ఆమె చూపుల భావం అర్దమైనదానిలా "బావ పొద్దున్నే వాళ్ళ నాన్న తొ కలిసి పొలం చూడ్డానికి వెళ్ళాడట అత్త చెప్పింది" అంది జానకి.
తను ఎవరై ఉంటుందా అని ఆలొచిస్తున్న భవ్య తొ "నేను మీ శ్రీవారికి మరదలును. నా పేరు జానకి" తనని పరిచయం చేసుకుంది.
"శ్రీవారు అన్నమాటకు" తడబడింది భవ్య. నేను మీ బావని ఇంకా పెళ్ళి చేసుకొలేదు అని చెప్పాలనుకొంది. కానీ జానకి ఆ చాన్స్ ఇవ్వకుండా...
"మా బావ పెళ్ళి చేసుకొని వచ్చాడని ఊరంతా అంటుంటే...అమ్మాయి ఎలా ఉందొ అని ఆత్రం ఆపుకొలేక చూద్దామని వచ్చాను. నిజంగా మా బావ సెలక్షన్ సూపరు" జానకి గలగల మాట్లాడేస్తుంది.
ఆమె మాటలకు అడ్డుకట్ట వేస్తూ "మీరనకుంటున్నట్లు మాకింకా పెళ్ళికాలేదు. మేం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే." అంది భవ్య.
"ఔనా...అయ్యో క్షమించండి. ఊర్లొ అంతా బావ పెళ్ళి చేసుకొని వచ్చాడని అంటే. నిజమనుకొని పొరబడ్డాను." అంది జానకి.
"ఫర్వాలేదు లెండి" అంది భవ్య.
మెదట జానకి నొచ్చుకొని తర్వాత "మీరేమనుకొనంటే మీకొమాట చెప్పనా" అడిగింది. భవ్య ఏంటన్నట్లు చూసింది. "నిజంగా మీరు సుపర్!" జానకి నవ్వుతూ అంది. భవ్య కూడా నవ్వేసింది.
"ప్లీజ్.. ప్లీజ్.. ఆ కాంప్లీమెంట్ మాత్రం ఎక్సెప్ట్ చేయండి. మీరు నిజంగానే చాలా అందంగా ఉన్నారు. నవ్వితే ఇంకా అందంగా ఉన్నారు" అంది జానకి.
ఆమె మాటతీరు భవ్యకు బాగా నచ్చేసింది.
"చాలు చాలు నన్ను మోసేస్తున్నారు. నిజం చెప్పాలంటే... మీ బావ మీకొసం చాలా చెప్పారు. మీరు కూడా తను చెప్పినదానికన్నా చాలా అందంగా ఉన్నారు" అంది భవ్య.
ఆ మాటకు జానకి నవ్వాగిపొయింది.
"బావ ఇంకా నన్నే తలుచుకుంటున్నాడా??" లొలొపల అనుకుంటున్నట్లుగా బయటకు అనేసింది. భవ్య కూడా నిశబ్దంగా మారిపొయింది.
"నా గురించి ఏం చెప్పాడు బావ?" అడిగింది జానకి కుతూహలంగా.
నువ్వు అతని మరదలవని...చాలా అందంగా ఉంటావని చెప్పాడు. అంతే" అని అంది.
కాసేపు ఆలొచించి..."అంతేనా...మరి చాలా చెప్పాడని అన్నారు" అడిగింది జానకి.
"హూ....ఇంకా.... మీరు లవ్ మేరేజ్ చేసుకున్నారని. మీ పెళ్ళి తనే దగ్గరుండి చేసాడని చెప్పారు" అంది భవ్య. "అంతేనా" మళ్ళీ అడిగింది జానకి. తను ఇంకా ఏదొ వినాలని అనుకుంటున్నట్లుగా అనిపించింది భవ్యకు.
కొత్తమనిషి అన్న సంశయం వదిలేసి "మీ సంసారం ఎలా ఉంది" అడిగేసింది భవ్య.
"మా సంసారంకేం! ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం కద. ప్రతిరొజు ఓ వసంతంలా ఉంది." అంది జానకి. "మరి ఇంకా మీ బావ గురించి ఎందుకు ఆలొచిస్తున్నారు??" అడిగేసింది భవ్య.
జానకి ఉలిక్కిపడింది.
తప్పుచేసినదానిలా తలదించుకుంటు.."ఏమో వద్దన్నా గుర్తొస్తుంటాడు బావ." అంది చిన్నపిల్లలా.
మళ్ళీ తనే "అయినా ఏ మనిషి విలువైనా పొందేటప్పుడుకన్నా పొగొట్టుకొన్నప్పుడే తెలుస్తుంది అని పెద్దలు ఊరకనే అనలేదుకదా!" అంది. ఆమె కళ్ళలొ సన్నటి కన్నీటిపొర తారాడటం చూసింది భవ్య.
"మీ బావని మిస్ అయినట్లుగా ఫీల్ అవుతున్నావా??" అడిగింది అనునయంగా.
జానకి ఇన్నాళ్ళుగా తన మనసులొ జరుగుతున్న సంఘర్షణ ఇక ఆపుకొలేకపొయింది. భవ్య తనకి కొత్తలా అనిపించడంలేదు. కొన్ని పరిచయాలు అంతే క్షణాల్లొ యుగాల అనుభందాన్ని ముడివేస్తాయి.
"పెళ్ళికి ముందు నన్ను నా చిన్న చిన్న ఆనందాల్ని ప్రేమించిన రఘు...పెళ్ళయ్యాక నాన్నను నాన్న నడుపుతున్న రాజకీయాలను ప్రేమించడం మొదలుపెట్టాడు. అతనికి ఇప్పుడు నాకన్నా డబ్బుంటే ప్రేమ. అతను చూట్టు ఎప్పుడు నలుగురు మనషులు చేతులుకట్టుకు నిల్చొవడం కావాలి. తను ఒకప్పడు మానాన్న దగ్గర చేతులు కట్టుకు నిల్చున్న రొజులు మర్చిపొయాడు. నాన్న ఎప్పుడైతే అల్లుడు హొదానిచ్చాడొ అప్పుడే అతనిలొ మార్పొచ్చేసింది. తనకి నాతొ గడిపే సమయమే లేదిప్పుడు." చెప్పడం ఆపింది జానకి.
"బావ అలాకాదు. తను చిన్నప్పుడెలా ఉన్నాడొ ఇప్పుడు అలాగే ఉన్నాడు. అతనిలొ ఎలాంటి మార్పులేదు. తన సంపాదించిన ఆస్తులు అంతస్తులు అతనిలొ ఎలాంటి గర్వాన్ని పెంచలేదు. ఉన్నరొజు లేని రొజు ఒకేలా ఉండగలిగే వాడే నిజమైన మనిషి. నిజం భవ్య... అబిబావ. ఎప్పుడు ఒకేలా ఉంటాడు. తనని నేను మిస్ అయ్యాను. నిజంగా మిస్ అయ్యాను" చెప్తుంటే ఆమె కళ్లలొ నీళ్ళు జలజలా కారిపొతున్నాయి.
భవ్యకి జానకి ని ఎలా ఓదార్చాలొ అర్దం కాక...మౌనంగా ఉండిపొయింది.
కాసేపు నిశబ్దంలొ జానకి సేద తీరింది. తర్వాత "నా సొదంతా చెప్పి బొర్ కొట్టించినట్లున్నాను..రండి స్నానం చేసి తయారైతే మా ఊరు..తొట అన్ని చూపిస్తాను." అంది హూషారు తెచ్చుకుంటు.
"నేను క్రింద అత్తతొ మాట్లాడుతుంటా త్వరగా రెడీ అవ్వండి" అనేసి వెళ్ళిపొయింది.
భవ్య కదలలేదు. అలాగే కూర్చొంది. అభిరామ్ వ్యక్తిత్వం నెమ్మది నెమ్మదిగా నచ్చుతొందామెకి. అతని మీద మనసు మళ్ళుతుండటం తెలుస్తొంది. ఈ వారం రొజులు అతన్ని బాగా స్డడీ చేసి...అమెరికా వెళ్ళిన వెంటనే డాడీతొ మూహూర్తాలు పెట్టించమని చెప్పేయాలి అని మనసులొ తను అనుకుంటుండగా...ఆమె సెల్ రింగ్ అయ్యింది.
"హలొ చిట్టితల్లి ఎలా ఉన్నావురా?" అవతల నుండి తండ్రిగొంతు వినపడింది.
తనెప్పుడు అంత ముద్దుగా మాట్లాడం ఎరుగదు. ఎలా అయినా తనని అబితొ పెళ్ళికి ఒప్పించడమే అతని జీవిత ద్యేయంలా మాట్లడుతొంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు తన తండ్రికి అభిరామ్ కి ఏంటి లింక్ ఉందొ ముందు తెలుసుకొవాలి అని అనుకుంది.
"నేను బానే ఉన్నాను డాడీ. అమ్మ ఎలా ఉంది" అడిగింది. డాడీ ని ఎలా ఉన్నారు అని అడగలేదు. అతను కూడా పట్టించుకొలేదు.
"అమ్మ నీతొ మాట్లాడుతానంటుంది లైన్ లొ ఉండు" అని చెప్తు "అన్నట్లు అబ్బాయి నీకు నచ్చాడా?? ఎలా జరిగింది మీ ప్రయాణం." అడిగాడు.
సమాదానం ఇవ్వకుండా "అమ్మకి ఇవ్వు డాడీ" అంది విసుగ్గా.
అతను కూడా విసుక్కుంటు " మీ అమ్మకు ఇస్తా గానీ... విను....నీ తిక్కతొ అబ్బాయిని విసిగించకు. అసలే వేయికొట్ల బిజినెస్...ఏమాత్రం తేడా వచ్చినా అంత సర్వనాశనం అయిపొతుంది" అన్నాడు.
"బిజినెస్ ఏంటి??" అనుమానంగా అడిగింది భవ్య. నొరుజారినందుకు రామచంద్రరావు నాలికకరుచుకొంటు
"బిజినెస్ కాదురా చిట్టితల్లి.. అవన్ని నీకు తర్వాత చెప్తాగానీ..అబ్బాయి ఇక్కడకు వచ్చేసరికి నువ్వు నచ్చావు అనే మాట చెప్పాలి. అందుకు నువ్వు ఏం చేస్తావొ నీ ఇష్టం" అన్నాడు.
భవ్యకి ఎక్కడొ అనుమానంగా ఉంది. "అర్దమైనట్లు చెప్పండి డాడీ" అడిగింది.
"తర్వాత చెప్తాగానీ ఇప్పుడు నన్నేం అడగొద్దు" అనేసి ఫొన్ భార్యకి ఇచ్చేసాడు. భవ్యకి తండ్రి మీద కొపం మరింత ఎక్కువైంది. అసలు విషయం అభిరామ్ ని అడిగి తెలుసుకొవాలని నిర్ణయించుకొంది.
ఈ లొపు అబి వాళ్ళమ్మ ఫొన్లొ "ఎలా ఉన్నావే. వెళ్ళిన దగ్గరనుండి ఒక్క ఫొన్ కాల్ లేదు. నువ్వు కూడా మీ డాడీలా తయరయ్యావు. నేనొక్కదాన్ని ఉన్నానన్న విషయం మీ ఇద్దరకి అసలు గుర్తుండటం లేదు. ఇంతకీ అబ్బాయి నచ్చాడా??" నిష్ఠురాలు..కుశల ప్రశ్నలు..కలిపేసి అడిగింది. అబిరామ్ ఆలొచనల నడుమ క్లుప్తంగా మాట్లాడి "నేను మళ్ళీ కాల్ చేస్తా" అని ఫొన్ డిస్కనక్ట్ చేసింది.
అప్పుడే అబిరామ్ పంచెకట్టులొమేడ మీదకు వస్తూ కనపడ్డాడు. పొలం లొబురద పంచె అంచులకు అంటుకున్నట్లుంది. తడికాళ్ళు తుడుచుకుంటు వస్తుంటే అలా అతన్నే చూస్తు ఉండిపొయింది. ఇంత వరకు సూట్ లొ, జీన్స్ లొనే చూసిందతన్ని. అతిపెద్ద అమెరికన్ బిజినెస్ మేన్..ఈ మారుమూల పల్లెటూర్లొ అచ్చతెలుగు పంచెకట్టులొ ఊహించడానికే చిత్రంగా ఉందామెకి. ఎంత ఎదిగినా ఒదిగిఉండడానికి అతను నిదర్శనం లా అనిపిస్తుంటే అలాచూస్తు కూర్చుంది..
అభిరామ్ ఆమె దగ్గరగా వచ్చాడు. "రాత్రి బాగా నిద్ర పట్టిందా?" అడిగాడు. ఆమె సమాదానంగా "యా" అంది ఒళ్ళు విరుచుకుంటు.
"గుడ్ లేచి త్వరగా రెడీ అయితే...బయటకు వెల్దాం. నేను నీతొ కొన్ని విషయాలు చెప్పాలి" అన్నాడు.
(ఇంకావుంది)