సాయంత్రం వేళవ్వడంతొ ఆకాశం నారింజరంగు చీరకట్టుకున్నట్లు కనపడుతుంది. సూరీడు త్వరగా డ్యూటీ ముగించడానికి తొందరపడుతున్నట్లున్నాడు. ఎక్కడెక్కడికొ ఎగిరెళ్ళిన పక్షులు గూళ్ళూ చేరుకుంటున్నాయి.
వేడి వేడి గా పొగలు కక్కుతున్న టీ కప్పుని రెండు చేతులు మద్య పట్టుకొని, చెట్టు పక్కనున్న రాయి మీద కుర్చొంది భవ్య.
"రొడ్డు సైడ్ టీ కొట్టులొ టీ తాగడం ఇదే ఫస్ట్" అంది
అభిరామ్ చిన్నగా నవ్వుతు "నాకెందుకొ ఏసి గదుల్లొ దొరకని ఆనందం, ఇలా చెట్టుకింద కూర్చొంటే దొరుకుతుంది." అన్నాడు. మళ్ళీ తనే "కొన్ని అనుభవిస్తే గానీ అర్దం కావు" టీ ని ఎంజాయ్ చేస్తూ అన్నాడు.
నిజమే! అతను అన్నట్లు ఇలా ఊరికి చివర, కాలుష్యానికి దూరంగా, పచ్చని ప్రకృతిని చూస్తు టీ తాగడం మంచి ఫీల్ ని ఇస్తుంది. ఎసి రెస్టారెంట్స్ లొ లేని సౌకర్యమేదొ ఇక్కడుంది అంది భవ్య.
ఆమె ని ఒకసారి తెరిపారా చూసాడు. ఆమె లొ ఏదొ ఆకర్షణ శక్తి ఉన్నట్లుగా తొచింది. చేపపిల్లలాంటి పెద్ద పెద్ద కళ్ళును వద్దన్నకొద్ది చూడాలనిపిస్తుంది. తన అభిప్రాయాలు, ఆమె అభిప్రాయాలు తప్పకుండా కలుస్తాయనిపిస్తొంది అతనికి.
జానకి తర్వాత తను ఇష్టపడుతున్న మొదటి వ్యక్తి భవ్య.
ఆమె మనసుని ఎలాగైనా గెలవాలి..ఆలొచిస్తున్న తనని “మిమ్మల్నొ విషయం అడగొచ్చా?” అంది.
ఏంటన్నట్లు ఉలిక్కిపడి చూసాడు అబిరామ్
"మీరు మాములు మద్యతరగతి కుటుంబంలొ పుట్టారు కదా...మరి ఇంత ఆస్తి ఎలా సంపాదించారు?" అంది.
మళ్ళీ తనే తడబడుతూ "ఇలాంటి ప్రశ్నలు అడగకూడదనుకొండి...అయినా అడగకుండా ఉండలేకపొయాను. ఏమీ అనుకొవద్దే" అంది.
"ఇట్స్ ఓకే" అన్నాడు. ఆమె ప్రశ్నకి సమాదానం గా అబిరామ్ కాసేపు మాట్లాడలేదు. అతను ఏం చెప్తాడా అని ఆత్రంగా చూసింది.
"చెప్పకూడదు అనుకుంటే వదిలేయండి" అంది.
"అదేం కాదు. సమయం వచ్చినప్పుడు చెప్తాను" అనేసాడు. ఆమె మరి అడగలేదు.
వాళ్ళ ప్రయాణం మళ్ళీ మొదలైంది.
ఆ రొజు రాత్రికి అభిరామ్ వాళ్ళ ఊరు చేరుకున్నారిద్దరు.
కారు చూస్తూనే, అబిరామ్ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటు ఇంట్లొనుండి బయటకు వచ్చింది. చాలారొజుల తర్వాత కొడుకుని చూడడంతొ ఆమె కళ్ళు వర్షించడానికి సిద్దమైపొయాయి. అభిరామ్ ని వాళ్ళ నాన్న ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆత్మీయస్పర్శలొ తండ్రీకొడుకులిద్దరూ కాసేపు మౌనం దాల్చారు.
అమెరికానుండి అబిరామ్ వస్తున్నాడన్న వార్త ఊరంతా పాకేసినట్లు అందరూ అతన్ని పలకరింపులతొ ముంచెత్తుతున్నారు. భావొద్వేగ వాతావరణం అల్లుకొందక్కడ.
భవ్య దూరంగా నిల్చుని అంతా గమనిస్తుంది. అమెరికాలొ పుట్టిపెరగడం వలన మనుషులు మద్య మమతానుబందాలు గురించి పెద్దగా తెలీదు. అదేదొ పాత తెలుగుసిన్మా చూస్తున్నట్లు బొమ్మలా నిల్చుంది.
"తప్పుకొండి... తప్పుకొండి" అన్న అమ్మమ్మ పిలుపు విని జనాలందరినీ తప్పించుకొని వస్తున్న అమ్మమ్మ వైపు చూసాడు.
"రామూడూ ఎన్నాళ్ళయ్యిందిరా నిన్ను చూసి" కళ్ళూతుడుచుకొవడం కూడా మర్చిపొయి మనవడ్ని హత్తుకొంది.
జానకి ని పెళ్ళి చేసుకొలేదన్న కొపంతొ అలిగి ఇన్నాళ్ళు మాట్లాడని అమ్మమ్మ ఇప్పుడు చాలారొజుల తర్వాత చాలా దూరం నుండి వస్తున్నాడని తెలిసి ఉండబట్టలేక మనవడ్ని చూడడానికి వచ్చింది.
"ఇంతకీ ఈ పిల్ల ఎవర్రా?" అని అమ్మమ్మ భవ్య గురించి అడిగేవరకు ఆమె గురించి మర్చేపొయాడు.
"కొంపదీసి పెళ్ళిగానీ చేసుకొచ్చావా ఏంటి?" అని అడిగింది. అతను సమాదానం ఇచ్చేలొపే..." అమ్మాయి కుందనం బొమ్మలా ఉంది. ఆ పొట్టి గౌన్లు వేసుకొకుండా చీర కట్టుకొని ఉంటే లక్ష్మీ కళ ఉండేది" గలగలా మాట్లాడుకుంటూ భవ్య దగ్గరకెళ్ళింది బామ్మ.
అబిరామ్ పరిచయం చేసేలొపే..."నేను అబిరామ్ ప్రెండ్ ని బామ్మా..మిమ్మల్ని...మీ ఊరు చూద్దామని వచ్చాను" అంది భవ్య.
ఆ ఒక్క మాటతొ అమ్మమ్మ మనసు గెలిచేసింది భవ్య.
పగలంతా ప్రయాణం చేయడంతొ ఇద్దరు బాగా అలసిపొయారు. అప్పటికే మొహాలు వాడిపొయాయి ఉన్నాయి. భవ్యకి అర్జంట్ గా బాత్రూమ్ వస్తుంది. ఇక కంట్రొల్ చేసుకొవడం చేతకాక అభిరామ్ ని పిల్చి చెవిలొ "టాయిలెట్ ఎక్కడా?" అడిగింది. అభిరామ్ ఏదొ చెవిలొచెప్పాడు.
ఇద్దరూ చెవిలొ గుసగుసగా మాట్లాడుకొవడం చూసి ఇద్దరూ అమెరికాలొ పెళ్ళి చేసుకొని వచ్చుంటారని ఊహాగానాలు చేసేసారు చూట్టుపక్కల జనం
"పప్పన్నం ఎప్పుడు రాముడూ" పక్కింటి సూరమ్మత్త అడిగింది. ఆమెకి ఇంకా అతను చిన్నపిల్లాడిలానే కనపడుతున్నట్లున్నాడు అభిరామ్ బుగ్గలమీద చేయేస్తూ "అమెరికా వెళ్ళి బాగా రంగుతేలావే" అంది
"పిల్లలు బాగా అలసిపొయి వచ్చారు. ఉదయం మాట్లాడుకుందాం వెళ్ళండర్రా" అని అమ్మమ్మ అనడంతొ అందరూ వెళ్ళిపొయారు.
భవ్యగురించి అభిరామ్ ముందే అమ్మనాన్నలతొ ఫొన్ లొ చెప్పడంతొ, అబిరామ్ వాళ్ళమ్మ ఆమె ని ఎక్కువగా ప్రశ్నలు వేయకుండా తనగదిలొకి తీసుకువెళ్ళింది.
వేన్నీళ్ళతొ స్నానాలు చేసి...బొజనాలు దగ్గరకొచ్చారిద్దరూ. అబిరామ్ కి ఇష్టమని వాళ్ళమ్మ మేడమీద వెన్నెల్లొ చాపలు పరచి వంటకాలన్ని సర్దిపెట్టింది.
"వావ్ మూన్ లైట్ డిన్నర్...ఐ లైక్ ఇట్" అంది భవ్య మేడమీదకొస్తూ.
ఆ ఊర్లొ వాళ్ళ ఇల్లు ఊరికి చివరగా ఉండడంతొ ఆ ఇంటిని మించిన బిల్డింగ్ దగ్గర్లొ ఏమీ కనపడలేదు. దూరంగా గుడిగొపురం ఒకటే ఎత్తులొ కనపడుతుంది. చూట్టూ పొలాలు దూరంగా విసిరేసినట్లు కొండలు కనపడుతున్నాయి.
"నాకు మీ ఊరు నచ్చింది" చూట్టూ చుస్తూ అంది భవ్య.
"ఇంకా ఏమీ చూడకుండానే?" అభిరామ్ అడిగాడు.
"ఎప్పుడు రణగొణద్వనులతొ యుద్దరంగంలా ఉండే సిటీ లైఫ్ నుండి సడన్ గా ఓ పల్లెటురొస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది." అబిరామ్ వాళ్ళనాన్న వస్తూ అన్నాడు.
"నీ పేరేంటమ్మా?" అడిగాడతను.
"భవ్య" అంది.
"నీ గురించి అబ్బాయి చెప్పాడు. నువ్విక్కడున్నన్నాళ్ళు ఏలాంటి ఇబ్బంది పడకూడదని మరీమరీ చెప్పాడు. నువ్వు మొదటిసారి ఇండియాకి వచ్చావంట కదమ్మా?? నీకేం కావాల్సివచ్చినా నన్ను అడుగు! మొహమాటపడొద్దు. నువ్వు మీ ఇంట్లొ ఉన్నట్లే ఇక్కడా ఉండొచ్చు" అతను చెప్తుంటే
"ధాంక్స్ అంకుల్" అంది.
అభిరామ్ వాళ్ళమ్మ వంటలన్ని కొసరికొసరి ఇద్దరికీ వడ్డించింది. "ఐ లైక్ ఆల్ ఇండియన్ డిషస్" అంటూ భవ్య అన్ని ఐటమ్స్ అడిగి మరి ఒడ్డించుకొని తింది.
అబిరామ్ కి మద్యమద్యలొ వాళ్ళమ్మ ముద్దలుకొన్ని నొట్లొ పెట్టడం చూసి...భవ్యకి జెలసీలాంటి ఫీలింగ్ కలిగింది. బిడ్డకు ఎన్నేళ్ళొచ్చిన కన్నతల్లికి ఇంకా చిన్నపిల్లాడిలానే కనపడతాడని ఎవరొ అన్నమాటలు గుర్తొచ్చాయి భవ్యకి.
ఇంట్లొ తనవాళ్ళెవరూ ఇంతలా ప్రేమగా వడ్డించడం తను గుర్తెరుగదు. డాడీ ఎప్పుడు బిజినెస్ అంటూ తిరగడమే సరిపొతుంది. అమ్మకి బ్యుటీపార్లర్ పిచ్చితప్ప తనగురించి ఎప్పుడూ పట్టలేదు. చిన్నప్పటి నుండి ఏ రొజు అమ్మ అన్నం కలిపి నొట్లొ ముద్ద పెట్టడం తనకు గుర్తులేదు. కరెన్సీ నొట్లతొ ప్రేమను కొనేయొచ్చనే డాడీ దీమా వలన తన బాల్యం అంతా ఆయాల చేతుల్లొనే గడిచింది.
చాలాసేపు మాట్లాడుకుంటూ బొజనాలు చేసారు. భవ్యకు మొదటిసారి చాలా తృప్తిగా తిన్నానిపించింది.
మేడ మీద వెన్నెల్లొ పడుకుంటానంది భవ్య. అభిరామ్ కూడా మేడమీద నే పడుకుంటాననడంతొ ఇద్దరికీ పక్కలు వేసి వాళ్ళమ్మ కిందకు వెళ్ళిపొయింది.
వయసులొ ఉన్న ఇద్దరూ పెళ్ళికాకుండా ఒకేచొట పడుకుంటానంటే ఎవరైనా సరే వద్దంటారు. కానీ అభిరామ్ అమ్మనాన్న అలా అనలేదు. వాళ్ళకి అతని మీదున్న నమ్మకం చూసి భవ్యకి ముచ్చటేసింది.
మంచం మీద వెల్లకిలా పడుకొంది.
ఆకాశం నిండా నక్షత్రాలు మిలమిలమెరుస్తూ... చందమామ మబ్బులతొ దొబూచులాడుతు కనపడ్డాయి. అదే ఆకాశం...అవే చుక్కలు...కానీ అమెరికా కు ఈ పల్లెటూరికి ఎంత తేడా?! రోజూ కనిపించేవే అవి అయినా ఈ రొజెందుకొ కొత్తగా కనపడుతున్నాయి.
ఆమెకి ఈ ఊరు ఇక్కడ మనుషులు చాలా బాగా నచ్చేసారు. అభిరామ్ ని పెళ్ళి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపొవాలని బలంగా అనిపించింది.
అబిరామ్ వైపు చూసింది.
తన మంచం మీద కూర్చొని లాప్ టాప్ ఓపెన్ చేసాడు. “కొన్ని మెయిల్స్ చెక్ చేసుకొవాలి...నువ్వు పడుకొ” అనేసి...తన పనిలొ తాను లీనమైపొయాడు.
అతను ప్రకృతిని ఆస్వాదించే మూడ్ లొ లేడని అర్దమైంది. ఇంకేం డిస్ట్రబ్ చేయకుండా పడుకుంది భవ్య.
తెల తెలవారుతుండగా సూరీడి కిరణాలు సూటిగా కళ్ళలొ పడి భవ్య కి మెలుకువొచ్చింది. కనులు తెరిచి చూస్తే...ఎదురుగా జానకి నిలబడి కనిపించింది. ఠక్కున లేచి కూర్చుంది భవ్య. అభిరామ్ కొసం పక్క మంచం వైపు చూసింది. అతను కనపడలేదు.
(ఇంకావుంది)
chala bagundi...next enti...mee gurinchi naku emi teliyadu...oka famous writer book chaduvutunna feel vachindi..mee rachanalu inka emanna unnaya...mee kavitalu kuda chala bagunnayi ..
ReplyDeletepls post the next episodes at the earliest :)
Sirisha Garu..Chala Thanks andi.
ReplyDeleteNenu inthaku mundu rasina novels rendu Swathi lo publish ayyayi.
Pranaya Kavyam na 3rd novel.
Thvaralone next episode post chesthanu..
Thank you so much
swathi lo publish ayina novels perulu cheppara pls.. anduke mee peru telisina peru la anipistundi choosina daggaranunchi
ReplyDeleteSwathi monthly magazine lo "Priya Priya Champodhe" ane novel May 2004 lo publish ayyindi. Second novel "Charama Geetham" ku Anil Ward vachindi. Adhi June 2005 lo publish ayyindi. Tharvatha inko two novels rasanu kani publish ekkada cheyyaledhu...Movie kosam oka script ready chesukuntu...Avakasam kosam eduruchusthunnanu. Mi abhimananiki chala Thanks and
ReplyDelete