Friday, May 27, 2011

ప్రణయ కావ్యం - 11

ఆ తర్వాత బాగా నిద్ర పట్టేసింది. మద్యాహ్నం ఎప్పుడొ రొజీ వచ్చి లేపితే గానీ మెలుకువ రాలేదు. లంచ్ కని తలుపు దబదబా బాదుతుంటే మెలుకవ వొచ్చింది. మొహం కడుక్కొని వెళ్ళి తలుపు తీసాను.

రోజీ, జేమ్స్, లక్ష్మీ ముగ్గురు కలిసి కారమ్స్ ఆడుతు హల్లొ కనిపించారు. ముగ్గురు అప్పటికే బాగా ఫ్రెండ్స్ అయిపొయినట్లున్నారు. నన్ను చూస్తూనే "కమ్ భవ్య" జేమ్స్ పిలిచాడు. లక్ష్మీ వడ్డించడానికన్నట్లు లేచింది.
"హేయ్ భవ్య.. ఏమో అనుకున్నాను గానీ..జేమ్స్ మంచి ఇంట్రస్టింగ్ కారక్టరే...ఇప్పటి వరకు మమ్మల్ని ఎంత నవ్వించాడొ తెలుసా??" రొజీ జేమ్స్ ని ఆకాశానికి ఎత్తేస్తు అంది. నేను సీరియస్ గా చూసాను తన వైపు. నాకు అతన్ని పొగడటం ఇష్టం లేదు. నా కొపం లాంటి చూపు చూసి, సైలంట్ అయిపొయింది. నన్ను చూసి వాతవరణం గంబీరంగా మారిపొయింది.

లక్ష్మీ అన్నం వడ్డిస్తు "అమ్మగారు సార్ మీకొ నిక్ నేమ్ పెట్టారు తెల్సా?" అంది అమాయకంగా. "ష్ వద్దు" అన్నట్లు రోజీ, జేమ్స్ సైగలు చేయడం అప్రయత్నంగా నా కంట పడింది. ఏంటన్నట్లు చూసాను.
లక్ష్మీ కి వాళ్ళసైగలు అర్దం కాక.. "మీ పేరు భవ్యకదండి దాన్ని చిన్నగా చేసి భౌ అని పెట్టారండి" అంది. చెప్తున్నప్పుడు లక్ష్మీ కి నవ్వు ఆగలేదు.
"వ్వాట్?" అరిచినంత పని చేసాను. కొపంతొ అన్నం పల్లెం దగ్గర నుండి లేచి నిల్చున్నాను. "భౌ" అని నేను మరొసారి ఉచ్చరిస్తుంటే జేమ్స్ కి కూడా నవ్వు ఆగలేదు.
"జేమ్స్ నీకు ఇంతకు ముందే చెప్పాను. అయ్ హేట్ షార్ట్ కట్స్. అయ్ హేట్ యి." కొపంగా అరిచాను. నా అరుపుకి లక్ష్మీ బిక్కచచ్చిపొయింది.

మొట్టమొదటి సారి నా పేరుని ఇలా కామెంట్ చేసినవాడు జేమ్స్. క్షమించరాని నేరం చేసాడు. నా చేతిలొ ఈ రొజు వీడు అయిపోయాడు. మనసులొ ఎదైనా చేయాలని కసితీరా అనుకున్నాను.

"నాట్ బౌ.. భవ్య. ఐ సెడ్ బొ. యు నొ రైన్ బొ.. దట్ బొ" సరిచేస్తు జేమ్స్ చెప్పాడు. ఇంద్ర ధనస్సుతొ పొల్చానని జేమ్స్ నా కొపం కంట్రొల్ లొకి తెస్తు అన్నాడు.
రోజీ నన్ను ఉడికించాలని... "బొ కన్నా బౌ నే బాగుందే" అంది.
"షటప్" అరిచేసి...అన్నం తినకుండా లేచి వచ్చేసాను.

నాతొ పాటే జేమ్స్ కూడా ఉదయంలా తినకుండా లేస్తాడని అనుకున్నా. కానీ తను లేవకుండా ఇంకా కూర్చునే ఉన్నాడు.

"అమ్మాయి గారు మీ కొసం స్పెషల్ డిషస్ చేయించారమ్మా సార్! మీకిష్టమైన దమ్ బిర్యాని చేసానమ్మా." మూతలు తీసి చూపిస్తూ అంది లక్ష్మి. నా ఇష్టాలన్ని ఎలా తెలుసుకున్నాడొ.. "నాకు ఈ రొజు నాన్ వెజ్ తినాలని లేదు." సీరియస్ గా అనేసి, డైనింగ్ టేబిల్ కి కొంచెం దూరంలొ ఉన్న సొఫాలొ కూర్చొంటు అన్నాను.
"కాకరకాయ వేపుడు, సాంబారు కూడా చేసిందే" రోజీ అంది. అవంటే నాకు ప్రాణం. నా ఇష్టాలన్ని ఎలా తెలుసుకున్నాడొ ఏంటొ ముందు ఆ విషయం తెలుసుకొవాలి అనుకుంటు.."ఐనా నాకు ఆకలిగా లేదు." అన్నాను మొండిగా.
"నాకు మంచి ఆకలిగా ఉంది. ఐ కాంట్" అనేసి రోజీ వాటి మీద దాడి చేయడం మొదలుపెట్టింది.
"ప్లీజ్ కమ్ భవ్య" జేమ్స్ బతిమాలుతున్నట్లు అన్నాడు.
నేను పక్కనే ఉన్న గోడంత ఎత్తున్న అద్దం వైపు మొహం తిప్పేసాను. బయట పూలమొక్కలు ఆ అద్దంలొ నుండి కనిపిస్తున్నాయి. నా చేష్టలు పొగరులా అనిపించాయో ఏమో మళ్ళి పిలవలేదు.

నాకు ఆకలి మొదలైంది. మళ్ళీ పిలిస్తే వెళ్ళాలని చూసా...కానీ ఎవరూ నన్ను పట్టించుకొనట్లు ఒక్కొ ఐటమ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు.

నన్ను ఊరిస్తు మాట్లాడుతుంది రోజి. "ఐనా జేమ్స్ మీద కొపంతొ నేనెందుకు తిండి మానేయాలి?" అనిపించింది. నా కొపాన్ని ఆకలి జయిస్తోంది మెల్లగా. నేను ఆకలికి భరించలేక మళ్ళీ వస్తానని, బతిమాలుతే ఇంకా బెట్టు చేస్తానని జేమ్స్ కి అర్దమైపొయినట్లుంది. నన్ను పట్టించుకొవడం మానేసాడు. నా కొసం అని బోజనం స్పూన్ తొ కాకుండా చేతితొ తింటునట్లున్నాడు. చేతితొ తినడం అలవాటు లేనివాడిలా తంటాలు పడుతుంటే నవ్వొచ్చింది.

వాళ్ళి పిలిచే లా లేరని..నేనే వెళ్ళి కూర్చొని వడ్డించుకున్నాను. నేను వస్తానని ముందే ఊహించినవాడిలా.."దాంక్స్ భవ్య" అన్నాడు జేమ్స్. రోజీ మాత్రం లొలొపల ముసిముసిగా నవ్వుకొంటుంది. తిన్నంతసేపు మాట్లాడకుండా కూర్చున్నా. రోజీ, జేమ్స్ ఏదేదొ మాట్లాడుకుంటు తింటున్నారు. నేను అక్కడ ఉన్న విషయమే గుర్తులేనంతగా మాటల్లొ మునిగిపొయారు.

బోజనాలు అయిపొయాక, బయట వాకింగ్ కి వెల్దాం రమ్మన్నాడు జేమ్స్. నేను రాను అన్నాను. రోజీ నేను వస్తానని బయలుదేరింది.

నాకు రోజీ ప్రవర్తన చూస్తుంటే ఒళ్ళు మండిపొతుంది. ఆ క్షణం లొ రోజీ, జేమ్స్ డేటింగ్ కి వచ్చినట్లుగా నేను మద్యలొ పానకంలొ పుడకలా అనిపించింది. ఏదొ చేయాలని వస్తే ఇంకేదొ అవుతున్నట్లుంది. ఇంక లాభం లేదు ఫుల్ స్టాప్ పెట్టేయాలి డిసైడైపొయాను.

వాళ్ళిద్దరూ వాకింగ్ కి ఫామ్ హౌస్ పక్కనే ఉన్న లేక్ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి జేమ్స్ వాళ్ళ అమ్మ వచ్చింది. జేమ్స్ నన్ను పరిచయం చేయడానికని వాళ్ళ అమ్మని ఇప్పుడు రమ్మని చెప్పాడంట.

ఆవిడ నన్ను చూస్తూనే.." ఓ..యూ ఆర్ మై సన్ న్యు గర్ల్ ఫ్రెండ్??" అని అడిగింది. నాకు ఆ మాటలు ఇరిటేటింగ్ గా అనిపించింది. బావుండదేమోనని మొహమాటంగా నవ్వేను..

"యూ ఆర్ లుకింగ్ సొ గాడ్జియస్" అంది. మురిపెంగా నా బుగ్గలను నిమురుతూ. మెత్తగా ఆమె చేతులు నా చెంపలు తాకగానే..ఏదొ ఆత్మీయసర్శలా అనిపించి కొపం పొయింది.

తను ఇంగ్లీష్ లొ మాట్లాడుతూ "నా కొడుక్కి చాలా మంది అమ్మాయిలతొ పరిచయాలున్నాయి. కానీ ఇంతవరకు ఎవరిని నాకు పరిచయం చేయలేదు. నిన్ను మాత్రమే నాకు పరిచయం చేయాలని, ఎంత పని ఉన్నా ఒప్పుకోకుండా ఎలాగైనా ఈరోజు వచ్చి నిన్ను కలవమని బలవంతం చేసాడు. హీ రియల్లీ లైక్స్ యి " అంది. నాకేం మాట్లాడాలొ తెలియలేదు.

ఆమె రావడం చూసిన లక్ష్మి కాఫీ తీసుకొని వచ్చింది.

ఆవిడ మా పేరెంట్స్ గురించి అడిగింది. నా ఇష్టాఇష్టాలు, చదువు గురించి కాసేపు మాట్లాడింది. తనకి చాలా అర్జెంట్ పనుందని చెప్పి, జేమ్స్ వస్తే కల్సి వెళ్ళానని చెప్పమని చెప్పి బయలుదేరింది.
వెళ్తు.."యూ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్...రియల్లీ మై సన్ ఇజ్ ఏ లక్కీ ఫెలొ..ఆల్ ది బెస్ట్ మై చైల్డ్" అంది. తను నన్ను అలా అనగానే నాకు కొంచెం గర్వం లాంటి ఫీలింగ్ కల్గింది.

ఆవిడ మాటలు వింటుంటే జేమ్స్ నన్ను ఎంతగా కావాలనుకుంటున్నాడొ అర్దమైంది.

ప్రాశ్చాత్య సంస్కృతి లొ పెరిగుతున్న ప్రెజెంట్ జనరేషన్ యూత్ సెక్స్ కొసం తప్ప లవ్ కొసం ఎక్కువ కాలం వృదా చేయరన్న నా అబిప్రాయం జేమ్స్ తప్పని నిరూపిస్తున్నాడు. అతన్ని నేను ఎందుకు అనవసరంగా బాదాపెట్టాలి అనిపించింది. అతని ప్రేమను ఒప్పుకుంటే? ఆలొచన వచ్చింది. అమ్మా, నాన్న గుర్తొచ్చారు. అమ్మ ఈ విషయం వింటే కళ్ళు తిరిగి పడిపొతాది. నాన్న మాత్రం నాలుగు పీకి నన్ను వెంటనే ఇండియా పంపించేస్తాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలొను ఓ ఫారినర్ ని అల్లుడుగా అంగీకరించలేరు. నా మనసు కూడా జేమ్స్ ని పూర్తిగా అంగీకరించలేకపోతుంది.

కానీ జేమ్స్ నన్ను బాగా ఇష్టపడుతున్నాడు...నా కొసం తన ఐడెంటిటీ ని పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. అంత మాత్రాన నేను తనని ప్రేమించాలని లేదు కదా?? నా మనసులొ ఏదొ సంఘర్షణ...ఎటు తేల్చుకొలేని సందిగ్దం..ఇంతవరకు నాలొ కలగని అలజడి...అన్ని కలసి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఆలొచనల నడుమ బాగా నలిగిపొయిన నేను, ఇక అక్కడ ఎక్కువ రొజులు ఉండకూడదని నిర్ణయించుకున్నాను.

అంతలొ జేమ్స్, రోజీ వచ్చారు. రోజీ పడిపడి నవ్వుతూ వస్తూంది. వస్తూనే.." భవ్య యి ఆర్ మిస్సింగ్ లాటాఫ్ ఫన్ విత్ జేమ్స్" అంది. నాకు అదేమి పట్టనట్లు, నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇంటికి వెళ్ళిపొతానని జేమ్స్ తొ చెప్పేసాను.

వారం రోజులు ఉంటానని ఎంతొ ఉత్సాహంగా ఉన్న అతని ఆశలు మీద మొదటి రొజే చప్పున నీళ్ళు చల్లేసరికి అయొమయాంగా చూసాడు.

“ఎస్ జేమ్స్ ఇంకా ఇక్కడే నేను ఉంటే… ఓడిపొతాను. నీ ప్రేమలొ పడిపొతాను. నాకది ఇష్టంలేదు. లెట్ మీ గొ" అన్నాను. అంత బేల గా నేనెప్పుడూ మాట్లాడలేదు.

"వ్వాట్" రోజీ ఆశ్చర్యపొతు..అడిగింది.

మళ్ళీ తనే "హీ ఈజ్ నైస్ గై భవ్య..డొంట్ మిస్ హిమ్" అంది. తనకి జేమ్స్ బాగానచ్చేసినట్లున్నాడు. అందుకే అతన్ని టీజ్ చేసేదల్లా అతన్ని సపొర్ట్ చేయడం మొదలు పెట్టింది.

"నొ అయ్ కాంట్" అన్నాను.

అప్పుడన్నాడు...జేమ్స్ "ఇట్స్ ఓకే..భవ్య! నొ ప్రెజర్స్" అన్నాడు. ఆశ్చర్యపొయాను.

"యు ఆర్ కరక్ట్ భవ్య! లవ్ అనేది ఫీలవ్వాల్సినది. బలవంతంగా పుట్టేది కాదు. ఈ రొజు ఉదయం నుండి నువ్వు అనుభవిస్తున్న టెన్షన్ చాలు. అయామ్ నాట్ మేడ్ ఫర్ యి" అన్నాడు. అలా అనేసాడే గానీ అతను మనసులొ ఎంతబాదపడుతున్నాడొ మొహంలొ కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

నా ఇష్టం మీదొచ్చాను..మళ్ళీ నా ఇష్టం మీదే వెళ్ళిపొతానంటున్నాను. జేమ్స్ కాకుండా ఇంకెవరైనా అయ్యింటే నన్ను అలా సింపుల్ గా వదిలేసేవారు కాదు.

దాంక్స్ చెప్తు, "అయామ్ సోరీ జేమ్స్" అన్నాను.

"నువ్వే గెలిచావు. అయామ్ ఏన్ అన్ లక్కీ గై" అన్నాడు. అంటున్నప్పుడు అతని కళ్ళ లొ సన్నటి నీటి పొర కంటపడింది. తనని బాదపెడుతున్నందుకు జాలేసింది. మళ్ళీ సొరీ చెప్పాను. ఇంకాసేపు అక్కడుంటే..మళ్ళీ మనసు మారిపొతాదేమో అని భయమేసి వచ్చేసాను.

రోజీ, లక్ష్మీ నన్ను తిట్టుకొంటున్నారేమో అనిపించింది. వాళ్ళు ఆడపిల్లలే కదా ఆలొచిస్తే నా బాద అర్దమౌతుందిలే సర్దిచెప్పుకున్నాను.

ప్రేమ అనేది మనకు తెలియకుండానే మన మనసులొ పుట్టాలి. జీవితాంతం మనకు తొడుండగలిగే వ్యక్తి మనకు ఎదురైనప్పుడు..ఆ బావాలు ఆటొమెటిక్ గా మనలొ కలుగుతాయి. జేమ్స్ దగ్గరొ నాకెప్పుడు అలా అనిపించలేదు." భవ్య చెప్పడం ఆపింది.

అంతా విన్న అబిరామ్ కాసేపు మౌనంగా ఉండిపొయాడు. భవ్య మాములు అమ్మాయి కాదు అని అర్దమైంది. తనకి ఏంకావాలొ బాగాతెలుసామెకి. లైఫ్ మీద మంచి క్లారిటీ ఉన్నమ్మాయి. తనకి భవ్యమీద మెల్లమెల్లగా ఇష్టం కలుగుతొంది.

జానకి తర్వాత, తను ఇష్ట పడుతొన్న మొట్ట మొదటి వ్యక్తి భవ్య. కానీ ఆమెలొ ప్రేమ భావం ఎలా కలిగించాలొ అబిరామ్ కి అర్దం కాలేదు. జేమ్స్ లా తనకు చేయడం చేతకాదు. చిన్నప్పడంతా చదువులు, రాంకులుతొ గడిచిపొయింది. పెద్దయ్యాక షేర్స్, టెండర్స్, బిజినెస్, ఇదే లొకం అయిపొయింది. ఆడపిల్ల మనసు బొత్తిగా తెలియని నేను..భవ్యని ఎలా గెలవగలను?? అని అబిరామ్ ఆలొచిస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు.

ముఖ్యంగా అతను బిజినెస్ లొ డీల్ బాగంగా ఇష్టం లేకుండానే భవ్యతొ పెళ్ళికి ఒప్పుకున్నాడు అభిరామ్. భవ్య తండ్రి బలవంతం మీద అతని తొ ఇండియా వస్తుంది. ఆమెకి బిజినెస్ డీల్ విషయం తెలియదు. ఆ విషయం చెప్పొద్దని భవ్య తండ్రి మాట తీసుకున్నాడు. ఆ విషయం తెలిస్తే తన కూతురు అభిరామ్ మొహం కూడా చూడకుండా వెనక్కి వచ్చేస్తుందని వార్నింగ్ ఇచ్చి మరి ఇండియా పంపించాడు.

ఆ వార్నింగ్ అభిరామ్ కి గుర్తొచ్చి, కార్ వేగం తగ్గిపొయింది. నేషనల్ హైవేమీద కొంతదూరం వెళ్ళాక కారుని ఓ పక్కన చెట్టుకింద ఆపి కిందకు దిగాడు. భవ్య కూడా అతని వెనకే దిగుతూ..." ఇంకా ఎంత దూరం?" అడిగింది.

(ఇంకావుంది)

No comments:

Post a Comment