Friday, May 27, 2011

ప్రణయ కావ్యం - 11

ఆ తర్వాత బాగా నిద్ర పట్టేసింది. మద్యాహ్నం ఎప్పుడొ రొజీ వచ్చి లేపితే గానీ మెలుకువ రాలేదు. లంచ్ కని తలుపు దబదబా బాదుతుంటే మెలుకవ వొచ్చింది. మొహం కడుక్కొని వెళ్ళి తలుపు తీసాను.

రోజీ, జేమ్స్, లక్ష్మీ ముగ్గురు కలిసి కారమ్స్ ఆడుతు హల్లొ కనిపించారు. ముగ్గురు అప్పటికే బాగా ఫ్రెండ్స్ అయిపొయినట్లున్నారు. నన్ను చూస్తూనే "కమ్ భవ్య" జేమ్స్ పిలిచాడు. లక్ష్మీ వడ్డించడానికన్నట్లు లేచింది.
"హేయ్ భవ్య.. ఏమో అనుకున్నాను గానీ..జేమ్స్ మంచి ఇంట్రస్టింగ్ కారక్టరే...ఇప్పటి వరకు మమ్మల్ని ఎంత నవ్వించాడొ తెలుసా??" రొజీ జేమ్స్ ని ఆకాశానికి ఎత్తేస్తు అంది. నేను సీరియస్ గా చూసాను తన వైపు. నాకు అతన్ని పొగడటం ఇష్టం లేదు. నా కొపం లాంటి చూపు చూసి, సైలంట్ అయిపొయింది. నన్ను చూసి వాతవరణం గంబీరంగా మారిపొయింది.

లక్ష్మీ అన్నం వడ్డిస్తు "అమ్మగారు సార్ మీకొ నిక్ నేమ్ పెట్టారు తెల్సా?" అంది అమాయకంగా. "ష్ వద్దు" అన్నట్లు రోజీ, జేమ్స్ సైగలు చేయడం అప్రయత్నంగా నా కంట పడింది. ఏంటన్నట్లు చూసాను.
లక్ష్మీ కి వాళ్ళసైగలు అర్దం కాక.. "మీ పేరు భవ్యకదండి దాన్ని చిన్నగా చేసి భౌ అని పెట్టారండి" అంది. చెప్తున్నప్పుడు లక్ష్మీ కి నవ్వు ఆగలేదు.
"వ్వాట్?" అరిచినంత పని చేసాను. కొపంతొ అన్నం పల్లెం దగ్గర నుండి లేచి నిల్చున్నాను. "భౌ" అని నేను మరొసారి ఉచ్చరిస్తుంటే జేమ్స్ కి కూడా నవ్వు ఆగలేదు.
"జేమ్స్ నీకు ఇంతకు ముందే చెప్పాను. అయ్ హేట్ షార్ట్ కట్స్. అయ్ హేట్ యి." కొపంగా అరిచాను. నా అరుపుకి లక్ష్మీ బిక్కచచ్చిపొయింది.

మొట్టమొదటి సారి నా పేరుని ఇలా కామెంట్ చేసినవాడు జేమ్స్. క్షమించరాని నేరం చేసాడు. నా చేతిలొ ఈ రొజు వీడు అయిపోయాడు. మనసులొ ఎదైనా చేయాలని కసితీరా అనుకున్నాను.

"నాట్ బౌ.. భవ్య. ఐ సెడ్ బొ. యు నొ రైన్ బొ.. దట్ బొ" సరిచేస్తు జేమ్స్ చెప్పాడు. ఇంద్ర ధనస్సుతొ పొల్చానని జేమ్స్ నా కొపం కంట్రొల్ లొకి తెస్తు అన్నాడు.
రోజీ నన్ను ఉడికించాలని... "బొ కన్నా బౌ నే బాగుందే" అంది.
"షటప్" అరిచేసి...అన్నం తినకుండా లేచి వచ్చేసాను.

నాతొ పాటే జేమ్స్ కూడా ఉదయంలా తినకుండా లేస్తాడని అనుకున్నా. కానీ తను లేవకుండా ఇంకా కూర్చునే ఉన్నాడు.

"అమ్మాయి గారు మీ కొసం స్పెషల్ డిషస్ చేయించారమ్మా సార్! మీకిష్టమైన దమ్ బిర్యాని చేసానమ్మా." మూతలు తీసి చూపిస్తూ అంది లక్ష్మి. నా ఇష్టాలన్ని ఎలా తెలుసుకున్నాడొ.. "నాకు ఈ రొజు నాన్ వెజ్ తినాలని లేదు." సీరియస్ గా అనేసి, డైనింగ్ టేబిల్ కి కొంచెం దూరంలొ ఉన్న సొఫాలొ కూర్చొంటు అన్నాను.
"కాకరకాయ వేపుడు, సాంబారు కూడా చేసిందే" రోజీ అంది. అవంటే నాకు ప్రాణం. నా ఇష్టాలన్ని ఎలా తెలుసుకున్నాడొ ఏంటొ ముందు ఆ విషయం తెలుసుకొవాలి అనుకుంటు.."ఐనా నాకు ఆకలిగా లేదు." అన్నాను మొండిగా.
"నాకు మంచి ఆకలిగా ఉంది. ఐ కాంట్" అనేసి రోజీ వాటి మీద దాడి చేయడం మొదలుపెట్టింది.
"ప్లీజ్ కమ్ భవ్య" జేమ్స్ బతిమాలుతున్నట్లు అన్నాడు.
నేను పక్కనే ఉన్న గోడంత ఎత్తున్న అద్దం వైపు మొహం తిప్పేసాను. బయట పూలమొక్కలు ఆ అద్దంలొ నుండి కనిపిస్తున్నాయి. నా చేష్టలు పొగరులా అనిపించాయో ఏమో మళ్ళి పిలవలేదు.

నాకు ఆకలి మొదలైంది. మళ్ళీ పిలిస్తే వెళ్ళాలని చూసా...కానీ ఎవరూ నన్ను పట్టించుకొనట్లు ఒక్కొ ఐటమ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు.

నన్ను ఊరిస్తు మాట్లాడుతుంది రోజి. "ఐనా జేమ్స్ మీద కొపంతొ నేనెందుకు తిండి మానేయాలి?" అనిపించింది. నా కొపాన్ని ఆకలి జయిస్తోంది మెల్లగా. నేను ఆకలికి భరించలేక మళ్ళీ వస్తానని, బతిమాలుతే ఇంకా బెట్టు చేస్తానని జేమ్స్ కి అర్దమైపొయినట్లుంది. నన్ను పట్టించుకొవడం మానేసాడు. నా కొసం అని బోజనం స్పూన్ తొ కాకుండా చేతితొ తింటునట్లున్నాడు. చేతితొ తినడం అలవాటు లేనివాడిలా తంటాలు పడుతుంటే నవ్వొచ్చింది.

వాళ్ళి పిలిచే లా లేరని..నేనే వెళ్ళి కూర్చొని వడ్డించుకున్నాను. నేను వస్తానని ముందే ఊహించినవాడిలా.."దాంక్స్ భవ్య" అన్నాడు జేమ్స్. రోజీ మాత్రం లొలొపల ముసిముసిగా నవ్వుకొంటుంది. తిన్నంతసేపు మాట్లాడకుండా కూర్చున్నా. రోజీ, జేమ్స్ ఏదేదొ మాట్లాడుకుంటు తింటున్నారు. నేను అక్కడ ఉన్న విషయమే గుర్తులేనంతగా మాటల్లొ మునిగిపొయారు.

బోజనాలు అయిపొయాక, బయట వాకింగ్ కి వెల్దాం రమ్మన్నాడు జేమ్స్. నేను రాను అన్నాను. రోజీ నేను వస్తానని బయలుదేరింది.

నాకు రోజీ ప్రవర్తన చూస్తుంటే ఒళ్ళు మండిపొతుంది. ఆ క్షణం లొ రోజీ, జేమ్స్ డేటింగ్ కి వచ్చినట్లుగా నేను మద్యలొ పానకంలొ పుడకలా అనిపించింది. ఏదొ చేయాలని వస్తే ఇంకేదొ అవుతున్నట్లుంది. ఇంక లాభం లేదు ఫుల్ స్టాప్ పెట్టేయాలి డిసైడైపొయాను.

వాళ్ళిద్దరూ వాకింగ్ కి ఫామ్ హౌస్ పక్కనే ఉన్న లేక్ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి జేమ్స్ వాళ్ళ అమ్మ వచ్చింది. జేమ్స్ నన్ను పరిచయం చేయడానికని వాళ్ళ అమ్మని ఇప్పుడు రమ్మని చెప్పాడంట.

ఆవిడ నన్ను చూస్తూనే.." ఓ..యూ ఆర్ మై సన్ న్యు గర్ల్ ఫ్రెండ్??" అని అడిగింది. నాకు ఆ మాటలు ఇరిటేటింగ్ గా అనిపించింది. బావుండదేమోనని మొహమాటంగా నవ్వేను..

"యూ ఆర్ లుకింగ్ సొ గాడ్జియస్" అంది. మురిపెంగా నా బుగ్గలను నిమురుతూ. మెత్తగా ఆమె చేతులు నా చెంపలు తాకగానే..ఏదొ ఆత్మీయసర్శలా అనిపించి కొపం పొయింది.

తను ఇంగ్లీష్ లొ మాట్లాడుతూ "నా కొడుక్కి చాలా మంది అమ్మాయిలతొ పరిచయాలున్నాయి. కానీ ఇంతవరకు ఎవరిని నాకు పరిచయం చేయలేదు. నిన్ను మాత్రమే నాకు పరిచయం చేయాలని, ఎంత పని ఉన్నా ఒప్పుకోకుండా ఎలాగైనా ఈరోజు వచ్చి నిన్ను కలవమని బలవంతం చేసాడు. హీ రియల్లీ లైక్స్ యి " అంది. నాకేం మాట్లాడాలొ తెలియలేదు.

ఆమె రావడం చూసిన లక్ష్మి కాఫీ తీసుకొని వచ్చింది.

ఆవిడ మా పేరెంట్స్ గురించి అడిగింది. నా ఇష్టాఇష్టాలు, చదువు గురించి కాసేపు మాట్లాడింది. తనకి చాలా అర్జెంట్ పనుందని చెప్పి, జేమ్స్ వస్తే కల్సి వెళ్ళానని చెప్పమని చెప్పి బయలుదేరింది.
వెళ్తు.."యూ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్...రియల్లీ మై సన్ ఇజ్ ఏ లక్కీ ఫెలొ..ఆల్ ది బెస్ట్ మై చైల్డ్" అంది. తను నన్ను అలా అనగానే నాకు కొంచెం గర్వం లాంటి ఫీలింగ్ కల్గింది.

ఆవిడ మాటలు వింటుంటే జేమ్స్ నన్ను ఎంతగా కావాలనుకుంటున్నాడొ అర్దమైంది.

ప్రాశ్చాత్య సంస్కృతి లొ పెరిగుతున్న ప్రెజెంట్ జనరేషన్ యూత్ సెక్స్ కొసం తప్ప లవ్ కొసం ఎక్కువ కాలం వృదా చేయరన్న నా అబిప్రాయం జేమ్స్ తప్పని నిరూపిస్తున్నాడు. అతన్ని నేను ఎందుకు అనవసరంగా బాదాపెట్టాలి అనిపించింది. అతని ప్రేమను ఒప్పుకుంటే? ఆలొచన వచ్చింది. అమ్మా, నాన్న గుర్తొచ్చారు. అమ్మ ఈ విషయం వింటే కళ్ళు తిరిగి పడిపొతాది. నాన్న మాత్రం నాలుగు పీకి నన్ను వెంటనే ఇండియా పంపించేస్తాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలొను ఓ ఫారినర్ ని అల్లుడుగా అంగీకరించలేరు. నా మనసు కూడా జేమ్స్ ని పూర్తిగా అంగీకరించలేకపోతుంది.

కానీ జేమ్స్ నన్ను బాగా ఇష్టపడుతున్నాడు...నా కొసం తన ఐడెంటిటీ ని పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. అంత మాత్రాన నేను తనని ప్రేమించాలని లేదు కదా?? నా మనసులొ ఏదొ సంఘర్షణ...ఎటు తేల్చుకొలేని సందిగ్దం..ఇంతవరకు నాలొ కలగని అలజడి...అన్ని కలసి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఆలొచనల నడుమ బాగా నలిగిపొయిన నేను, ఇక అక్కడ ఎక్కువ రొజులు ఉండకూడదని నిర్ణయించుకున్నాను.

అంతలొ జేమ్స్, రోజీ వచ్చారు. రోజీ పడిపడి నవ్వుతూ వస్తూంది. వస్తూనే.." భవ్య యి ఆర్ మిస్సింగ్ లాటాఫ్ ఫన్ విత్ జేమ్స్" అంది. నాకు అదేమి పట్టనట్లు, నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇంటికి వెళ్ళిపొతానని జేమ్స్ తొ చెప్పేసాను.

వారం రోజులు ఉంటానని ఎంతొ ఉత్సాహంగా ఉన్న అతని ఆశలు మీద మొదటి రొజే చప్పున నీళ్ళు చల్లేసరికి అయొమయాంగా చూసాడు.

“ఎస్ జేమ్స్ ఇంకా ఇక్కడే నేను ఉంటే… ఓడిపొతాను. నీ ప్రేమలొ పడిపొతాను. నాకది ఇష్టంలేదు. లెట్ మీ గొ" అన్నాను. అంత బేల గా నేనెప్పుడూ మాట్లాడలేదు.

"వ్వాట్" రోజీ ఆశ్చర్యపొతు..అడిగింది.

మళ్ళీ తనే "హీ ఈజ్ నైస్ గై భవ్య..డొంట్ మిస్ హిమ్" అంది. తనకి జేమ్స్ బాగానచ్చేసినట్లున్నాడు. అందుకే అతన్ని టీజ్ చేసేదల్లా అతన్ని సపొర్ట్ చేయడం మొదలు పెట్టింది.

"నొ అయ్ కాంట్" అన్నాను.

అప్పుడన్నాడు...జేమ్స్ "ఇట్స్ ఓకే..భవ్య! నొ ప్రెజర్స్" అన్నాడు. ఆశ్చర్యపొయాను.

"యు ఆర్ కరక్ట్ భవ్య! లవ్ అనేది ఫీలవ్వాల్సినది. బలవంతంగా పుట్టేది కాదు. ఈ రొజు ఉదయం నుండి నువ్వు అనుభవిస్తున్న టెన్షన్ చాలు. అయామ్ నాట్ మేడ్ ఫర్ యి" అన్నాడు. అలా అనేసాడే గానీ అతను మనసులొ ఎంతబాదపడుతున్నాడొ మొహంలొ కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

నా ఇష్టం మీదొచ్చాను..మళ్ళీ నా ఇష్టం మీదే వెళ్ళిపొతానంటున్నాను. జేమ్స్ కాకుండా ఇంకెవరైనా అయ్యింటే నన్ను అలా సింపుల్ గా వదిలేసేవారు కాదు.

దాంక్స్ చెప్తు, "అయామ్ సోరీ జేమ్స్" అన్నాను.

"నువ్వే గెలిచావు. అయామ్ ఏన్ అన్ లక్కీ గై" అన్నాడు. అంటున్నప్పుడు అతని కళ్ళ లొ సన్నటి నీటి పొర కంటపడింది. తనని బాదపెడుతున్నందుకు జాలేసింది. మళ్ళీ సొరీ చెప్పాను. ఇంకాసేపు అక్కడుంటే..మళ్ళీ మనసు మారిపొతాదేమో అని భయమేసి వచ్చేసాను.

రోజీ, లక్ష్మీ నన్ను తిట్టుకొంటున్నారేమో అనిపించింది. వాళ్ళు ఆడపిల్లలే కదా ఆలొచిస్తే నా బాద అర్దమౌతుందిలే సర్దిచెప్పుకున్నాను.

ప్రేమ అనేది మనకు తెలియకుండానే మన మనసులొ పుట్టాలి. జీవితాంతం మనకు తొడుండగలిగే వ్యక్తి మనకు ఎదురైనప్పుడు..ఆ బావాలు ఆటొమెటిక్ గా మనలొ కలుగుతాయి. జేమ్స్ దగ్గరొ నాకెప్పుడు అలా అనిపించలేదు." భవ్య చెప్పడం ఆపింది.

అంతా విన్న అబిరామ్ కాసేపు మౌనంగా ఉండిపొయాడు. భవ్య మాములు అమ్మాయి కాదు అని అర్దమైంది. తనకి ఏంకావాలొ బాగాతెలుసామెకి. లైఫ్ మీద మంచి క్లారిటీ ఉన్నమ్మాయి. తనకి భవ్యమీద మెల్లమెల్లగా ఇష్టం కలుగుతొంది.

జానకి తర్వాత, తను ఇష్ట పడుతొన్న మొట్ట మొదటి వ్యక్తి భవ్య. కానీ ఆమెలొ ప్రేమ భావం ఎలా కలిగించాలొ అబిరామ్ కి అర్దం కాలేదు. జేమ్స్ లా తనకు చేయడం చేతకాదు. చిన్నప్పడంతా చదువులు, రాంకులుతొ గడిచిపొయింది. పెద్దయ్యాక షేర్స్, టెండర్స్, బిజినెస్, ఇదే లొకం అయిపొయింది. ఆడపిల్ల మనసు బొత్తిగా తెలియని నేను..భవ్యని ఎలా గెలవగలను?? అని అబిరామ్ ఆలొచిస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు.

ముఖ్యంగా అతను బిజినెస్ లొ డీల్ బాగంగా ఇష్టం లేకుండానే భవ్యతొ పెళ్ళికి ఒప్పుకున్నాడు అభిరామ్. భవ్య తండ్రి బలవంతం మీద అతని తొ ఇండియా వస్తుంది. ఆమెకి బిజినెస్ డీల్ విషయం తెలియదు. ఆ విషయం చెప్పొద్దని భవ్య తండ్రి మాట తీసుకున్నాడు. ఆ విషయం తెలిస్తే తన కూతురు అభిరామ్ మొహం కూడా చూడకుండా వెనక్కి వచ్చేస్తుందని వార్నింగ్ ఇచ్చి మరి ఇండియా పంపించాడు.

ఆ వార్నింగ్ అభిరామ్ కి గుర్తొచ్చి, కార్ వేగం తగ్గిపొయింది. నేషనల్ హైవేమీద కొంతదూరం వెళ్ళాక కారుని ఓ పక్కన చెట్టుకింద ఆపి కిందకు దిగాడు. భవ్య కూడా అతని వెనకే దిగుతూ..." ఇంకా ఎంత దూరం?" అడిగింది.

(ఇంకావుంది)

Tuesday, May 24, 2011

ప్రణయ కావ్యం - 10


జరిగిన కధ
(అమెరికాలొ పెద్ద బిజినెస్ మాన్ అయిన అభిరామ్, భవ్య అనే గొప్పింటి అమ్మాయి ఒకరంటే ఒకరి కి ఇష్టం లేకుండా నే ఇండియా బయలుదేరుతారు. విమానంలొ అబిరామ్ భవ్యతొ తన చిన్నప్పటినుండి జరిగిన సంఘటనలు చెప్తాడు. అతను మరదలు జానకి ని చిన్నప్పటినుండి ప్రేమిస్తాడు. అబిరామ్ ఇంజనీరింగ్ చదువు వలన జానకి కి నాలుగేళ్ళు దూరంగా ఉంటాడు. జానకి పాలేరు రఘుని ప్రేమిస్తుంది. జానకి ప్రేమ కొసం తన ప్రేమను త్యాగం చేసి వాళ్ళ నాన్న ని ఎదురించి రఘుతొ పెళ్ళి చేస్తాడు అభిరామ్. భవ్య తనగురించి చెప్తు, కాలేజీ రొజుల్లొ తన వెంటపడిన జేమ్స్ గురించి చెప్తుంది. జేమ్స్ ను వదిలించుకొవడానికి అతనితొ వారంరొజులు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కు అంగీకరిస్తుంది భవ్య. తర్వాత చదవండి.)












కొంత దూరం వెళ్ళాక..తన ఆలొచనలలొ నుండి బయటకొస్తూ "తర్వాత ఎమైంది " అభిరామ్ అడిగాడు.

అందుకొసమే వెయిట్ చేస్తున్నదానిలా భవ్య హూషారుగా, " తర్వాత నేను, రోజీ జేమ్స్ ఫామ్ హౌస్ కి వెళ్ళాం"

సిటీ కి దూరంగా ఓ చిన్న చెరువు పక్కన ఆ ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ చుట్టురా డాగ్ ఉడ్ చెట్లు పింక్ అండ్ వైట్ కలర్స్ లొ మనొహరంగా ఉన్నాయి. మద్యలొ ముచ్చటైన అద్దాల బిల్డింగ్, దాని చుట్టు పెద్ద ప్రహరీ గొడ, గొడ నల్లుకొని అవేవొ రంగు రంగుల పూల తీగలున్నాయి. మొత్తంగా ఆ ప్లేస్ చూస్తుంటే, బృందావనం లొ ఉన్నట్లుగా అనిపించింది నాకు. అప్పటివరకు ఉన్న భయం ఎగిరిపొయింది.

"భవ్యా.. ఇల్లు చూస్తుంటే జేమ్స్ డాడీ మీ డాడీ లా మంచి సౌండ్ పార్టీలా వున్నాడే." రొజీ కాంపౌడ్ లొ అడుగుపెడుతూ అన్నాది.

ఇంటినిండా అందమైన ఫర్నిచర్, ఇంటీరియర్ భవ్య కి బాగా నచ్చేసాయి. అంతా తన టేస్ట్ కి అనుకూలంగా అమర్చినట్లుంది....ఆ ఇల్లు.

ఎలా అయినా నా మనసుని గెలవాలని జేమ్స్ బాగా ప్రిపేర్ అయినట్లున్నాడు. నన్ను బాగా స్టడీ చేసి మరి నా టేస్ట్ కి తగ్గట్లు ఇంటీరియర్ డెకరేట్ చేసాడు. మా రాకను గమనించిన జేమ్స్..హల్లొ కి వస్తూ

రోజీ ని "హయ్" అని పలకరించేసి, నా వైపు తిరిగి.."వెలకమ్ మై స్వీటీ. అయామ్ వైటింగ్ ఫర్ యి" అన్నాడు.
అతని పిలుపు కొత్తగా అనిపించింది. అక్కడ టీ పాయ్ మీదున్న ఫ్లవర్ బొకే అందిస్తూ " వెలకమ్ టు మై పారడైజ్" అన్నాడు.
"దాంక్యు" అన్నాను గానీ.. ఈ బొకేల పిచ్చేంటొ నాకర్దం కాలేదు. నిజానికి నాకు పూలంటే ఎందుకొ నచ్చదు." భవ్య చెప్పడం ఆపింది.

అబిరామ్ చిత్రంగా ఆమె వంక చూసాడు. పూలంటే పడని అమ్మాయిలుంటారా? అని ఆశ్చర్యపోయాడు. ఆమె కూడా తనలానే ఆలొచిస్తుంటుందని మాత్రం అర్దమయ్యింది.

"అతను అలా వెలకమ్ చెప్తున్నప్పుడు, అతని ఒంటిమీద షార్ట్స్ తప్ప, చొక్కాలేదు. అప్పటివరకు బాగా తాగి పడుకున్నట్లున్నాడు. కళ్ళు కొంచెం ఉబ్బినట్లున్నాయి.
"ఇక్కడున్నన్నాళ్ళు మనకి వీడి ఎక్స్ పొజింగ్ చూడక తప్పేట్లు లేదు" రొజీ నాకు మాత్రమే వినపడేట్లుగా అంది. నాకు కూడా అతన్ని అలా చూడటం ఇబ్బంది గా అనిపించి...

" James.. I have a request." అన్నాను. "Ya..ya tell me" అన్నాడు.

"To be frank, It is s not a request. I have some conditions to stay with you” అన్నాను.

"No Problem..Tell me" అన్నాడు.

"Thank you" అనేసి మొహమాట పడకుండా.." మేం ఇక్కడ ఉన్నన్నాళ్ళూ నువ్వు డ్రింక్ చేయకూడదు. ఇలా సెమీ న్యూడ్ గా మా ముందు తిరగకూడదు. ఇంకా నన్ను స్వీటీ, నాటీ అని కాకుండా భవ్య అని పిలువు చాలు" అన్నాను.

ఒక రెండు సెకన్లు పాటు ఆలొచించి, "Oki. You are my guest. I respect your feelings…and I agree your conditions" అన్నాడు. హమ్మయ్య అనిపించింది. కానీ నాకు తెలుసు జేమ్స్ తాగకుండా ఉండలేడని. ఇంకా డ్రెస్సింగ్ విషయంలొ కూడా కావాలనే ఇబ్బంది పెట్టాను. అలా అయినా నన్ను భరించలేక వద్దంటాడని నా ఆశ.

నేను తన ఫామ హౌస్ కి రావడమే అతనికి పెద్ద ఆనందాన్నిచ్చినట్లుంది. ఇల్లంతా దగ్గరుండి చూపించాడు. మా ఇద్దరి గదులు చూపిస్తూ..ప్రెష్అప్ అయ్యి వస్తే బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అన్నాడు. ఓకే చెప్పెసి గదుల్లొకి వెళ్ళిపొయాం.

నా రూమ్ చాలా విశాలంగా ఉంది. కిటికీ దగ్గర నిల్చుని చూస్తే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తూంది. నిజం చెప్పాలంటే నా బెడ్ రూమ్ కన్నా ఈ రూమ్ నాకు బాగా నచ్చేసింది. అందమైన పైయింటింగ్స్ గొడల చూట్టురా ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జేమ్స్, వాళ్ళమ్మ ఫొటొ కనపడింది. అప్పుడు అర్దమయ్యింది నాకిచ్చిన రూమ్ జేమ్స్ పర్సనల్ బెడ్ రూమ్ అని. అంటే రోజీకి గెస్ట్ రూమ్ ఇచ్చినట్లున్నాడు. నాకది జేమ్స్ బెడ్ రూమ్ అని అర్దమవ్వగానే కంఫర్టబుల్ గా అనిపించక బయటకొచ్చేసాను.

డైనింగ్ టేబిల్ దగ్గర ఎవరొ పనమ్మాయితొ మాట్లాడుతూ ఉన్న జేమ్స్ నన్ను చూసి "వాట్ హేపండ్ భవ్య" అడిగాడు.

"I think that is your bed room!" కొంచెం కొపం నిండిన స్వరం తొ అన్నాను.

“Sorry Bhavya. In this premises that is only one bed room you will like it. Some other rooms are there, but you may not like it” అన్నాడు.
“Its ok. Show me some other room. I will adjust” అన్నాను. ఇంకా ఏదొ చెప్పాలని చూసాడు..నేను ఒప్పుకొలేదు. పరాయి వాళ్ళ బెడ్ రూమ్ లొ అడుగుపెట్టడమే నాకు నచ్చదు..అలాంటిది..జేమ్స్ బెడ్ మీదా?? ఓహ్ ఆ ఊహే ఇరిటేటింగ్ గా అనిపించింది. అయిష్టంగానే ఇంకొ గది చూపించాడు. నాకు ఆ గది నచ్చలేదు. ఇంకా విసిగించడం బాగొదని, "దాంక్యు" అనేసి లొపలకు వెళ్ళి అతని మొహం మీద నే డొర్ వేసేసాను. నా ప్రవర్తన అతనికి చిరాకు తెప్పించాలి. అదే నా విజయం మరి.

స్నానాలు అయ్యాక, టిఫిన్స్ కి రోజీ నేను వచ్చాం. పనమ్మాయి వడ్డిస్తుంటే...తను తెలుగమ్మాయి లా అనిపించి, "How come you have an Indian made?" జేమ్స్ ని అడిగాను.

అతను మాట్లాడే లొపే, ఆ అమ్మాయి "నాది పాలకొల్లు అమ్మాయి గారు. మీ కొసమనే మా సార్ నన్ను ఇక్కడికి పనిలొకి తీసుకొచ్చారు. నిన్న నే పనిలొ జాయిన్ అయ్యాను" తెలుగువాళ్ళను చూసిన ఉత్సాహంలొ పరిచయం చేసుకుంది.
"అవునా.??. ఏం పేరు" ఆశ్చర్యపోతూ అడిగింది రోజీ.
"లక్ష్మి అండి." అంది. నా వైపు తిరిగి, "మీకు అన్ని తెలుగు వంటలే ఇష్టమంట... కదండి.. అందుకే పెసరట్టు ఉప్మా చేసాను." నా ప్లేట్ లొ వడ్డిస్తూ అంది.
చాలా కలుపుగొలుగా మాట్లాడుతున్న ఆ అమ్మాయి ని చూస్తూంటే మొత్తం ఆంద్రా అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది.
జేమ్స్ నాకొసం అంతలా ఆలొచిస్తున్నాడని అర్దమయ్యి, "దాంక్స్ జేమ్స్" అన్నాను అప్రయత్నంగా మెదటిసారి నా మనసులొంచి.
"అబ్బొ గురుడు..నిన్ను ఎలా అయినా పడేయాలని పెద్ద స్కెచ్చే గీసాడే" రోజి నొరెళ్ళబెడుతూ అంది.
"నిజమే రిజక్ట్ చేయాలని వచ్చి, ఓకే చెప్పేసేటట్లున్నాను. కొంచం జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకొని, వంటలు నచ్చనట్లు అయిష్టంగా మొహం పెడుతు తింటున్నాను.
"ఎనీ దింగ్ రాంగ్" జేమ్స్ కంగారుపడుతూ అడిగాడు. నేను సమాదానం చెప్పలేదు.

తను ఏమనుకున్నాడొ మళ్ళీ అడగలేదు.
"లక్ష్మి నీకు పప్పుచారు చేయడం వచ్చా?" రోజీ అడుగుతుంటే.. "వచ్చమ్మాయిగొరు. మీకు ఏం కావలన్నా నాకు చెప్పండి..చిటికెలొ చేసేస్తాను." ఉత్సాహంగా అంది. దాదాపు మా వయసే ఉండొచ్చు లక్ష్మికి. ఎంచక్కా అన్నివంటలు వచ్చనుకుంటా. నాకు కనీసం టీ పెట్టుకొని తాగడం రాదు. దాదాపు రోజీ పరిస్దితీ అంతే. పెళ్ళయ్యాక మా పరిస్దితి ఏంటొ ఆలొచించాలంటే భయం వేసింది. ఈ వన్ వీక్ లక్ష్మి దగ్గర వంటలు నేర్చుకుంటే సరి. టైమ్ పాస్ కూడా అవుతుంది." మనసులొ అనుకున్నాను.
"అయ్ లైక్ యువర్ ఇండియన్ డిషస్" మాటలు కలపడానికి జేమ్స్ అన్నాడు.
నేను వినలేనట్లు "అయామ్ త్రూ" అనేసి లేచి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కున్నాను. నా వెనకే రోజీ ఫాలొ అయ్యింది. జేమ్స్ ఫీల్ అయ్యింటాడు..అవ్వాలనే కదా అలాచేసాను. తను చేస్తున్న టిఫిన్ పుర్తి కాకుండానే జేమ్స్ లేచాడు. నాకు వెనక్కి చూడడానికి దైర్యం చాలలేదు.

కాసేపు హల్లొ కూర్చొని అక్కడున్న మేగజైన్స్ తిరగేసాం ఇద్దరం. అన్ని లేడీస్ కి సంబందించిన మేగజైన్స్ ఉన్నాయక్కడ. రోజీ లేటెస్ట్ ఫాషన్స్ కి సంబదించిన బుక్ ఒకటి సీరియస్ గా చూస్తూ కూర్చుంది. నాకు బొర్ కొట్టి బయట గార్డెన్ లొకి వచ్చాను. నా వెనకే జేమ్స్ కూడా వచ్చాడు.

ఓ చెట్టుకింద సిమెంట్ చప్టా మీద కూర్చున్నాను. తను నా పక్కనే కూర్చుంటు..

“Are you comfortable here??" అడిగాడు. లేదంటే ప్రేమించడం మానేసి బుద్దిగా వదిలేస్తాడా? అడగాలనిపించి మళ్ళీ ఎందుకొ మౌనంగా ఉండిపోయాను. కాసేపు అతను నిశబ్దంగా కూర్చున్నాడు.
తర్వాత తనే "దాంక్స్ భవ్య." అన్నాడు. ఎందుకన్నట్లు చూసాను

"నా ప్రేమను నీకు చూపించుకునేందుకు నాకొ చాన్స్ ఇస్తున్నందుకు..రియల్లీ దాంక్యు వేరీ మచ్ భవ్య. నువ్వు నన్ను, నా ప్రేమను ఏక్సప్ట్ చేసినా చేయకున్నా..నీతొ గడుపుతున్న ఈ సమయం చాలు నా జీవితాంతం ఓ మదురానుభుతిగా మలుచుకొనేందుకు" అన్నాడు. అంత అద్బుతమైన తెలుగు తను మాట్లాడుతుంటే..నేను నొరు వెళ్ళబెట్టేసాను.

“I don’t know…why I am loving you. But really I need you” అన్నాడు.

నాకు తను అలా మాట్లాడుతుంటే అతన్ని రిజక్ట్ ఎందుకు చేస్తున్నానా అనిపించింది. దేశం, భాష, రంగు ఇలాంటికారణాలన్ని పక్కన పెడితే తనని వద్దనడానికి ఏ కారణం కనిపించలేదు. నేను మాట్లడలేకపొతున్నానెందుకొ... తన పక్కన మరొనిమషం కూర్చొలేనిదానిలా అక్కడి నుండి లేచి వచ్చేసాను.

తన అక్కడనుండి కదలకుండా..జేబులొ నుండి మౌత్ ఆర్గాన్ తీసి వాయించడం మొదలు పెట్టాడు. మంద్రంగా నా చెవిని తాకాయి ఆ రాగాలు. నా అడుగులు వేగం తగ్గింది. అతని రాగంలొ జీవం నాకాళ్ళకు అడ్డం పడి, నన్ను వదిలి వెళ్ళొద్దు అని బతిమాలుతున్నట్లుగా తొచాయి. చెవులు రెండు బలవంతంగా మూసుకొని, నా గదిలొ పరిగెత్తాను.

తలుపులు బలంగా వేసినా..అతని మౌత్ ఆర్గాన్ స్వరాలు నన్ను వదలడం లేదు. తలగడ బలంగా తలకు ఆన్చుకొని పడుకున్నాను.


(ఇంకావుంది)

Sunday, May 22, 2011

ప్రణయ కావ్యం - 9

ఆ రొజు సాయంత్రం నేను సాల్స డాన్స్ క్లాస్ లొ ఉండగా జేమ్స్ ఫ్లవర్ బొకే తొ అక్కడికొచ్చాడు. నేను సీరియస్ గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే, బయట సెక్యురిటీ తొ గొడవపడటం నా క్లాస్ ఫ్రెండ్స్ రొజీ, నిమ్మీ చూసారు. మేం ప్రాక్టీస్ చేసే రూమ్ ఓపెన్ టెర్రస్ కావడంతొ గొడ దగ్గర కుర్చున్న వాళ్ళు అతన్ని చూసి,
"ఏయ్..నీ వైట్ గొట్ వచ్చిందే" ఇంగ్లీష్ లొ అన్నారు.

వాళ్ళు అలా అనగానే వచ్చింది ఎవరొ అర్దమయ్యింది. ఈ మద్య జేమ్స్ నా వెంటపడటం చూసి, వాళ్ళు అతనికి వైట్ గొట్ అని నిక్ నేమ్ పెట్టారు. ఈ రొజుతొ అతని న్యూసెన్స్ వదిలించుకొవాలని నిర్ణయించుకొని చేస్తున్న డాన్స్ మద్యలొ ఆపేసి, బయటకొచ్చాను. అతన్ని ఆట పట్టించడానికి నా ప్రెండ్స్ కూడా నాతొ బయటకొచ్చారు.

నన్ను చూస్తునే " హయ్ భవ్య" మొహం చాటంత చేసుకొని పలకరించాడు దూరం నుండే.

పార్క్ చేసిన నా కార్ దగ్గరకొస్తు "హయ్ జే....హియర్ జెంట్స్ నాట్ అలౌడ్. వెయిట్ అయామ్ కమింగ్" అని చెప్పాను. తను సెక్యురిటీ ని ఇంగ్లీష్ లొ ఏదొ తిడుతూ.. గేట్ బయట వున్న పేవ్ మెంట్ మీద కూర్చున్నాడు.

మరొ ఐదు నిమిషాల్లొ కార్ తీసుకొని బయటకొచ్చాను. ప్రెండ్స్ ఇద్దరూ వెనక సీట్లొ కూర్చున్నారు.

జేమ్స్ ని "కమ్ ఇన్" అని పిలవడం లేటు.. హుషారుగా "దాంక్స్ భవ్య" అంటు డొర్ తీసుకొని ఫ్రంట్ సీట్లొ కూర్చున్నాడు.

కార్ గేర్ మారుస్తూ.." యా టెల్ మీ" అన్నాను.

కొంచెం కూడా ఆలస్యం చేయకుండా " ఐ లవ్ యి భవ్య" ఫ్లవర్ బొకే నా ఒల్లొ పెడుతూ అన్నాడు. అది ఊహించినదే కావడంతొ నేనేం కంగారు పడలేదుగానీ, వెనక కూర్చున్న ఇద్దరు కిసుక్కున నవ్వారు. తను ఫీల్ అవుతాడని "ష్" అని వాళ్ళని మందలించాను.

“Why don’t you understand James? We are not made for each other” విసుగ్గా అన్నాను.

"But Why??" అని అడిగాడు.

“Colors not matching” ప్రెండ్స్ జొక్ చేసారు..
నవ్వొచ్చింది. ఆపుకున్నాను. నిజమే వాళ్ళన్నట్లు తను అమెరికన్ అవ్వడం మూలనేమో.. మరీ తెల్ల గా ఉంటాడు. కానీ అసలు కారణం అది కాదు.

“God made me like this. What to do??” చాలా బాదపడిపొతు అన్నాడు.

“That is not the reason J.” అంటే..”Then What?” వెంటనే అడిగాడు.

"వీడి కి ఎలా చెపితే అర్దమౌతుందే..చిరాగ్గా ప్రెండ్స్ తొ అన్నాను.

“No problems tell me in Telugu. I can understand.” అన్నాడు

"ఒరేయ... లేంగ్వేజ్ ప్రాబ్లమ్ కాదురా బాబు" అన్నాను. పాపం నాకొసం తెలుగు కూడా నేర్చుకున్నాడు.

"సరే విను" అని తెలుగులొనే చెప్పడం మొదలు పెట్టాను.

"నా లవర్ నేను ఎలా ఉండాలనుకున్నానొ...నువ్వు అలా లేవు. తను తెల్లగా ఉండాలనుకున్నా గానీ మరీ ఇలా తెల్ల పెయింట్ వేసినట్లు కాదు. మంచి హైట్ ఉండాలనుకున్నాగానీ..మరీ నీలా తాటిచెట్టులా కాదు. ముఖ్యంగా నా లవర్ కి మాంచి మీసాలు ఉండాలి. నీ మూతి నేషనల్ హైవేలా ఉంటుంది. ఈ మూడు రీజన్స్ చాలా?" కార్ అతని ఇంటి ముందుకు వచ్చాక ఆపుతు అడిగాను.

అతను నా అందం చూసి నాకు ఐ లవ్ యి చెప్పాడు. అతన్ని రిజక్ట్ చేయడానికి అలాంటి కారణాలే కరక్ట్ అని అనిపించి అలా అన్నాను. నిజానికి నాకు ఇండియన్..అదీ అచ్చ తెలుగు ఆంద్రా వాడ్ని చేసుకొవాలని కొరిక. జేమ్స్ మంచొడేగానీ ప్రేమించేంత కాదు.

“Common Bhavya, Don’t tell me silly reasons” కొపంగా అన్నాడు,

"అది కాదు జేమ్స్. టు బి ఫ్రాంక్.. మన రంగులు లాగే మన దేశాలు, ఆచారాలు, సంప్రదాయాలు వేరు. లవ్ చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. తర్వాతే అసలు సమస్యలు మొదలౌతాయి. నాకు నచ్చినట్లు నువ్వు ఉండలేవు.. నీకు నచ్చినట్లు నేను ఉండలేను. నువ్వు నాకొసం నా బాష నేర్చుకున్నంత ఈజీ కాదు...నాతొ కల్సి ఉండటం. Try to Understand J. నువ్వు నన్ను ఒక వారం కూడా భరించలేవు.” అన్నాను.

“I can. Please don’t reject my love” అన్నాడు. చెప్తున్నప్పుడు అతని కళ్ళలొ చూసాను. నన్ను బలంగా కావలనుకొంటున్నట్లున్నాడు. నా తిరస్కారాన్ని భరించలేనివాడిలా మొహం పెట్టాడు.

తనకు మాటలతొ చెప్తే లాభం లేదు. నా చేతల తొ అతనికి అసహ్యం కలిగేలా చేయాలని నిర్ణయించుకొని " సరే ఒక పని చేద్దాం" అన్నాను. ఏంటన్నట్లు ఇంట్రస్టింగ్ గా చూసాడు.

“కావలంటే మనిద్దరం ఒన్ వీక్ కల్సి ఉందాం. అప్పటికీ నన్ను నువ్వు లవ్ చేస్తే.. I will marry you. But one thing అడ్జస్ట్ అవ్వడం అసలు నా బ్లడ్ లొనే లేదు. నీ కొసం నా అలవాట్లు మార్చుకొలేను.” అన్నాను.

“I will adjust for you. Because I need you” అన్నాడు ఉత్సాహంగా.

నా ప్రపొజల్ విని ప్రెండ్స్ ఇద్దరూ షాక్ అయ్యారు. కానీ నాకు జేమ్స్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నన్ను బరించలేక గుడ్ బై చెప్పేస్తాడు. అమ్మా వాళ్ళకు చెప్పొద్దని రొజీ, నిమ్మీలకు వార్నింగ్ ఇచ్చాను.

వారంరొజులు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కి జేమ్స్ వాళ్ళ ఫామ్ హౌస్ లొ అన్ని అరేంజ్ మెంట్స్ చేస్తానని చెప్పాడు. ఒంటరిగా రావడానికి భయమైతే ప్రెండ్స్ ని కూడా తెచ్చుకొమని చెప్పాడు.
నిమ్మీ వాళ్ళ డాడీ ఒప్పుకొడంది. నాకు ఏం భయం లేదు...ఎవరూ అవసరం లేదన్నాను. రోజీ మాత్రం ఒక్కదాన్నే అతనితొ వెళ్ళడానికి ఒప్పుకొకుండా తనూ వస్తానంది.
జేమ్స్ హుషారుగా.." దాంక్యూ భవ్యా" అనుకుంటు వెళ్ళిపొయాడు.

ఆ రొజు ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఏదొ తెలియని కంగారు.. భయం ముసురుకొన్నాయి. ఆవేశంలొ కమిటైపొయానా? అమ్మకి తెలిస్తే...పర్లేదు మేనేజ్ చేయోచ్చు. కానీ డాడీ కి తెలిస్తే, జేమ్స్ శాల్తీ గల్లంతే. అమెరికాలొ డాడీ కు అంత పలుకుబడి వుంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు.

ఉదయాన్నే ఎరుపెక్కిన కళ్ళను చూసి.."ఏంట్రా బంగారు సరిగా నిద్ర పొలేదా?" కాఫీ కప్పుతొ అమ్మ దగ్గరకొచ్చి అడిగింది.

"అమ్మా ప్రెండ్స్ తొ టూర్ వెల్తున్నా..వన్ వీక్! నాతొ రొజీ కూడా వస్తుంది. డాడీ కి ఏదొ చెప్పి నువ్వే మేనేజ్ చేయాలి" అన్నాను. ఎక్కడికి ఏంటని అడిగింది. అమెరికా లొ మా ఇల్లుతప్ప మరొలొకం తెలియని అమ్మకి నొటికొచ్చిన సిటీ పేరు చెప్పేసాను.

అదేదొ మీ డాడీ కి నువ్వే ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడు ఏదొ బిజినెస్ పని మీద బాంకాక్ వెళ్ళారు. మరొ వన్ వీక్ వరకు రానని నిన్ననే చెప్పారు గా మర్చిపొయావా?" అమ్మ అడిగితే అప్పుడు గుర్తొచ్చింది. ఈ వారం రొజులు డాడీ సిటీ లొ ఉండటం లేదని.
"ఔను కదు.. అయితే డాడీ కి ఏం చెప్పక్కర్లేదు. ఫొన్ చేస్తే ఇంట్లొనే ఉన్నానని చెప్పు. డాడీ వచ్చేలొపు మా టూర్ కూడా అయిపొతుంది" అమ్మతొ కన్నుగీటుతు అన్నాను.
"అమ్మో అబద్దమా నావల్ల కాదు." కాఫీ కప్పు వెనక్కి తీసుకుంటు అంది.

"నాకున్న దైర్యంలొ నీకు ఒక వంతు కూడా లేదమ్మా. నువ్వసలు నాకు తల్లివేనా?? ఇలా అయితే నువ్వు తెచ్చిన అబ్బాయిని చేసుకొను. పొ! ఇక్కడే ఏ వైట్ గొట్ నొ చేసుకుంటా...అప్పుడు గానీ మీ తిక్క కుదరదు." వార్నింగ్ లా అన్నాను.

"అమ్మో తెల్లబకరానా?? అంత ఘనకార్యం అక్కర్లేదు గానీ. ఏదొ మేనేజ్ చేస్తాలే. రొజుకొక్కసారైనా ఫొన్ చేయ్...సరేనా?" అంది. పిచ్చి అమ్మ. అందుకే డాడీ అంత ఈజీగా అమ్మతొ అబద్దాలు చెప్పేస్తాడు. నేనొక అబ్బాయితొ వారం రొజులు గడపడానికి వెల్తున్నానని తెలిస్తే..అదీ ఓ అమెరికన్ తొ అని తెలిస్తే..కళ్ళు తిరిగిపడిపొతుందేమో! ఎదేమైతేనేం..ఒప్పుకుంది. హమ్మయ్యా అనుకొని "మా మంచి అమ్మ" అని అమ్మ చెంపలమీదొ ముద్దిచ్చి...స్నానానికి వెళ్ళాను.

షవర్ లొ నీళ్లు చల్లగా శరీరాన్ని తాకుతుంటే...హయిగా అనిపించింది. త్వరత్వరగా స్నానం ముగించుకుని, టవల్ చుట్టుకొని అద్దం ముందుకొచ్చాను. అద్దంలొ నా ఒంటిపై అక్కడక్కడా నీటి ముత్యాలు మెరుస్తు కనిపించాయి. తీక్షణంగా నన్నొసారి తేరిపార చూసుకున్నాను. నాకు నేనే ముద్దొస్తున్నాను. ఇంత అందాన్ని చూసి జేమ్స్ కుదురుగా ఉంటాడా అని ఆలొచన రాగానే గుబులేసింది."

ఇక్బాల్ కార్ కు సడన్ బ్రేక్ వేయడంతొ, భవ్య మాట్లాడటం ఆపింది.

అప్పటివరకు ఇంట్రస్టింగ్ గా వింటున్న అబిరామ్ వాళ్లతొ పాటు డ్రైవర్ కూడా తమ కబుర్లు వింటున్నాడని అప్పుడు తెలుసుకున్నాడు.

అబిరామ్ కార్ ను పక్కకు తీసి ఆపమన్నాడు. ఇక్బాల్ ను బస్ లొ రమ్మని కావల్సినంత డబ్బులు చేతిలొ పెట్టి, తను వచ్చి డైవింగ్ సీట్లొ కూర్చున్నాడు.

అలా అబిరామ్ ఎందుకు చేసాడొ అర్దమయిన భవ్య " దాంక్యు. నేను అతను ఉన్నాడనే విషయమే మర్చిపొయాను. సిగ్గుతొ ముడుచుకుపొతు అంది.

మళ్ళీ తనే "ఫర్వాలేదే ఆడపిల్ల మనసు అర్దం చేసుకుంటున్నారు." అంది వాతావరణం తేలిక చేస్తు. అబిరామ్ ఆ మాటను కాంప్లీమెంట్ గా స్వీకరించాలొ, కామెంట్ గా బావించాలొ అర్దం కాక మౌనం గా ఉండిపొయాడు.

తర్వాత ఏమైంది..అని అబిరామ్ అడుగుతాడేమో అని ఎదురుచూస్తు కూర్చుంది భవ్య. అతనేం అడగలేదు.

కార్ నేషనల్ హైవేపై వేగంగా దూసుకుపోతుంది.
(ఇంకావుంది)

Friday, May 20, 2011

ప్రణయ కావ్యం - 8

జానకి ని వెతుక్కుంటు మేడ మీద గదిలొకి వెళ్ళాడు. కాసేపు అరుపులు, కేకలు వినిపించాయి. జానకి మీద చేయి చేసుకుంటున్నాడని అర్దమయ్యింది. అందరం అతన్ని ఆపడానికి వెళ్ళాం.
"ఇంకొసారి ఆ పాలేరు పేరెత్తావంటే..పీక పిసికి గొదాట్లొ పారేస్తా!" ఆయాసం తీర్చుకొవడానికి ఆగి అన్నాడు.
"ఆగిపొయావేం? ఏం అలసిపోయావా? రా చంపేయ్..నేను బ్రతికుంటే ఖచ్చితంగా రఘుని చేసుకొని తీరతాను" చెదిరిన జుట్టు సరిచేసుకుంటు మొండిగా అంది జానకి.
"జానకి" కొపంగా అరచింది అమ్మమ్మ.
అమ్మ జానకి ని వెనక్కి తీసుకుంటు "వయసొచ్చిన పిల్ల మీద చేయిచేసుకొవడం తప్పన్నయ్యా" మందలించింది.
"నువ్వే చెప్పు దానితొ.. నీ కొడుకు కైనా దాన్ని ఇస్తాను గానీ. నా ఇంట్లొ ఎంగిలి మెతుకులు ఏరుకుతినే ఆ పాలేరు కుక్క కు మాత్రం దాన్ని ఇచ్చేది లేదని." అమ్మతొ మావయ్య ఓ మెట్టు దిగి అన్నాడు.
"నాన్నా.." రఘుని తిట్టడం సహించలేనిదానిలా అరిచింది.
"ఏంటే. ఆ అరుపు. తండ్రినన్న మర్యాద కూడా లేకుండా? ఏం చూసి ప్రేమించావే వాడ్ని? చదువా? ఉద్యొగమా? ఏం వుందని వాడి దగ్గర? మన కులం కాదు. మన జాతి కాదు. రేపు వాడ్ని పెళ్ళి చేసుకుంటే నువ్వు కూడా వాడితొ ఇల్లంట అంట్లు తొముకొవడానికి బయలుదేరాలి. అర్దమౌతుందా?" నిలదీసాడు.
జానకి మాట్లడలేదు. ఆమె మౌనాన్ని చూసి, మావయ్య నెమ్మది పడ్డాడు. కిందనున్న తన అనుచరగణాన్ని పిలిచి, రఘు ఎక్కడున్నా నాలుగు తగిలించి తీసుకు రమ్మని ఆదేశించాడు. వేగంగా కదలబొతున్న వాళ్ళను చూసి
"నాన్నా...రఘుని ఏమైనా చేసావొ..నా శవం కళ్ళ చూస్తావు" వార్నింగ్ లా అంది. వాళ్ళు ఆగిపోయారు.
కొపంగా మావయ్య అమ్మని పక్కకి లాగి జానకి చెంప చెళ్ళుమనిపించాడు.
ఆమె కళ్ళు ఎర్రబారిపొయాయి.

"నాన్నా..రఘు కి చదువు, ఉద్యొగం లేక పొవచ్చు. నేనంటే ప్రేముంది. నా మీద ఎవరైనా చేయివేస్తే వాడి నెత్తురు కళ్ళచూసే దాకా ఆగడు. అసలు తనకు చదువు సంద్య లేకపొవడానికి కారణం మనం కాదా?? తరతరాలుగా వాళ్ళ కుటుంబాలతొ వెట్టిచాకిరీ చేయించుకుంటు, వారిని అలా తయారుచేసింది మనం కాదా??" నిలదీసింది.

"నువ్వు కుక్క అన్నావే. నిజం! అతను నిజంగా విశ్వాసంలొ కుక్కలాంటివాడే. నేను లొయలొ దుకమన్నానే అనుకొ...ఎందుకు, ఏంటి అని అడగకుండా కళ్ళు మూసుకొని దూకేస్తాడు. అంత నమ్మకం నామీద. నువ్వు వేయి జన్మలెత్తిన నాకు అలాంటి భర్తను తేలేవు. అర్దమౌతుందా?" ఎదురు ప్రశ్నించింది.

ఎప్పుడు అమాయకంగా కనిపించే జానకి లొ ఇంత తెగువ నేనెప్పుడూ చూడలేదు. అంతవరకు ప్రేక్షక పాత్ర వహించిన నేను, ఇంక మౌనంగా వుండలేకపొయాను.

"మావయ్యా నా ప్రేమను కాదన్నావు. సహించాను. జానకీ ప్రేమను మాత్రం కాదనకు ..ఒప్పుకొను." అన్నాను.
"ఒప్పుకొక పొతే ఏం చేస్తావురా?" కొపంలొ ఊగిపోతు అడిగాడు.
"నీ కళ్ళ ముందే దాని పెళ్ళి చేస్తాను. అడ్డొచ్చిన ఏ ఒక్కర్ని వదిలిపెట్టేది లేదు." నాగొంతులొ స్దిరత్వాన్ని చూసి అందరూ ఆశ్చర్యపొయారు.
"రాముడు" అమ్మమ్మ అరిచింది.
"నీకు బుద్దుందా?? నీకు కాబొయే పెళ్ళాన్ని వేరే వాడికి నువ్వే ఎలా చేస్తావురా? మతి వుండే మాట్లాడుతున్నావా?" కొపగించుకుంది.
"లేదమ్మమ్మా! జానకి మనసులొ స్థానం నాది కాదని తెలిసినప్పుడే నా ప్రేమను నాలొనే సమాది చేసాను. జానకి ఎక్కడున్నా ఎవరితొ వున్నా సంతొషంగా ఉండటమే కదా మనకు కావాల్సింది??
ఇప్పుడు నేను తనని చేసుకుంటే..నాకు తన మీద అదికారం ఉంటుందేమొగానీ, తన మనసు లొ నాకు స్థానం ఉండదు. అవును అమ్మమ్మా!
ప్రేమలేని పెళ్ళినాకు వద్దమ్మమ్మా. జానకి కి రఘు నే కరక్ట్" అన్నాను.
అనేసాను గానీ నా మనసెంతలా నలిగిపొతుందొ వాళ్ళెవ్వరికీ తెలీదు. అమ్మ దీనంగా నా కళ్ళలొ కి చూసింది. ఆమె కళ్ళలొ చూడలేక తలదించేసాను.
"నన్ను అర్దం చేసుకున్నందుకు దాంక్యు బావా" అంటు నా వద్దకొచ్చి నా రెండు చేతులు తన చేతుల్లొకి తీసుకుంది.
"ఎవ్వరు అడ్డొచ్చినా రేపు నేను నిర్ణయించిన మూహూర్తానికే...నేను నిర్ణయించిన అబ్బాయితొనే పెళ్ళి జరిగితీరుతుంది." మావయ్య తన నిర్ణయాన్ని మొండిగా చెప్పాడు.
"అలా అయితే.. నేను ఈ ఇంట్లొ ఒక్క క్షణం కూడా ఉండను." జానకి కూడా మొండిగా అంది.
"నువ్వు ఇక్కడి నుండి ఎలా కదులుతావొ నేను చూస్తా??" చాలెంజ్ చేస్తు, తన వెనుక మనుషులువైపు తిరిగి, "పెళ్ళి జరిగేవరకు అది ఇంట్లొ కాళ్ళు బయటపెట్టడానికి వీల్లేదు." హూకుం జారీ చేసాడు.
జానకి నా మీద నమ్మకం ఉన్నదానిలా నా వెనుక నిలబడి, నా చేయి బలంగా పట్టుకొని.." బావా ఎలాగైనా నన్ను ఇక్కడి నుండి బయటకు తీసుకుపొ" అంది.
మావయ్య తాలుకు మనుషులు రౌడీల్లా మీదకొచ్చారు.

అడ్డుపడ్డాను. పెనుగులాట జరిగింది. నేనే గెలిచాను. మావయ్యని ఎదిరించి, జానకి ని నాతొ తీసుకొచ్చేసాను. అమ్మమ్మ, అత్తయ్యకు మావయ్యమీద కన్నా నామీద కొపం వచ్చింది. అమ్మ ఎదురు చెప్పలేదు.
మావయ్య అహంతొ రగిలిపొయాడు. మరి కొంతమంది రౌడీలను మా ఇంటి మీదకు పంపాడు. ఈ గొడవలన్నీ ఎక్కడికి దారి తీస్తాయొ అని అమ్మ బెంగ పెట్టుకుంది. నాన్న మాత్రం నీకు నచ్చిందే చేయి అన్నాడు.
నా గుండె దైర్యానికి, తెగువకు వచ్చిన రౌడీలు వెనుతిరిగారు. వాళ్ళతొ జరిగిన పెనుగులాటలొ నా తలకు బలమైన గాయం తగిలింది. రక్తం చూసి అమ్మ కళ్ళు తిరిగిపడిపోయింది.
రఘు తల్లితండ్రులు మాత్రం మా మావయ్యకు ఎదురు నిలిచి ఊర్లొ బతకలేమని బయపడ్డారు. రఘు మాత్రం ప్రాణాలు పొయినా జానకి చేయి వదిలేది లేదని తేల్చిచెప్పాడు. నాకు అతనిలొ తెగువ నచ్చింది.

మా ముందు మావయ్య ఓడిపొయాడు. ఓడిపొయాడు అనే కంటే ఓడిపొయినట్లు నటించాడు. తనకు తన కుటుంబం, కూతురు కన్నా పదవి ముఖ్యం అవ్వడంచే రాజకీయాల్లొ ఎదగాలంటే ఇంటి శత్రువులు ఉండకూడదని అర్దం చేసుకొని, రాజీకి వచ్చాడు.

ఆదర్శవివాహం అనే టాగ్ తగిలించి తన కూతురు పెళ్ళి ని తనే తన ఇంట్లొ అంగరంగ వైభవంగా చేసేసాడు. అత్త, అమ్మమ్మ మాత్రం నాతొ మాట్లాడటం మానేసారు. నేనంటే వాళ్ళకి ఇప్పటికీ కొపమే..." చెప్పడం ఆపాడు అబిరామ్.

భవ్య నిట్టురుస్తు.."మీ గురించి ఏమో అనుకున్నాను గానీ ఫర్వాలేదు. ప్రేమించిన మరదలి పెళ్ళికి స్వయంగా మీరే పందిర్లు వేసారన్న మాట. గ్రేట్...ఐ లైక్ యు" అంది.
"ఏం గ్రేటొ ఏమె..నేను అనుభవించిన నరకాన్ని ఎవ్వరు అనుభవించి ఉండరు. ఎన్నొ నిద్ర లేని రాత్రులు. తన పెళ్ళి చేసి గెలిచానొ, తన ప్రేమను కొల్పొయి ఓడిపొయానొ తెలియని జీవితం నాది." అన్నాడు అబిరామ్.
"ప్రేమ ను బ్రతికించారు కాబట్టి గెలిచినట్లే" అంది భవ్య.

భవ్య నిట్టురుస్తు.."మీ గురించి ఏమో అనుకున్నాను గానీ ఫర్వాలేదు. ప్రేమించిన మరదలి పెళ్ళికి స్వయంగా మీరే పందిర్లు వేసారన్న మాట. గ్రేట్...ఐ లైక్ యు" అంది.

"ఏం గ్రేటొ ఏమె..నేను అనుభవించిన నరకాన్ని ఎవ్వరు అనుభవించి ఉండరు. ఎన్నొ నిద్ర లేని రాత్రులు. తన పెళ్ళి చేసి గెలిచానొ, తన ప్రేమను కొల్పొయి ఓడిపొయానొ తెలియని జీవితం నాది." అన్నాడు అబిరామ్.

"ప్రేమ ను బ్రతికించారు కాబట్టి గెలిచినట్లే" అంది భవ్య.

"నీకొ విషయం తెల్సా ఈ గొడవలన్ని జరిగినప్పుడు జానకి కి పదిహేడేళ్ళు. పెళ్ళి అయినప్పుడు ఆమె మైనరు. పెళ్ళి జరిగిన నాలుగు నెలలకొ ఏమో తనకి పద్దెనిమిదేళ్ళు వచ్చాయి. ఆ వయసులొ ప్రేమ, పెళ్ళి, పెద్దోళ్ళను ఎదురించడం అంతా ఇప్పుడు తలుచుకుంటుంటే మేం చేసినది తప్పేమో అనిపిస్తుంది." అబిరామ్ అన్నాడు.

"ఇండియాలొ పల్లెటూర్లలొ అమ్మాయిలకు పదొ తరగతి దాటగానే పెళ్ళి సంబందాలు చూస్తారంట కదా..డాడీ చెప్పారు" భవ్య అంది.

"అవును. మా విషయంలొను అదే జరిగింది. కానీ తనది మెచ్యుర్డ్ లవ్ కాదేమో అని ఇప్పటికీ నాకు డౌట్" తను అన్నాడు.

"లేదు అబిగారు. అమ్మాయి మనసు ఒకసారి ప్రేమలొ పడితే అది తన జీవితం చివరిదాకా వదిలిపొదు. అది ఏ వయసులొ నైనా కానీ. అందుకే తొలిప్రేమ తీయనిది..మదురమైనది..మరువలేనిది అంటారు" అంది భవ్య. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళలొ ఏదొ మెరుపు గమనించాడు.

"అది సరేగానీ మీరు అమెరికా ఎప్పుడొచ్చారు?? ఎలా ఈ స్థాయికి ఎదిగారొ చెప్పలేదు" అడిగింది.

"దాని గురించి తర్వాత చెప్తాగానీ, ముందు నీ గురించి చెప్పు భవ్య" అడిగాడు.

"నువ్వు ఎవరినైనా ప్రేమించావా?" అడగకూడదనుకుంటునే అడిగేసాడు. తర్వాత నొచ్చుకొన్నాడు. "అయామ్ సొరీ. నా కధ చెప్పానని, నిన్ను చెప్పమని నా ఉద్దేశం కాదు." తడబడుతు అన్నాడు.

భవ్య అమెరికాలొ పెరిగినమ్మాయి కావడంతొ అంతగా పట్టించుకొలేదు. "ఇట్స్ ఓకే. నా గురించి చెప్పాలంటే...నా కాలేజీ డేస్ గురించి చెప్పాలి. అది ప్రేమో ఏమో నాకు తెలీదుగానీ, మా కాలేజ్ లొ ఓ అబ్బాయి నా వెంట పడేవాడు. తను అమెరికన్. చాలా తెల్లగా ఉంటాడు. తెలుగు అసలు రాదు. నాకొసం తెలుగు నేర్చుకున్నాడు. అక్కడ అబ్బాయిలంతా చాల ఫాస్ట్ అని మీకు తెలుసుకదా...తను మాత్రం అలా కాదు. చాలా కూల్. నా కొసం రొజుకొ ప్లవర్ బొకే పంపేవాడు ఇంటికి." ఆమె చెప్పడం ఆపింది.

కలువ పూలు గుర్తొచ్చాయి అభిరామ్ కి. "ప్రేమను వ్యక్తం చేయడానికి పూలే ఎక్కువగా వాడతారని నా చిన్నప్పుడే తెలిసుంటే, జానకి ఎప్పుడొ నాదయ్యిండేది" ఆలొచనల్లొ జానకి రూపం మళ్ళి కళ్ళ ముందు మెదిలింది.

తనకి పెళ్ళి అయ్యి మరొ మగాడికి భార్య అయినా తన మీద నుండి నా మనసెందుకు మళ్ళడం లేదు?? ఆలొచనలను తుంచేస్తు భవ్యను చూసాడు. తను భవ్యను చేసుకొవాలి. తన డెస్టినీ భవ్యతొ రాసి పెట్టుకున్నాడని గుర్తొచ్చింది. కానీ తనకి భవ్య అంటే ఇష్టం లేదే?? ఇప్పుడు భవ్యని ఇష్టపడాలి...ఆమె మనసులొ స్థానం సంపాదించాలి...ఎలా?? అర్దం కాక బుర్ర గొక్కున్నాడు.

భవ్యని పరిశీలన గా చూసాడు. తను ఇంతకు ముందు "అమ్మాయిని ఎప్పుడు చూడ్లేదా?" అని విసుక్కున్న సంగతి గుర్తుకొచ్చి చటుక్కున తల తిప్పేసుకున్నాడు.

"ఆ అబ్బాయి పేరు జేమ్స్" అబిరామ్ వింటున్నాడనుకొని భవ్య చెప్తుపొతుంది.

(ఇంకావుంది)

ప్రణయ కావ్యం - 7

ఎయిర్ పొర్ట్ బయట వాళ్ళ కొసం ఓ డ్రైవర్ ఎదురుచూస్తు అభిరామ్ అని పేరున్న ప్లకార్డ్ పట్టుకొని నిల్చున్నాడు. వాళ్ళిద్దరు దగ్గరకు రాగానే లగేజీ అందుకొని, కార్ దగ్గరకు తీసుకొచ్చాడు. ట్రావల్ అండ్ పికప్ అరేంజమెంట్స్ అన్ని భవ్య డాడీ చేయించారు.

" సర్ నా పేరు ఇక్బాల్." డ్రైవర్ కార్ ముందు సీట్లొ కూర్చొంటు పరిచయం చేసుకున్నాడు.

"మీ ఊరు వెళ్ళడానికి ఎంత టైమ్ పడుతుంది." భవ్య అడిగింది వెనుక సీట్లొ కూర్చుంటు.

"ఎనిమిదిగంటలు" ఇక్బాల్ సమాదానం చెప్పాడు.

"ఓ మైగాడ్" అనుకుంటు వెనక్కి చేరబడింది. అబిరామ్ ఏదొ ఆలొచిస్తు కూర్చొవడం చూసి "మరి జానకి పెళ్ళి ఎలా ఆగింది?" అడిగింది.

"జానకి పెళ్ళి ఆగలేదు. వాళ్ళ నాన్న నిర్ణయించిన ముహుర్తానికే జరిగింది." అభిరామ్ చెప్పాడు.. ఆ మాటలకు ఉలిక్కిపడింది భవ్య.

"ఎవరితొ?" వెంటనే అడిగింది.
"వాళ్ళ నాన్న తీసుకొచ్చిన అబ్బాయితొనా?!" మళ్ళీ తనే అంది.
"కాదు" అన్నాడు. అయొమయంగా చూసింది.

"మా మావయ్య పాలేరు కొడుకు రఘురాం తొ జరిగింది. నేనే దగ్గరుండి మరీ జానకి పెళ్ళి చేసాను." అభిరామ్ చెప్తున్నప్పుడు, అతని గొంతులొ చాలా విలువైనది పొగొట్టుకున్న బాధ తొణికిసలాడింది.

"వాట్?" అర్దం కానట్లు చూస్తు అరిచినంతపని చేసింది.

భవ్య తనేం వింటుందొ అర్దం కాక, కాసేపు మౌనంగా వుండిపొయింది.

అభిరామ్ చెప్పడం మొదలు పెట్టాడు.
"ఆ రొజు కొనేరు గట్టుమీద కూర్చొని ఎదురుచూస్తుంటే, జానకి, రఘు ఇద్దరు కలసి నాదగ్గరకొచ్చారు. మొదట నాకు అర్దం కాలేదు. తర్వత తర్వాత నెమ్మదిగా అర్దమయ్యింది.

"బావా... నాకు రఘు అంటే ఇష్టం. తనకి కూడా నేనంటే ప్రాణం. నాన్నకి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు. నువ్వే ఎలాగైనా మా పెళ్ళి జరిపించాలి బావా" అంది.
నా కళ్ళు, మనసు, జరుగుతొంది... చూస్తుంది... అబద్దం కావాలని బలంగా కొరుకున్నాయి ఆ క్షణంలొ.

కానీ అబద్దం కాదన్నట్లుగా... తను చెప్తున్నంతసేపు ఆమె చేయి రఘు చేతిలొనే వుండటం కంటపడింది. వాళ్ళిద్దరి చేతులు చూస్తుంటే ఒక్క క్షణం కుడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢమైన ప్రేమలొ ఉన్నట్లుగా అనిపించింది. ఆ సమయంలొ రఘుని చూస్తే జెలసీలాంటి ఫీలింగ్. తను జానకి మనసు గెలిచాడన్న అసూయ. మీదపడి కొట్టాలన్న కసి. కాని ఏమి చేయలేని స్తితి. ఒక్కసారిగా పాతాళంలొకి జారిపోయిన ఫీలింగ్.

"నువ్వే చెప్పు బావా...చిన్నప్పటినుండి చూస్తున్న నిన్నే నా భర్తగా ఊహించుకొవాలంటే మనసొప్పుకొవడంలేదు. అలాంటిది ఎవరొ ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి వీడే నీకు కాబొయే మొగుడంటే ఆ ఆడపిల్ల పరిస్తితి ఎలా వుంటుందొ??
ఎందుకు బావా ఈ పెద్దొళ్ళు పిల్లల మనసు అర్దం చేసుకొరు??" ఆవేశంగా మాట్లాడుతుంటే...

"నిజం చెప్పు నా మీద నీకెలాంటి ఫీలింగ్స్ లేవా?" అడ్డుపడి అడిగేసాను. పక్కన రఘు వున్నాడన్న సంగతి మరిచిపొయాను. అయినా తనకి తెలియని విషయం కాదు. చిన్నప్పటినుండి జానకి నా భార్య అని ఊరంతా అనుకున్నారు. ఎప్పుడు ఎవరు ఇలా తను పాలేరు మీద మనసుపడుతుందని ఊహించి వుండరు.

నా ప్రశ్నకి "పో బావా నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జొక్ లేస్తావు" అంది బుంగమూతి పెడుతు.

"జొక్ కాదు. సీరియస్ గానే అడుగుతున్నాను. చిన్నప్పటి నుండి నిన్నే నా భార్య గా ఊహించుకుంటు వచ్చాను. ఆ విషయం నీకు తెలియనట్లు నటించకు" అన్నాను.

నేనలా మాట్లాడతానని ఊహించలేదేమో షాక్ కొట్టినదానిలా కొయ్యబారిపోయింది.

"నిజం చెప్పు నేను నిన్ను ఇష్ట పడుతున్న విషయం నీకు తెలీదా?" అడిగాను. అప్పుడంది తను..

"బావా ఇష్టం వేరు. ప్రేమ వేరు. నువ్వంటే నాకిష్టం. అది ప్రేమనుకొని నువ్వెలా పొరబడ్డావు బావా? అయినా నా అబిప్రాయాలు..అలవాట్లు..నీకు నచ్చవు. నాకనిపించే చిన్న చిన్న ఆనందాలు నీకు నచ్చవు. నా మనసు నీకు అర్దం కాదు బావా. నేను చిన్నప్పుడు ఆడుకొవడానికి తొటకు రమ్మంటే ప్రెండ్స్ తొ ఆడుకొ అన్నావు. నాకిష్టమైన కలువపూలు నీకిస్తుంటే.."ఏం చేసుకొను అని అడిగావు గానీ, నా మనసు అర్దం చేసుకొలేదు.

వదిలేయ్ బావా నాకు నీకు కుదరదు. మనం కలిసి నాలుగేళ్ళు అయ్యింది. ఏ రొజన్నా నన్ను చూడాలని, నాతొ మాట్లాడలని నీకు అనిపించిందా? లేదు!. ఎందుకంటే నీకు అస్తమానం పుస్తకాలు, రాంకులు ఇదే గొల! నువ్వొ చదువు పిచ్చొడివి బావా!.

రఘు మాత్రం అలా కాదు. నేను కనపడకపోతే అతనికి పొద్దు పొదు. ఎప్పుడన్నా అమ్మమ్మా వాళ్ళ ఊరెల్తే నేను వచ్చేవరకు అన్నం కూడా ముట్టడు. నాకొసం ఎదురుచూస్తు బస్ స్టాండ్ లొనే కూర్చొనేవాడు. నా కొసం ఆరొజు ఈత రాకపొయినా ప్రాణాలకు తెగించి కొనేట్లొ దిగి పూలు కొసుకొచ్చాడు. ప్రేమంటే అది బావా." చెప్పడం ఆపింది.

ఇంకేం మాట్లాడాలొ అర్దంకాలేదు. తను రఘు ని ప్రేమించింది. రఘుని తప్ప ఇంకెవరినీ చేసుకొవాలని లేదని తెగేసి చెప్పింది. ఇంతకన్నా బయంకరమైన అవమానం ఏ మగాడికి జరిగి ఉండదు.

జానకి నన్ను ప్రేమించలేదు. ఇష్టపడింది. అంతే. ఆమె దృష్టిలొ ప్రేమ వేరు. ఇష్టం వేరు. పిచ్చొడ్ని తేడా తెలుసుకొలేకపొయాను.

జీవితంలొ మొదటిసారి ఓడిపోయాను. ఓ ఆడపిల్ల మనసు గెలవలేకపోయాను. కనీసం వాళ్ళ పెళ్ళి చేసైనా సంతృప్తి పడాలని మనసుకు సర్దిచెప్పుకున్నాను.

నా మనసు అర్దం చేసుకున్నదానిలా..." నిన్ను చాలా బాధ పెట్టినట్లున్నాను మన్నించు బావా" అనేసి రఘుతొ కలసి వెళ్ళిపొయింది. వెనక్కి తిరిగిచూడలేదు.

కుప్పకూలిపోయాను. నా మనసు భారంగా తయరైంది. ఎక్కడినుండొ జొరుగాలి వీయడం మొదలుపెట్టింది. మబ్బులు ఒక సారిగా ఉరిమాయి. సడన్ గా మొదలైన వర్షం నన్ను నిలువునా తడిపేసింది. కొనేట్లొ పూలు నన్ను వెక్కిరిస్తున్నట్లుగా జొరుగాలికి ఊగుతున్నాయి.
చాలా సేపు వరకు మాములు మనిషి కాలేకపొయాను.
----

"రాముడు... నీకేమన్నా పిచ్చి పట్టిందా? పాలేరు తొ జానకి పెళ్ళేంట్రా??" అమ్మమ్మ, అత్త, అమ్మ మూకుమ్మడిగా నాపైదాడి చేసారు.
"రఘుని మీరు పాలేరు గా మాత్రమే చూసారు. జానకి మాత్రం తన జీవితబాగస్వామిగా చూసింది. వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంది. ఎవరేమన్నా వాళ్ళ పెళ్ళి జరిగితీరుతుంది." అన్నాను.

"నొరుమూయ్."
ఎక్కడినించి వచ్చాడొ నా మాటలు విన్న మావయ్య ఒక్కసారిగా విరుచుకుపడుతు అన్నాడు.
"అసలు నువ్వు ఎవడివిరా నా కూతురి పెళ్ళి చేయడానికి. అసలు నీకే దాన్ని ఇవ్వనొడ్ని....పాలేరు నాకొడుకు కు ఎలా ఇస్తారా?" అంటు, ఇల్లంతా కలియజూస్తు "ఎక్కడే..నీ దరిద్రగొట్టు కూతురు" అని అత్తని అడిగాడు. అందరూ హడలిపొతు చెరొవైపు వెళ్ళిపొయారు.

(ఇంకావుంది)

Thursday, May 19, 2011

ప్రణయ కావ్యం - 6

ఆరొజు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని, ఇంటికి వెళ్ళాను.
"జానకి ఎలా వుందమ్మా" నా ప్రశ్నకు అమ్మ నుండి సమాధానం రాలేదు. నా మనసేదొ కీడు శంకించింది.
" ఎమైందమ్మా?" మళ్ళీ అడిగితే,
"తనని మర్చిపొరా" అంది.నాకు ఒళ్ళు మండి "ఏం?" విసురుగా అడిగాను.
"తనకు ఎల్లుండి పక్క ఊరి ఎమ్ ఎల్ యే గారి అబ్బాయితొ పెళ్ళి" చెప్తున్నప్పుడు, ఆమె కళ్ళలొ నీటిపొర ఆగలేదు. అప్పటివరకు ఉగ్గబెట్టుకున్న కన్నీళ్ళు ఒక్కసారిగా బయటకొచ్చాయి.

అమ్మ ని ఓదార్చాలొ నన్ను నేను ఓదార్చుకొవాలొ అర్దం కాలేదు. చాలాసేపు మౌనంగా ఉండిపొయాను. అప్పుడే బయటనుండి వచ్చిన నాన్న, మా ఇద్దరి పరిస్తితి చూసి ఎమనాలొ తెలియక, పక్కనే చేరేసిన నులక మంచం వేసుకుని కూర్చుండిపోయాడు.

"రాజకీయాల్లొ చేరాక మా అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. అనుబందాలను మర్చిపొయాడు. నేనేం చేయలేకపొయాను రా..నన్ను మన్నించు" అంది.
నా నొటంట మాట రాలేదు.
"అసలు జానకి ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుంది?" నమ్మశక్యంకాక మళ్ళీ అడిగాను.
"పిచ్చి పిల్ల దానికేం తెలుసురా...వాళ్ళ నాన్న ఎలా చెప్తే అలా చేస్తుంది. అంతే." అన్నాది. నాకు ఆ క్షణాన జానకి ని కలవాలని బలంగా అనిపించింది. అమ్మతొ అదే మాట చెప్పాను.
" వద్దు నాన్న నువ్వు ఏదొ పెళ్ళి చెడగొట్టడానికి వచ్చావనుకొని గొడవ పెడతారు" అమ్మ వారించింది.
"పర్లేదమ్మా" అన్నాను.
నాన్న కూడా "ఫర్వాలేదు వెళ్ళనీ. ఆ పిల్ల మనసులొ ఏముందొ తెలుస్తుంది." దైర్యం చెప్పాడు.
అమ్మ అడ్డుచెప్పక ముందే మావయ్య వాళ్ళింటికి బయలుదేరాను.

పెళ్ళి వాతావరణం అప్పుడే మొదలైనట్లుంది. ఇంటి ముందు మావిడాకుల తొరణాలు, ముద్దబంతుల దండలు వేలాడుతు కనిపించాయి.
"ఎవరొ పిల్లాడు అబిరామ్ బావ వచ్చాడు." నన్ను చుస్తునే అరుచుకుంటు అమ్మమ్మ వుండే గది వైపు పరిగెత్తాడు. జానకి తమ్ముడు వాడు. నా పేరు వింటునే " "రాముడూ" అంటు అమ్మమ్మా పరుగులాంటి నడకతొ బయటకొచ్చింది. నేనంటే ప్రాణం తనకు. నాకు జానకి కి పెళ్ళి చేయాలని కలలు కంటున్నవాళ్ళలొ మొదట వుండేది తనే.

"ఎన్నాళ్ళయ్యింది రా నిన్ను చూసి. ఎప్పుడొచ్చావు రా?" నా చెంపలు నిమురుతు కుశల ప్రశ్నలు వేసింది.
నా కళ్ళలొ జీవం లేకపొవడం చూసి, ఆమె కళ్ళలొ కూడా నీళ్ళు ఉబికాయి.

నా గుండెల మీద వాలిపొతు "నన్ను మన్నించ రా రాముడు. మీ మావయ్య, నా కొడుకని చెప్పుకొవడానికి సిగ్గు పడుతున్నాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొలేని దగాకొరు కొడుకుని కన్నాను రా..నన్ను మన్నించు" అంది.

ఆమెను ఓదార్చుతు "జానకి ఎక్కడా?" అడిగాను.

"మేడ మీద గదిలొ వుంది. దానికి ఈ పెళ్ళి ఇష్టంలేదు రా. ఇంకా చదువుకుంటానంటుంటే మీ మావయ్య ఒప్పుకొవడం లేదు రా అభి." అత్తయ్యకూడా లొపలనుండి వస్తు అంది.

జానకి కి ఈ పెళ్ళి ఇష్టంలేదన్నమాట ఎంతొ ఊరటనిచ్చింది. అప్పటివరకు కమ్ముకున్న బాదంతా దూదిపింజలా ఎగిరిపోయింది.
"నా జానకి కి ఇష్టం లేకుండా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందొ నేనూ చూస్తా" అంటు మేడమీద తనుండే గదిలొకి పరుగులాంటి నడకతొ వెళ్ళాను.

ఆ గదిలొ కిటికీలొ నుండి బయటకు చూస్తు జానకి కనపడింది. నాలుగేళ్ళ తర్వాత చూడటం మూలనేమో ఎవరొ వయసులొ ఉన్న అమ్మాయి లా అనిపించింది. తడబడుతు గది గుమ్మం దగ్గరే ఆగిపోయాను. నా అడుగుల సడికి తల తిప్పిచూసింది. అవే కళ్ళు! నాకిష్టమైన కళ్ళు. నన్ను చూస్తునే ఆమె కళ్ళలొ మెరుపు. జానకీనే తను.

"బావా" అంటు పరిగెత్తుకుంటు వచ్చి నన్ను చుట్టేసింది. పులగుత్తు ఏదొ బలంగా నన్ను తాకి, గాఢంగా నన్ను అల్లేసినట్లు ఉక్కిరిబిక్కిరి అయ్యాను.
తన చేతికున్న గొరింటాకు నా షర్ట్ అంతా అంటుకుంది.

"ఎన్నాల్లయ్యింది బావా...నిన్ను చూసి." దాదాపు ఏడుపుగొంతుతొ అంది.

"నా మీద కొపం పోయిందా?" అడిగాను. చిన్నప్పుడు కలువపూలు విషయం గుర్తొచ్చి కిసుక్కున నవ్వింది. నా నుండి విడివడుతు..

" హమ్మయ్యా నువ్వు వచ్చేసావ్. ఇంక నాకు ఏ బెంగా లేదు" అంది.
మళ్ళీ తనే " అన్నీ నువ్వే చూసుకొవాలి బావా. నాకీ పెళ్ళి ఇష్టం లేదు. ఏదొ ఒకటి చేసి ఎలాగైనా ఈ పెళ్ళీ ఆపాల" అంది. నాలొ ఉత్సాహం పొంగుకొచ్చింది. అసలే ఎడ్వెంచర్స్ చేసి చాలా రొజులు అయ్యింది.
" ఏం చేద్దాం. లేచిపొదామా?" కొంటెగా అడిగాను.
" పో బావా" అంది. అది సిగ్గనుకొన్నాను. కానీ అసలు విషయం గ్రహించలేకపొయాను.
"బావా సాయంత్రం కొనేటి గట్టు దగ్గరకు రా నీ కొ విషయం చెప్పాలి." అంది.
"ఏంటి. ఇప్పుడే చెప్పు" అడిగాను.
"ఆహు నాన్నొచ్చే టైమయ్యింది. సాయంత్రం ఆరింటికి తప్పకుండా రావాలి. రేపు మళ్లీ పెళ్ళివారు వచ్చేస్తున్నారు." అంది.

సరే అని ఇంటికొచ్చేసాను. నా మనసంతా ఊహల్లొ తేలిపోయింది. జానకితొ మంచు కొండల్లొ ఓ డ్యూయెట్ కూడా వేసుకుంది. సాయంత్రం అయ్యేసరికి, మావయ్యకి ఎలా నచ్చచెప్పాలొ, ఒప్పుకొక పొతే ఏం చేయాలొ లాంటి ప్లాన్ లు గీసుకున్నాను.
నా మనసంతా ఎలాగైనా జానకి ని నా దాన్ని చేసుకొవాలని బలంగా డిసైడ్ అయిపొయాను.

సాయింత్రం ఆరింటికి అరగంట ముందే, కొనేటి గట్టు దగ్గరకు చేరుకున్నాను. కలువలొ పులు వెక్కిరిస్తున్నాయి నన్ను. ఆరొజు మా జానకి ఇస్తే తీసుకొకుండా ఫొజ్ కొట్టి ఇప్పుడు మమ్మల్నెందుకు చూస్తున్నావ్? అని వంగి ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది.

నీళ్ళలొ దిగి, జానకి కొసం కొన్ని పూలు కొసాను.

నేను ఎక్కువసేపు ఎదురుచుడకుండానే జానకి వచ్చింది. తను ఆ రోజు ఎంత అందంగా తయరయ్యిందొ తెలుసా? అని చెప్పడం ఆపాను. అప్పటివరకు చాలా ఇంట్రస్టింగ్ గా వింటున్న భవ్య, "నాకు జానకి ని చూడాలని వుంది" అంది.
అబిరామ్ దీర్ఘంగా ఊపిరిపీల్చి, "నాకు తనని ఇప్పుడు చూడాలని వుంది" అన్నాడు..

వాళ్ళు ఎక్కిన విమానం అప్పటికి ఇండియా చేరుకుంది.

(ఇంకావుంది)

ప్రణయ కావ్యం - 5


ఇంటర్ ఈ సారి స్టేట్ ఫస్ట్. నా ములానా నేను చదివిన ఇంటర్ కాలేజీకి ఒక్కసారిగా గుర్తింపు వచ్చేసింది. అప్పటివరకు అది ఓ మారుముల గ్రామంలొ వున్న మాములు ప్రభుత్వ కళాశాల. నా రిజల్ట్ రాగానే ఆ కాలేజీ దశ మారిపోయింది. అందులొ లెక్చరర్స్ అందరికి, మంచి మంచి జీతాలతొ సిటీలొ ప్రైవేట్ కాలేజీలలొ అవకాశాలు వచ్చాయి. మిగిలిన నా చదువు బాద్యత మొత్తం తీసుకుంటామంటు చాల విద్యాసంస్తలు ముందుకొచ్చాయి. నాకు ఇంజనీరింగ్ చదవాలని వుందని నాన్నతొ చెప్పాను. ఆయన సరే అన్నారు.

సడన్ గా నొకొచ్చిన గుర్తింపుకు లెక్చరర్స్ ఇంటికొచ్చి అభినందించారు. ఊర్లొవాళ్ళంతా తిట్టిన నొళ్ళతొనే పొగుడుతుంటే అమ్మ మురిసిపోయిందొ. ఈ సారి మావయ్య.."నా అల్లుడా మజాకా??" అని ఇంకొ రెండడుగులు ముందుకేసి గర్వంగా అన్నాడు. ఆ మాటలు విన్న నా మనసు ఆనందంతొ ఎగిరిగెంతేసింది.

"జానకి ఎక్కడ మావయ్యా?" అప్పుడే ఇంటికొచ్చిన అతన్ని అడిగాను.
"వాళ్ళ అమ్మతొ కలసి గుడికి వెళ్ళింది రా" చెప్పాడు మావయ్య. ఆయన మాట పూర్తి కాకుండానే ఊరి చివరనున్న గుడికి పరిగెత్తాను.

మా ఊరిలొ ఒకటే గుడి ఉంది. అది సీతారాములది. కొనేటి ఒడ్డున నుండి చూస్తే, ఆ గుడి గొపురం నీళ్ళలొ కనిపిస్తుంది. ఏ కాలంలొ నైనా ఆ కొనేటి నిండా కలువపూలు వుంటాయి. ఆ గుడి చుట్టు మూడు ప్రదక్షణలు చేసి, రాముల వారిని, సీతమ్మ తల్లిని ఏం కొరుకున్నా నెరవేరుస్తారని అమ్మమ్మ అంటుంటాది. అమ్మమ్మ మావయ్య వాళ్ళతొ వుంటుంది. వాళ్ళుండేది మా ఊర్లొనే అయినా, అమ్మ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళదు. మావయ్య, అమ్మమ్మా అప్పుడప్పుడు వచ్చి చూసి వెలుతుంటారు. అస్తమానం పుట్టింటికి వెలితే అలుసయిపొతామని అమ్మ అమ్మమ్మతొ వాదిస్తుంటుంది.

జానకి గుడి లొ కనపడలేదు. అత్త గుడిలొ ప్రదక్షణలు చేస్తు కనపడింది. పక్కన జానకి కనపడక, గుడి బయటకొచ్చి చూసాను. కొనేరు ఒడ్డున నిల్చొని, "అది...అది కాదు, ఇది....ఆహ అదే కావలి" అంటు ఎవరినొ తికమకపెడుతు కనపడింది. గబగబ అక్కడికి వెళ్ళి చూస్తే, మా మావయ్య పాలేరు కొడుకు, రఘు కొనేటి నీళ్ళలొ దిగి కలువపూలు కొస్తు కనపించాడు.

నన్ను చూస్తునే జానకి కళ్ళు పెద్దవయ్యాయి.
"బావా కంగ్రాట్స్! నీ కొసమే పూలు కొయిస్తున్నా?" అంది.
"దాంక్స్ రా" అన్నాను.
ఆమె మాట్లాడుతుంటే ఎదొ మత్తు మందు చల్లినట్లుగా అనిపించేది. అప్పుడు జానకి ఇంకా ఎనిమిదొ తరగతి పరిక్షలు రాసి వుంటుంది. ప్రేమించుకొనే వయసు కాదు అది. ఆకర్షించే వయసు అసలు కాదు. కానీ జానకి నాది అనే ఫీలింగ్! తనంటే ఇష్టం తప్ప, ఇంక వేరే ఎలాంటి భావాలు వుండేవి కావు.
కొనేటి బురదలొ నుండి రఘు బయటకు వచ్చాడు. తను కొసిన రంగు రంగు కలువలన్ని గుత్తులా చేసి "ఇదిగొండి అమ్మాయిగారు" అంటు జానకి కి ఇచ్చాడు.

తను వాటిని మురిపంగా చుస్తు.."తీసుకొ బావా" అంది.
తీసుకొకుండా "పూలు నేనేం చేసుకొను" అన్నాను. తన మొహం చిన్నబొయింది.
"మరి ఇంకేం కావాలి?" అడిగింది.
"నాకేం వద్దు నిన్ను చూడాలనిపించి ఇలా వచ్చాను. అది సరేగానీ నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకొంటున్నాను. అది జాయిన్ అయితే ఈ ఊర్లొ వుండటం కుదరదు. సిటీలొ వుండాలి. ఎప్పుడొ పండగలకొ సెలవలకొ తప్పు అస్తమానం నిన్ను చూడటం కుదరదు. ఏం చేయమంటావ్?" అడిగాను.

పూలు తీసుకొలేదన్న కొపంలొ వుంది తను. " నీకు నచ్చినట్లు చేయ్. నాకెందు కు చెప్పడం" ఉక్రొషంగా అంది.
"అది కాదు రా" అని నేను అనబొతుంటే
"పొ బావా నాతొ మాట్లాడకు" అనేసి, "రా రఘు మనం వెల్దాం" అని లేచి నిలబడింది. తనకి ఎందుకు కొపం వచ్చిందొ అప్పుడు తెలియలేదు. ఎందుకంటే ఆడపిల్ల మనసు తెలుసుకొనే వయసు కాదది.

జానకి కి కొపం వస్తే ఒక పట్టాన వదలదు. హరిహరాదులు వచ్చి చెప్పినా సరే...అంత మొండిది. నా మాటలు పట్టించుకొకుండా అక్కడి నుండి వెళ్ళిపొయింది. తన కొపం ఎలా పొగొట్టాల అని ఆ క్షణం నేను ఆలొచించి వుంటే..జానకి నాకు దూరమయ్యేది కాదు.

ఆ తర్వాత, నేను సిటీలొ కాలేజి లొ చేరాను. నేను చదువులొ మళ్ళీ బిజీ అయిపొయాను. నాలుగేళ్ళ కాలం చాలా వేగంగా పరిగెత్తింది. జానకి కి నాకు దూరం పెరిగింది.

కాలంతొ పాటు చాలా మార్పులొచ్చాయి. వర్షాలు లేక పంటలు పండక నాన్న అప్పులు పాలయ్యారు. మావయ్య వ్యవసాయం మానేసి, ఎన్నికలలొ నిలుచున్నాడు. ఎమ్ ఎల్ యే గా గెలిచాక, స్టేటస్ మారిపోయింది. హొదా పెరిగాక ఇంటికి రావడం మానేసాడని అమ్మ సెలవులకు వెళ్ళినప్పుడు చెప్పింది. ప్రతీ సెలవలకు, జానకి వాళ్ళ అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళిపొయేది. ఆమెని చూసి నాలుగు సంవత్సరాలు అయ్యింది.

(ఇంకావుంది)

Wednesday, May 18, 2011

ప్రణయ కావ్యం - 4

ఎప్పుడు ఎవరిదగ్గర అబద్దం చెప్పినా అమ్మకి మాత్రం నేను అన్ని నిజాలే చెప్పడం అలవాటు. వెంటనే జరిగినదంతా పుసగుచ్చినట్లు చెప్పాను. అమ్మ తల పట్టుకు కూర్చుంది.

"నీ వయసేంటి...నువ్వు చేస్తున్న పనులేంటి? నీకేమన్నా అర్దమవుతుందా?" కొపగించుకుంటు అడిగింది.

నేను చేసింది నాకు తప్పు అనిపించలేదు అందుకే నాకేమి పట్టనట్లు కాళ్ళు కడుక్కొని వచ్చి అన్నం వడ్డించమని కూర్చున్నాను.

"ఒక్కగానొక్క కొడుకువని ముద్దుచేస్తున్నందుకు మీనాన్నని అనాలసలు. నువ్వు చేస్తున్న పిచ్చిపనుల మూలానా నీ కేమైనా అయితే?? మా గతేం కావాలి?" అని అమ్మ కళ్ళు ఒత్తుకుంటుంటే, నాన్న వచ్చారు.

"ఏం కాదులే. నా కొడుకిని పిరికి గొడ్డులా తయారు చేయకు" కాళ్ళుకడుక్కొంటు అన్నారు.

నాన్న సపొర్ట్ దొరికేసరికి ఇంతవరకు, ఆయన ఏమంటారొ అని వున్న భయం ఎగిరిపోయింది.

"మీ తండ్రి కొడుకులకు నా బాధ అర్దంకాదు.." అని సణుక్కుంటు వచ్చి భొజనం వడ్డించిది అమ్మ.

గొడ్లశాలలొ వెలుగుతున్న మంట చూసిన ఆ ఇంటాయన, పక్కనే వున్న పుస్తకాల బ్యాగ్ చూసి జరిగినదంతా నా పనే అని అర్ధం చేసుకున్నాడు.
కొపంతొ ఊగిపోతు..మానాన్నతొ చెప్పి నాలుగు తగిలించాలని అదే వర్షంలొ ఇంటికి వచ్చాడు.

కానీ మా నాన్న అతని మాటలు పట్టించుకొలేదు. అతని కి చాలా కొపం వచ్చింది. పెద్ద గొడవే జరిగింది. చాలాసేపు నాన్నతొ వాదించి అలసిపోయి వెనక్కి వెళ్ళిపొయాడు. నాన్న మాత్రం నన్నేం అనలేదు.

అమ్మ అయితే- "బావుంది. ఇలా అయితే మీ కొడుకు రొజుకొ గొడవ ఇంటికి తీసుకొస్తాడు. సమర్దిస్తువుండండి." దెప్పిపొడుస్తు అంది.
"నా కొడుకు ఏం చేసినా అది మంచి పనే అవుతుంది తప్ప.. చెడ్డపని ఎప్పుడుకాదు." నన్ను విశ్వసిస్తు బలంగా అన్నారు. నాన్న కళ్ళలొ ఏదొ తెలియని నమ్మకం నామీద కనపడింది ఆ క్షణాన.

నాన్న "నేను పెద్దగా చదువుకొలేదు. నాకు ఏమి తెలీదు" అని ఎప్పుడు అంటుంటారు గానీ, నా దృష్టిలొ ఆయనొ చదవలేని పుస్తకం. పుస్తకాలను కాకుండా జీవితాన్ని మాత్రమే ఆయన చదివారు. ఆయనకు తెలిసిన జ్నానం అంతా మంచి తనమే. అదే నాకు అబ్బిందని అమ్మ అప్పుడప్పుడు అంటుంది.

చెప్పడం ఆపాను. మరి తర్వాత ఎమయ్యింది? భవ్య అడిగింది.


నా బాల్యం గురించి ఇంతకన్న ఎక్కువ చెప్తే బొర్ ఫీల్ అవుతావు. దాదాపు నా చిన్నతనం అంతా ఇలాగే అల్లరి చిల్లరగా, నాకు తొచినదే చేస్తు..ఊర్లొ ఓ మొండివాడిగా పేరు తెచ్చుకున్నాను. నేను చేసే పనులు నాకు మాత్రమే మంచిగా అనిపించేవెందుకొ. మిగతావాళ్ళంతా నన్నొ పిచ్చాడిలా చుసేవారు. మానాన్న తర్వాత నన్ను బాగా సపొర్ట్ చేసిన వ్యక్తి... జానకి. "బావా నువ్వు ఏం చేసినా, నా పుల్ సపొర్ట్ నీకే అనేది."

మా మావయ్య కూతురు. అంటే అమ్మ అన్నయ్యకూతురు. నాకన్నా నాలుగేళ్ళు చిన్న. నాకు తనంటే చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే..తననే పెళ్ళి చేసుకొవాలనేంత ఇష్టం.

నువ్వు టెన్త్ లొ మన ఊరికి ఫస్ట్ వస్తే నాకుతురిని నీకే ఇచ్చి పెళ్ళి చేస్తా అని మా మావయ్య వేళాకొళం ఆడితే నిజమనుకొని, స్టేట్ ఫస్ట్ వచ్చేలా రాత్రనక పగలనక నా అల్లరంతా పక్కన పెట్టి మరి చదివాను. స్టేట్ ఫస్ట్ రాలేదు గానీ జిల్లా ఫస్ట్ వచ్చాను.

సంతొషంతొ ఎగిరి గంతేసి.."మావయ్యా పెళ్లి ఎప్పుడు??" షర్ట్ కాలర్ ఎగరేస్తు అడిగాను.

"పిచ్చి సన్నాసి. నువ్వు పాసయ్యింది. టెన్తే.. ఐ.ఎ.స్సొ, ఐ.పి.స్సొ, కాదు." నా సంతొషం మీద చెళ్ళున నీళ్లు జల్లినట్లు అన్నాడు.

"మరి ఆరొజు ఎందుకు అలా అన్నావు?" నిలదీసినట్లు అడిగాను.

"ఓర్ని! ఎలాకొలానికి అలా అన్నానురా. అయినా జానకి ని నీకు కాక ఇంకెవరికిస్తాను గానీ ముందు నీకు మీసాలు రాని...తర్వాత పెళ్ళిగురించి ఆలొచిద్దాం" అనేసి భుజం మీద తువ్వాలు వేసుకొని పొలం కి వెళ్ళిపొయాడు.

జానకి అప్పుడు ఆరొ తరగతి అనుకుంటా చదువుతుంది. పరిగెత్తుకుంటు నాదగ్గరకొచ్చి, "బావా తొట్లొ బొల్డన్ని మావిడపళ్ళు కాసాయి. వస్తావా కొసుకుందాం?" ఆయాస పడుతు అడిగింది.

నా మనసప్పుడు మావిడపళ్లుమీద లేదు. మావయ్య అన్న మాటలనే ఆలొచిస్తు... "నాకు పనుంది. నువ్వు వెళ్ళీ మీ ఫ్రెండ్స్ తొ ఆడుకొ" అని విసుక్కుంటు వచ్చేసాను.

ఆ రొజు ఇంటికి వచ్చేసినప్పటి నుండి అద్దం పట్టుకొవడం మొదలు పెట్టాను.

"మీసాలు ఎప్పుడొస్తాయబ్బా??" అద్దంలొ నన్ను నేను చుసుకుంటు నాలొ నేనే గొణుక్కుంటుంటే.. అమ్మ "ఈ మద్య కొత్తగా అద్దం పిచ్చి పట్టిందేంట్రా??" అడిగింది. మావయ్య అన్నమాటలు చెప్పాను. అమ్మ పడి పడి నవ్వింది.

"నువ్వు పెద్దవాడివయితే మీసాలు వాటంతట అవే వస్తాయి. వాటికొసం అద్దం పట్టుకొని కుర్చొనక్కర్లేదు. బుద్దిగా చదువుకొ" అమ్మ అంది.

అమ్మ చెప్పినట్లు ఇంటర్ లొ చేరాను. రెండు సంవత్సరాలు కళ్ళు మూసితెరిచేంతలొ గడిచిపొయాయి.


(ఇంకావుంది)

ప్రణయ కావ్యం - 3

నా చేతి కట్ట్లు విప్పుతు, అక్కడున్న జాలార్లు నందరిని నొటికొచ్చినట్లు తిట్టింది.
"చిన్నపిల్లాడు ఏదొ తెలియక చేస్తే ఇలా చెట్టుకు కట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయ్" అంది. చుట్టు చేరిన జనాన్ని చుసి "ఏం మీ ఇళ్ళ లొ పిల్లలు లేరా,,వాళ్ళని ఇలాగే కట్టేస్తే చుస్తా నిల్చుంటారా?" ప్రశ్నించే సరికి లొపల నుండి అసలు జాలారి బయటకు వచ్చాడు.
"ఇంతకు ముందు మీ మావకు ఎన్ని సార్లు చెప్పాం? మా నొటికాడ కూడు నేల పాలు చేస్తుంటే ఎన్ని సార్లని వురుకొవాలి?" అడిగాడు.
"వాడికి అవన్ని తెలియవు. చిన్నపిల్లాడు. నేను నచ్చ చెపుతాను" కొపం తగ్గించుకొని అంది.
"మళ్ళీసారి ఇలా జరిగిందంటే మాత్రం చుస్తు ఊరుకునేదిలేదు." వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు.

ఇంటికి వెళ్ళిన తరవాత నాన్నకు జాలార్లంతా నన్ను చెట్టుకు కట్టెసిన విషయం చెప్పింది అమ్మ. నాన్న ఎమి అనలేదు. నేను చెసిన పని తప్పు అన లేదు. సమర్దించనులేదు. మనకు మనమే జీవితపాఠాలను నేర్చుకొవాలనేది ఆయన సిద్ధాంతం.
వరిసిపొయిన చేతులుకు వెన్న రాస్తు..అమ్మ కళ్ళంట నీళ్ళుపెట్టుకుంది. అమ్మ బాద చుసి.."నేనమన్నా తప్పుచేసానమ్మా?" అమ్మ ఒడిలొ తల పెట్టుకొని అడిగాను.
"అవును నాన్న అలా చేయడం తప్పు. చేపల వేట జాలార్ల జీవనాదారం. అలా చేస్తే పాపం వాళ్ళు ఎలా బ్రతుకుతారు. చెప్పు?" అడిగింది.
"వాళ్ళు బ్రతకడం కొసం..చేప పిల్లలు చావాలా?" ప్రశ్నించాను.
ఆ ప్రశ్నకు అమ్మ దగ్గర సమాదానం లేదు. ఐనా "మన బ్రతుకు చక్రమే అంత నాన్న..ఒకరి మనుగడకు మరొకరు బలి అవ్వక తప్పదు." అంది. ఆమె మాటలు అప్పుడు అర్దం కాలేదు. నాకు అర్దమయ్యేలా ఎలా చెప్పాలొ అర్దం కాక మౌనంగా వుండిపొయింది.
"అవన్ని నాకు తెలీదు. వాళ్ళని నాన్నలా వ్యవసాయం చేసుకొని బ్రతకమను." అన్నాను. అమ్మకు నవ్వు వచ్చింది.
"ఎవరిష్టం వాళ్ళది. నువ్వు ఇలాగే బ్రతకాలి అని చెప్పడానికి మనం ఎవరు?" అంది అమ్మ. మనుషులును శాసించేందుకు ఓ అర్హత కావాలని నాకు అప్పుడు మొదటిసారిగా అర్దమైంది.
"ఆ వయసులొనే" భవ్య కనుబొమలు ఎగరేస్తు అడిగింది. జొక్ లా అందొ సీరియస్ గా అన్నాదొ గాని నిజంగానే అలాంటి ఆలొచనలు సాదరణంగా అందరికి చిన్నవయసులొ రావు. కాని అబిరామ్ కు వచ్చాయి. అప్పుటి నుండే అతనికి మనుషులును శాసించే శక్తి కావాలని రొజు దేవుడిని ప్రార్దించడం మొదలుపెట్టాడు.
"ఆ తర్వాత ఎమయ్యింది?" అడిగింది భవ్య.
"ఆ తర్వాత ఎప్పుడు ఈతకు వెళ్లినా జాలార్లు పట్టిన చేపల జొలికి వెళ్ళలేదు. వలల్లొ చిక్కుకుని విలవిలలాడుతున్న చేపలను చుసి మనసు గిజగిజలాడిపొయెది. అమ్మ ఎప్పుడైనా చేపలకుర వండితే. తినాలనిపించేదికాదు. కొన్నాళ్ళకు ఈతకు వెళ్ళడం మానేసాను.


అప్పుడు నాకు ఎడేళ్ళు.

ఆ రోజు వర్షం జొరుగా కురుస్తుంది. స్కూలు నుండి ఇంటికి తడుచుకుంటునే వెల్తున్నాను. పరుగులాంటి నడకతొ పుస్తకాల బాగు తలమీద పెట్టుకొని వెళ్తున్న నేను ఓ ఇంటి ముందు దృశ్యం చూసి ఆగిపొయాను.

ఆ ఇంటి ముందు వర్షం నీట్లొ పూర్తిగా తడిచి ముద్ద అయిపొయి ముడుచుకుకూర్చున్న రెండు ఆవులు కనపడ్డాయి.

నొరులేని ఆ మూగజీవాల్ని చూస్తే జాలేసింది. వెంటనే వాటి యజమాని మీద కొపం వచ్చింది. లంకంత పశువుల శాల కట్టాడుగానీ వాటిని బయటే ఎందుకు కట్టేసాడొ అర్దం కాలేదు ఆలొచిస్తు, ఆ ఇంటి వైపు వెళ్ళాను.

అప్పటికే బాగా తడిసిపొయి వుండడంతొ గజ గజ వణుకుతున్నా అది పట్టించుకొనే స్థితిలొ లేను. కొపంగా ఆ యజమాని ఇంటి తలుపు తట్టబొయి కిలకిల నవ్వులు వినిపించి ఆగాను. పక్కనే తెరచి ఉంచిన కిటికీ కనపడి అటు వైపు వెళ్ళాను. తప్పు ఒప్పులు తెలియని వయసది. పరాయి వాళ్ళ కిటికీలొ నుండి తొంగిచూడకుడదని అప్పుడు నాకు తెలీదు.

"ఏంటి మావ బయట పశువులు వర్షంలొ తడిసిపొతుంటే నీకిప్పుడు సరసాలేంటి? వదులు మావా?" ఆడగొంతు వినపడింది.

"ఓస్ ఇప్పుడెళ్ళీ ఆటికి గొడుగు పడతావేటే?" ఎగతాళిగా మగ గొంతు వినపడింది.

"అది కాదు మావ, వాటిని గొడ్లొ కట్టేసి వస్తాను వదులు" ఆడగొంతు గింజుకుంటున్నట్లు అంది.

"బయట జొరుగా వర్షం పడుతొంది. లొన వెచ్చగా దగ్గరకి రావడం మానేసి...పశువులు..పిడకలు అని ఏడుస్తావేమే" కొపగించుకొంటు అతని గొంతు వినపడింది.
బలవంతంగా ఆమెని ఒళ్ళొకి లాక్కొన్నాడు. ఆమె అతని కి అడ్డు చెప్పలేక అతని ఒళ్ళో వాలిపోయింది.

నాకు అప్పుడు ఏదొ ఒకటి చేసి వాళ్ళ మూడ్ పాడుచేయాలనిపించింది. ముందుగా బయటవున్న ఆవులు తాళ్ళు విప్పేసి, శాలలొ కట్టాను. వెచ్చగా పక్కనే చిన్న మంట పెట్టాను. ఆ వేడిలొ అవి చలి కాచుకుంటు ముడుచుకొని పడుకున్నాయి.

నేను ఆ ఇంటి పైకి ఎక్కి, వాళ్ళిద్దరు పడుకున్న గది పెంకులు ఒక్కటొక్కటిగా తొలగించాను. వర్షం నీళ్ళు మీద పడడంతొ ఒక్కసారిగా ఉలిక్కిపడి మీదకు చూసారిద్దరు. అప్పటికే గబగబా సగం పెంకులు పీకి కిందకు విసిరేసాను.

ఏం జరిగిందొ వాళ్ళకు అర్దమయ్యేసరికి, ఇంటి మీదనుండి పక్కనున్న గడ్డికుప్పమీదకు ఒక్క ఉదుటన దూకి, సర్రున క్రిందకు జారి, ఊళ్ళోకి పరుగుతీసాను.

ఎవరొ ఇంట్లొ దొంగలు పడ్డారనుకొని అదిరిపడి కేకలు వేయడం నాకు వినపడేసరికి వీది చివరకు చేరుకున్నాను. అప్పటికే ఇల్లు, ఇంట్లొ మంచం తడిసిపోయివుండొచ్చు. ముగజీవాల్ని ప్రేమించలేనివాళ్ళకు అది అసలు చాలా చిన్న శిక్ష..మనసులొ అనుకుంటు ఇల్లుచేరాను.

పుర్తిగా తడిసిపొయి ఇంటికి వెళ్ళిన నన్ను చూసిన అమ్మ "నీ పుస్తకాల బాగ్ ఏది రా?" అడిగింది.
అప్పుడు గుర్తొచ్చింది, పుస్తకాల బ్యాగ్ ఆ గొడ్లశాలలొ మర్చిపొయానని.

(ఇంకావుంది)

ప్రణయ కావ్యం - 2

వాళ్ళు ఎక్కిన విమానం టేకాఫ్ తీసుకోవడానికి రనవే పై వేగం గా కదిలింది.

అబిరామ్ భవ్య పక్క పక్కనే కుర్చున్నా అపరిచితులు లా మాటలడుకొవడం లేదు. ఎర్ పొర్ట్ వచ్చే వరకు ఇద్దరు మాట్లాడకొకుండానే వున్నారు. భవ్య ని కదిలించాలంటే భయంగా వుంది అతనికి. అసలే అతని మనసు చాల సెన్సిటివ్. త్వరగా విమర్శలను స్వీకరించలేడు. తన ని ఎవరన్నా ఎమన్నా అంటే సాదారణం గా వురుకునే రకం అసలు కాదు. కాని తప్పదు. ఆమెని భరించాలి. పెళ్ళి చేసుకొవాలి. ఆమెకి ఇష్టం వున్నా లేకున్నా...వాళ్ళ పెళ్ళి జరగాలి. తనది స్వార్దం అని తెలుసు...అందుకు ఓ ఆడపిల్ల జీవితం తొ ఆడుకుంటున్నాడని తెలుసు. అయినా తప్పదు. మనసంతా గిల్టి ఫిలింగ్ తొలిచేస్తుంటే అసహనంగా సీట్లొ కదిలాడు.

"నాకు అలా సైలంట్ గా వుంటే నచ్చదు. ఎదైనా మాట్లాడండి" అతన్ని మాట్లాడించాలని భవ్యనే మాటలు కలిపింది. ఆమె మాటలు చాలా డిమాండింగ్ గా వున్నాయి. "ఎం మాట్లాడాలి.." ఆలొచిస్తు "మీరే మాట్లాడండి" అన్నాడు.

కాసేపు ఆలొచించి...
"మీరు మా డాడి కి పరిచయం అయిన రొజు నుండి మా డాడి మిమ్మల్ని అల్లుడు చేసుకొవాలని ఒకటే మాట కలవరిస్తుండేవారు. మీ ఫొటొ చుపించి నచ్చాడా నచ్చాడా అని నా బుర్ర తినేసేవారు. కొన్నాళ్ళు నన్ను చదువుకొనివ్వండి డాడి అంటే నా మాట వినలేదు. మీరు నా ఫొటొ కుడా చుడకుండా నన్ను పెళ్ళి చేసుకొవడానికి ఒప్పుకున్నారని తెలిసి ఎగిరి గంతేసారు. నా ఇష్టాఇష్టాలు తొ పని లేకుండా నన్ను మీతొ బలవంతంగా ఇండియా పంపిస్తున్నారు." చెప్పడం ఆపింది.
ఆమె నిజాయితి నచ్చింది అతనికి.

"నాక్కుడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయినా కొన్ని బలమైన కారణాల వలన నిన్ను మేరేజ్ చెసుకొంటానని మీ డాడి కి చెప్పాను. బట్ అయామ్ రియల్లి సొరీ." అన్నాడు. అతను ఎమి చెపుతున్నాడొ ఆమె కి అర్దం కాలేదు. విచిత్రంగా చుసింది.
"నీకు క్లియర్ గా అర్దమవ్వాలంటే..నా కధ నీకు తెలియాలి." అన్నాడు.
చెప్పమన్నట్లు చుసింది.

అబిరామ్ దీర్ఘంగా ఊపిరి తీసి చెప్పడం మొదలుపెట్టాడు.

మీ డాడి ఇప్పుడు చుస్తున్న అబిరామ్ పెద్ద బిలియనీర్. కాని ఒకప్పుడు తినడానికి తిండి లేక చేయి చాచి అడగడానికి అబిమానం అడ్డొచ్చి ఆకలి తొ కాళ్లు ముడుచుకొని పడుకున్న రాత్రులు గురించి ఆయనకు తెలియవు. నేను చాలా పూర్ ఫామిలి నుండి సొంత కష్టం మీద పైకి వచ్చాను. నా వెనుక ఏ గాడ్ ఫాదర్ లేరు. తాతలు సంపాదించిన ఆస్థులు ఏమి లేవు. నన్ను ఈ ప్రస్థానానికి చేర్చిన నా కధ ...మా ఊరు గొదావరి జిల్లాల మద్యన వున్న అవిసెపాలెం లొ మొదలైంది.

అదొక అందమైన పల్లెటురు. ఊరి చివర వెలివేసినట్లు మా ఇల్లు వుండేది. మా ఇంటి చుట్టుపక్కల దరి దాఫుల్లొ ఏ ఇల్లు వుండేది కాదు. మా నాన్నకు వాళ్ల నాన్న పొతు పొతు ఇచ్చిన పొలం అంటే ప్రాణ్ం. ఆ పొలం లొనే వాల్ల అమ్మ నాన్నలను చుసుకునేవాడు. పొలం కు దగ్గర గా వుండాలని ఇల్లు కుడా ఊరి చివర పొలంకు దగ్గర గా కట్టుకున్నాడు. తనకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఆ పొలం కి వెల్లి మనసు కుదుట పడే వరకు అక్కడే కుర్చునేవాడు. చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేసేవాడిని, నా అల్లరిని మా అమ్మ అదుపు లొ పెట్టలేకపొతున్నానని అస్తమానం నాన్న దగ్గర వాపొయేది." అని చెప్పడం ఆపాడు అబిరామ్.

"హలొ చిన్నప్పుడు అందరం అల్లరి చేస్తాం అదేం పెద్ద విషయమా? ఇంట్రస్ట్ంగ్ గా ఎదైనా చెప్పు" విసుగ్గా మొహం పెట్టి అంది భవ్య.
ఆమె అడిగిన తీరుకు అతనికి నవ్వు వచ్చింది.
"అందరిలాంటి అల్లరి నాది కాదు భవ్య. నాకు ఆడుకొవడానికి అన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరు. ఇంటి చుట్టుపక్కల దరిదాపుల్లొ ఇల్లు లేకపొవడం వలన చిన్నపిల్లలు ఎవరు లేక నా చిన్నతనం ఎక్కువ ఒంటరిగా గడిచింది. ఏదొ తెలియని మొండితనం ఎవరిమీదొ తెలియని కసి తొ నాలొ బాగా అల్లరి ఎక్కువైంది. ఒంటరిగా నాలొ నేనే మాట్లాడుకొనేవాడిని,,నాతొ నేనే ఆడుకునేవాడిని. ఏపుగా ఎదిగిన చెట్లు... పొలం గట్లు నా స్నేహితులు.

నాకు ఏడేళ్ళప్పుడే... గొదారి నీళ్ళలొ ఒక్కడినే అలుపువచ్చేదాకా ఈదేవాడిని, చేపలు పట్టడానికి వచ్చే నాటుపడవల తొ ఈత కొడుతు పొటిపడేవాడిని, వలేసి చిక్కిన చేపలను..ఒద్దిక గా బుట్టలొ దాచుకునే జాలార్ల కళ్ళు కప్పి బుట్టడు చేపలను నీటిలొ వదిలేసేవాడిని, వేట పడవలకు దురంగా స్వచ్చమైన గొదారి నీట్లొ స్వేచ్చ గా ఈదుకుంటు పారిపొతున్న చేపల్ని చుసి ఆనందంతొ ఒక్క అంగలొ నీట్లొ దుకేవాడిని.

"వావ్ ఇంట్రెస్ట్ంగ్..మరి వాళ్ళు నిన్ను ఏమి అనేవారు కాదా?" అడిగింది.

"అబ్బొ చాలా సార్లు మా నాన్నకు చెప్పారు. మా నాన్న నన్నేమి అనేవాడు కాదు. నాకు కావల్సినంత స్వేచ్చ ఇచ్చేవారయన. నాన్న తొ చెప్పిలాభం లేదని, ఓ సారి గోదారి ఓడ్దున చెట్టుకేసి కట్టేసారు. మే నెల ఎండలుకు ఒంటినుండి చెమట దారాళంగా కారుతుంది. కాళ్ళకింద ఇసుక సర్రున కాలుతుంది.

"ఏరా మళ్ళీ ఇంకెప్పుడు...ఇలాంటి ఎదవపని చేయనని చెప్పు..వదిలేస్తాం" ఓ జాలారి నా దగ్గరికి వచ్చి అడిగాడు. నా కళ్ళలొ వాడికి ఎలాంటి భయం కనిపించక "ఏంటి చెప్తావా..రాత్రయ్యేదాకా చెట్టుకే వుంటావా?" మళ్ళి అడిగాడు.
"నువ్వే చేపలు పట్టడం మానేయ్" అన్నాను. ఉలిక్కిపడ్డాడు. నా వంక తినేసేటట్లు చుసాడు. చుట్టు చేరి చిత్రంగా చుస్తున్న మిగతా జాలార్లు నా సమాదానం విని ఆశ్చర్యపొయారు.
ఆ వయసులొ ఎక్కడినించి వచ్చిందొ ఆ ద్యెర్యం..నాకు ఎప్పటికి అంతు చిక్కదు.
"నీకు మాములుగా చేప్తే వినవురా. కడుపుకాలేతే గాని దారిలొకి రావు. ఒరేయ్..వీడి అమ్మ బాబు వచ్చినా వీడిని వదలోద్దు. ఎలా దారికి రాడొ నేను చుస్తా" అనేసి.. జెబులొ వున్న చుట్ట తీసుకొని వెలిగించుకుని దురంగా వున్న తన గుడిశ లొకి వెళ్ళాడు.

చీకటి అయ్యేదాక మానాన్న పొలం నుండి ఇంటికి వచ్చేవాడు కాదు. రాత్రవుతున్నా నేను ఇంకా ఇంటికి రాలేదని అమ్మకు ఖంగారు మొదలయ్యింది. గొదారి ఒడ్డున ఇసుక తిన్నేల మీద పొద్దుపొయేదాక ఆడుకుని ఈపాటికి ఇంటికి వచ్చెసేవాడిని అలాంటిది..ఇంతవరకు రాలేదేంటని మరొనిమషం ఇంటిదగ్గర వుండలేక, నాన్న వచ్చెవరకు ఆగ లేక నదిఒడ్డుకు బయలుదేరింది. మద్యలొ ఎవరొ ఎదురై అసలు విషయం చెప్పారు.
అమ్మకు ఒక్కసారిగా వాళ్ళమీద కొపం పొంగుకొచ్చింది. పరుగులాంటి నడక తొ నన్ను కట్టేసిన చెట్టు దగ్గరకు వచ్చింది. దాహంతొ నొరు ఎండిపొయిన నేను వెంటనే అమ్మా అని పిలవలేకపొయాను. నా పరిస్థితి చుసి అమ్మకు కళ్ళలొ నీళ్ళు పొంగుకొచ్చాయు.

(ఇంకావుంది)

ప్రణయ కావ్యం - 1

అమెరికా లొ అత్యంత ఖరీదయన, ఎత్తేన భవనమది. అందులొ టాప్ ఫ్లొర్ లొ అబిరామ్ అద్దం ముందు నిలుచున్నాడు, బాగా తెలిసిన వారందరు అతన్ని అబీ అని పిలుస్తారు. వాళ్ళా అమ్మమ్మ ఐతే రాముడు అని పిలుస్తుంది. అతను ఇప్పుడు అమెరికా లొ పెద్ద్ బిజినెస్ మగ్నెట్. ప్రపంచాన్ని శాసించే అతి కొంత మంది ధనంతుల లొ ఒకడు, మూడు పదులు కుడా ధాటని వయసు లొ ఇంత పెద్ద స్థాయి కి ఎలా చేరాడొ అని అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తొంది.

మొస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అతను. పెళ్ళి కాని ఆడపిల్లలు వున్న బిలియనీర్స్ అంతా అతన్ని అల్లుడు చేసుకొవాలని తెగ ప్రయత్నిస్తున్నారు, ఫొన్ చెసి విసిగిస్తున్నారు. అవన్ని చూసుకొవడానికి అతని అమ్మ నాన్న ఇక్కడ లేరు. వాళ్ళు ఆంధ్ర లొ మారు ముల పల్లెటురు లొ వున్నరు. ఇద్దరి కి చదువు రాదు. నాన్న కు పొలం పని తప్ప ఏమి రాదు. కొడుకు ఏ పొజిషన్ లొ వున్నాడొ...ఎంత సంపాదించాడొ ..వాల్ల కు అర్దమ్యే స్థితి లొ లేరు. ఇక అతని కి పిల్లని ఎక్కడని చుస్తారు.

కాఫి తాగుతు అద్దంలొ నుండి, పడమర కు జారుకుంటున్నా సూరిడిని చూస్తు వేడి నిట్ఠుర్పు విడిచాడు అబిరామ్. ఈ ఉరుకు ల పరుగుల జీవితం తొ తనకేం సంబందం లేదన్నట్లు తన డ్యుటి తాను చేసేసి విశ్రాంతి తీసుకొవడానికి నిష్క్రమిస్తున్నట్లుగా సూరిడి కనిపించాడు.

ఈ భుమ్మిద పుట్టిన ప్రతి ఒక్కరికి విశ్రాంతి అనేది ఎప్పుడొ అప్పుడు ఏదొ ఒక రుపం లొ దొరుకుతునే వుంటుంది. కాని తనకు మాత్రం కల లొ కుడా ఊహించడానికి చాలా కష్టం. అసలు కనులు ముసుకొనే సమయం దొరికితే కదా కలలు కనడానికి. ఇరువ్య్ నాలుగు గంటలు తనకు పని తొనే సరి పొతుంది. ఆఫిసు లొ అంతా పని రాక్షసుడు అని ముద్ర వేసేసారు. అవన్ని అతని కి పట్టవు. అసలు అతనికి పని లొనే మజా వుంది. కాని ఈ రొజు మొట్టమొదటిసారి గా ఎందుకొ విశ్రాంతి కావాలనిపిస్తుంది.

"సర్ మీ కొసం భవ్య మేడ్ం కాల్ చేసారు" ఆలొచనలను డిస్త్రుబ్ చేస్థు పి.యే. రఘు వచ్చాడు.

భవ్య... ఆ పేరు వింటునే ఉలిక్కి పడ్డాడు. గత రెండు రొజులు గా బాగా డిస్త్రబ్ చేస్తున్న పేరు!! తను ఎలా వుంటాదొ తెలియదు. తనని అతను పెళ్ళి చెసుకొవాలి. ఇప్పటి వరకు ఆమె తొ మాటలాడలేదు కుడా. తన సెల్ ఫొన్ వంక చుసాడు. ఎనిమిది మిస్డ్ కాల్స్ వున్నాయ్. సెల్ లిఫ్ట్ చెయలేదని రఘు కి చేసినట్లుంది.

" ఏంటి సర్ ఆలొచిస్తున్నారు?" రఘు అడిగాడు. ఏమి లేదు అని ఫొన్ అందుకున్నాడు అబి.

" అయమ్ వైటింగ్ ఇన్ కార్... ఫ్లేట్ టయిమ్ అవుతుంది" భవ్య అంది ముక్తసరి గా.

వాచ్ చుసుకుంటు " యా.. అయమ్ కమింగ్" అనేసి ఫొన్ కట్ చేసాడు అబి.

అదే మొదటి సారి గా ఆమె గొంతు వినడం. గొంతు చాలా స్వీట్ గా వుంది గాని ఎలాంటి ఫీలింగ్స్ ఆమె కు లేనట్లుగా అనిపించింది. "మా అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. నువ్వే ఎదొ చేసి ఆమెని నీ దాన్ని చేసుకొవాలి..అంతా నీ చేతి లొనే వుంది." అన్న రామచంద్ర రావు గారి మాటలు గుర్తుకు వచ్చాయి అబి కి.

ఈ రొజు ఇద్దరు కలసి ఒకే విమానంలొ ఇండియ వెల్తున్నారు. ఇష్టం లేని అమ్మాయి తొ అంత దురం ప్రయణం అంటేనే గుబులుగా వుంది అతనికి. అసలు అబిరామ్ కు కుడా ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. కాని ఈ పెళ్ళి జరాగాలి. అందుకే తన బిజి అంతా పక్కన పెట్టి ఆమె తొ ఇండియా బయలుదేరాడు. అక్కడ అమ్మ నాన్న కు చుపించి, వాళ్ళ ను ఈ పెళ్ళికి ఒప్పించాలి.

గబ గబ ఆఫీసు బాద్యతలు రఘు కు అప్పగించి, లాప్ టాప్ బాగ్ బుజాన తగిలించుకొన్నాడు. పరుగు లాంటి నడక తొ లిఫ్ట్ చేరుకున్నాడు. హడవిడి గా బయటకు వెళ్తున్న బాస్ వంక స్టాఫ్ అంతా విచిత్రంగా చుసి, మళ్లి వాళ్ల పనుల్లొ లినమైపొయరు.

తన జీవితం ఎప్పుడు హడావిడే...ఆఖరి కి పెళ్ళి కుడా. మొదటి సారి గా తనకు కాబొయే జీవితభాగస్వామిని చుస్తున్నాడు. అతని ఆలొచనల లొ అతను వుండగా లిఫ్ట్ పార్కింగ్ ఫ్లేస్ లొ ఆగింది. లిఫ్ట్ నుండి బయటకు వచ్చి చుట్టు చుసాడు. అతని కొసమే వెయిట్ చేస్తున్న భవ్య కార్ లొ నుండి చేయి ఊపుతు కనిపించి...అటు నడిచాడు. కారు దగ్గరవుతున్న కొద్ది..ఎదొ తెలియని టెన్స్..అతన్ని చుట్టుముడుతుంది.

ఆమెని ఎమని పలకరించాలి. ఇంత వరకు తన వృత్తి లొ బాగంగా చాలమంది అమ్మాయిలను కలిసాడు. కాని ఎప్పుడు ఇలా అనిపించలేదు. ఆలొచిస్తునిలుచున్న అబి ని చుసి "హయ్" అని డొర్ తెరిచింది. తను కుడా "హయ్" అని ఆమె పక్కనే కుర్చున్నాడు. కార్ కదిలింది. ఒక్కసారి గా ఆమె నుండి అదొ రకమైన పరిమళం అతన్ని చుట్టుముట్టింది. గాలి కి ఆమె ముంగురులు ఎగురుతు అతన్ని తాకాయి. ఇబ్బంది పడుతునే తల తిప్పి చుసాడు.

అతను ఊహించిన దాని కన్నా భవ్య అందంగా వుంది. అల్త్ర్ మొడ్రన్ డ్రస్ లొ హలివుడ్ హీరొయిన్ లా వుంది. తెలుగు అమ్మాయ్ అయినా అమెరికా లొ పెరగడం వలన అలా మొడ్రన్ గా తయరైంది. మేనర్స్ కాదని తెలిసినా ఆమెనుండి తల తిప్పుకొలేక పొతున్నాడు.

అతన్ని గమనించిన భవ్య..." ఏంటి అమ్మాయి ని ఎప్పుడు చుడాలేదా?" చిరాగ్గా మొహం పెట్టి అడిగింది.
అంతే షాక్ తగిలినట్లు అబి మొహం తిప్పుకున్నాడు. అసలు ఎక్స్ పక్ట్ చేయని రెస్పాన్స్ అది. ఐదు నిమిషాలు పాటు మాములు మనిషి కాలేక పొయాడు. "మా అమ్మాయి కి మాట్లాడటం రాదు...ఎమన్నా అంటే పట్టించుకొకండి..ప్లీజ్" అన్న రామచంద్ర రావు మాటలు గుర్తుకు వచ్చి సర్దుకున్నాడు.

కార్ చాలా వేగం గా ఎర్ పొర్ట్ వైపు దూసుకుపొతుంది.
" అయామ్ సారీ" అంది..అబి మాడిపొయిన ఫేస్ చుసి. అతను సమాదానం గా వెర్రి నవ్వు ఒకటి విసిరి నిశబ్ధంగా కుర్చున్నాడు.
ఆమె గొంతు వింటుంటే వచ్చిన కొపం అంతా ఒక్కసారి గా గాలి లొకి ఎగిరిపొయింది. ఆమె స్వరం అంత తీయాగా వుంది.

"అసలు నా కొపం అంతా మీమిద కాదు. మా డాడి మీద. నాకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఈ పెళ్ళికి నన్ను ఒప్పిస్తున్నారు. అవన్ని సరే మనం ఇండియా లొ ఎన్ని రొజులు వుంటాం?" అడిగింది.
అతనికి కుడా ఈ పెళ్ళి ఇష్టం లేదు..కాని తప్పదు. వాళ్ళిద్దరి పెళ్ళి జరిగితీరాలి. ఈ విషయం ఇద్దరికి తెలుసు. తెలిసి ఇండియా ప్రయాణానికి ఒప్పుకున్నారు.
"ఎన్ని రొజులొ మీ డాడి చెప్పలేదా?" అడిగాడు. లేదు అన్నట్ట్లు ఆమె తల ఆడించింది.
"టెన్ డేస్" చెప్పాడు. ఆమె ఎమిఅనలేదు. కిటికి లొ నుండి బయటకు చుస్తు కుర్చుంది.

(ఇంకావుంది)