నాడు. ఇంకా అతను
జానకి ని మర్చిపొలేకపొతున్నానని చెప్తాడేమో అనుకుంది.
అతను కంటిన్యూ చేస్తూ "మిమ్మల్ని నాకిచ్చి
పెళ్ళి చేయడానికి...ప్రతిఫలంగా
మీ నాన్నగారికి వెయ్యికొట్ల
బిజినెస్ ఇస్తానని మాటిచ్చాను.
ఆ విషయం మీదగ్గర
దాచడం నాకిష్టం లేదు...
పెళ్ళికి ముందే చెప్పడం మంచిదని... చెప్తున్నాను"
అన్నాడు.
మొదట షాక్ అయ్యింది...అర్దం అయ్యాక..చాలా హర్ట్
అయ్యింది.
తన పెళ్ళితొ
నాన్న వ్యాపారం చేయడం
ఆమెకి మింగుడుపడలేదు. ముఖ్యంగా,
అభిరామ్ కూడా పెళ్ళిని
బిజినెస్ తొ ముడిపెట్టడం
జీర్ణించుకొలేకపొయింది. తన వ్యక్తిత్వానికి విలువ లేకుండా
తన జీవితాన్ని కన్నతండ్రి,
కాబొయే భర్త కేవలం
వ్యాపార వస్తువుగా చూసినట్లుగా
అనిపించింది. గాయపడ్డ మనసు
విలవిల్లాడింది. అప్పటివరకు అభిరామ్
మీదున్న గౌరవం ఒక్కసారిగా
ఎగిరిపొయింది. అతన్ని నిందించడానికి
వీలు లేకుండా ఉన్నది
ఉన్నట్లు ముందే చెప్పేసాడు...తెలివైనవాడు.
తనతొ ఇప్పుడు మనసు
చంపుకొని ఈ పెళ్ళి
ఇష్టమే అని చెప్పాలా...నెవర్
మనసులొ బలంగా అనుకొంది.
అతను ఎదురుకట్నం
ఇచ్చి భవ్యను చేసుకొవాలనుకొవడానికి..
అసలు
కారణం ఏమై ఉంటుందొ...ఆమెకి
అర్దం కాలేదు. అడగడానికి
అహం అడ్డొచ్చింది. ఎందుకు
వెయ్యికొట్ల ఎదురిచ్చి మరీ
పెళ్ళి చేసుకొవాలనుకుంటున్నట్లు?
అతను
కావాలంటే చాలామంది అమ్మాయిలు
అతని ఆస్తి, అందం
చూసి పెళ్ళికి ముందుకొస్తారు....కానీ
అతను మాత్రం ఎప్పుడూ
అసలు చూడని, కలవని
నన్నే ఎందుకు...పెళ్ళి
చేసుకొవాలనుకుంటున్నట్లు??... అర్దం
కాలేదు. ఆ విషయం
అతనే చెప్తాడేమో అని
ఎదురుచూసింది.
ఆమెని కన్వీన్స్
చేయడానికి ఆ క్షణాన
ఏదొ ఒక అబద్దం
చేప్పేసి ఉండొచ్చు. కానీ
అతని కి అబద్దాల
మీద తన కొత్త
జీవితాన్ని నిర్మించుకొవాలనుకొవడం లేదు.
అలా అని కొన్ని
విషయాలు దాచకుండా పెళ్ళి
చేసుకొవడం ఇష్టం లేదు.
ఈ బిజినెస్ డీల్
విషయం ఇప్పుడు కాకపొయినా
తర్వాతైనా తనకి తెల్సి
తీరుతుంది. అది దాచడం
అనవసరం...అందుకే ఆమెకి
ఆ విషయాన్ని పెళ్ళికి
ముందే చెప్పాడు. కానీ ఆమెనే ఎందుకు చేసుకొవాలనుకుంటున్నాడొ మాత్రం అతను చెప్పలేదు. అతను చెప్పేవరకు అడగకూడదని ఆమె అనుకొంది..
కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం!!
ఆమె..ఏదొ
నిర్ణాయానికి వచ్చినదానిలా... "నాకు
ఈ పెళ్ళి ఇష్టం
లేదు" మరొమాట ఆలొచించకుండా
అనేసింది. అది ముందే
ఊహించిన అభిరామ్..ఆమెని
కన్వీన్స్ చేయాలని చూడ్లేదు.
"మీరు
నన్నే ఎందుకు చేసుకొవాలనుకుంటున్నారొ చెప్పేదాక...నా
అభిప్రాయం ఇదే!!"అంది.
ఆత్మాభిమానం ఉన్న ఏ
ఆడపిల్లైనా ముందు అలాగే
అంటుంది. అందుకే అతను వెంటనే మాట్లాడలేకపొయాడు.
తన జీవితంలొ ఆమెకి ఇంకా చెప్పకుండా మిగిలిపొయిన కధ చెప్పాలా...వద్దా ఆలొచించాడు అభిరామ్. ఏదొ
స్థిరమైన ఆలొచనకు వచ్చినవాడిలా చెప్పడం మొదలు పెట్టాడు.
"భవ్యా...నువ్వు చూస్తున్న నేను...నేను కాదు....నేను జీవిస్తున్న ఈ జీవితం నాది కాదు... మరొకరి కలల సాకారానికి వారధి ని నేను!! నా జీవితంలొ నీకు చెప్పని పేజీలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి..." అంటూ ఆమె వైపు తిరిగాడు...
అప్పటికి ఆమె కొపంతొ అక్కడ నుండి... దూరంగా వెళ్ళిపోతూ కనపడింది.
(ఇంకా ఉంది)