ఆ రొజు సాయంత్రం నేను సాల్స డాన్స్ క్లాస్ లొ ఉండగా జేమ్స్ ఫ్లవర్ బొకే తొ అక్కడికొచ్చాడు. నేను సీరియస్ గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే, బయట సెక్యురిటీ తొ గొడవపడటం నా క్లాస్ ఫ్రెండ్స్ రొజీ, నిమ్మీ చూసారు. మేం ప్రాక్టీస్ చేసే రూమ్ ఓపెన్ టెర్రస్ కావడంతొ గొడ దగ్గర కుర్చున్న వాళ్ళు అతన్ని చూసి,
"ఏయ్..నీ వైట్ గొట్ వచ్చిందే" ఇంగ్లీష్ లొ అన్నారు.
వాళ్ళు అలా అనగానే వచ్చింది ఎవరొ అర్దమయ్యింది. ఈ మద్య జేమ్స్ నా వెంటపడటం చూసి, వాళ్ళు అతనికి వైట్ గొట్ అని నిక్ నేమ్ పెట్టారు. ఈ రొజుతొ అతని న్యూసెన్స్ వదిలించుకొవాలని నిర్ణయించుకొని చేస్తున్న డాన్స్ మద్యలొ ఆపేసి, బయటకొచ్చాను. అతన్ని ఆట పట్టించడానికి నా ప్రెండ్స్ కూడా నాతొ బయటకొచ్చారు.
నన్ను చూస్తునే " హయ్ భవ్య" మొహం చాటంత చేసుకొని పలకరించాడు దూరం నుండే.
పార్క్ చేసిన నా కార్ దగ్గరకొస్తు "హయ్ జే....హియర్ జెంట్స్ నాట్ అలౌడ్. వెయిట్ అయామ్ కమింగ్" అని చెప్పాను. తను సెక్యురిటీ ని ఇంగ్లీష్ లొ ఏదొ తిడుతూ.. గేట్ బయట వున్న పేవ్ మెంట్ మీద కూర్చున్నాడు.
మరొ ఐదు నిమిషాల్లొ కార్ తీసుకొని బయటకొచ్చాను. ప్రెండ్స్ ఇద్దరూ వెనక సీట్లొ కూర్చున్నారు.
జేమ్స్ ని "కమ్ ఇన్" అని పిలవడం లేటు.. హుషారుగా "దాంక్స్ భవ్య" అంటు డొర్ తీసుకొని ఫ్రంట్ సీట్లొ కూర్చున్నాడు.
కార్ గేర్ మారుస్తూ.." యా టెల్ మీ" అన్నాను.
కొంచెం కూడా ఆలస్యం చేయకుండా " ఐ లవ్ యి భవ్య" ఫ్లవర్ బొకే నా ఒల్లొ పెడుతూ అన్నాడు. అది ఊహించినదే కావడంతొ నేనేం కంగారు పడలేదుగానీ, వెనక కూర్చున్న ఇద్దరు కిసుక్కున నవ్వారు. తను ఫీల్ అవుతాడని "ష్" అని వాళ్ళని మందలించాను.
“Why don’t you understand James? We are not made for each other” విసుగ్గా అన్నాను.
"But Why??" అని అడిగాడు.
“Colors not matching” ప్రెండ్స్ జొక్ చేసారు..
నవ్వొచ్చింది. ఆపుకున్నాను. నిజమే వాళ్ళన్నట్లు తను అమెరికన్ అవ్వడం మూలనేమో.. మరీ తెల్ల గా ఉంటాడు. కానీ అసలు కారణం అది కాదు.
“God made me like this. What to do??” చాలా బాదపడిపొతు అన్నాడు.
“That is not the reason J.” అంటే..”Then What?” వెంటనే అడిగాడు.
"వీడి కి ఎలా చెపితే అర్దమౌతుందే..చిరాగ్గా ప్రెండ్స్ తొ అన్నాను.
“No problems tell me in Telugu. I can understand.” అన్నాడు
"ఒరేయ... లేంగ్వేజ్ ప్రాబ్లమ్ కాదురా బాబు" అన్నాను. పాపం నాకొసం తెలుగు కూడా నేర్చుకున్నాడు.
"సరే విను" అని తెలుగులొనే చెప్పడం మొదలు పెట్టాను.
"నా లవర్ నేను ఎలా ఉండాలనుకున్నానొ...నువ్వు అలా లేవు. తను తెల్లగా ఉండాలనుకున్నా గానీ మరీ ఇలా తెల్ల పెయింట్ వేసినట్లు కాదు. మంచి హైట్ ఉండాలనుకున్నాగానీ..మరీ నీలా తాటిచెట్టులా కాదు. ముఖ్యంగా నా లవర్ కి మాంచి మీసాలు ఉండాలి. నీ మూతి నేషనల్ హైవేలా ఉంటుంది. ఈ మూడు రీజన్స్ చాలా?" కార్ అతని ఇంటి ముందుకు వచ్చాక ఆపుతు అడిగాను.
అతను నా అందం చూసి నాకు ఐ లవ్ యి చెప్పాడు. అతన్ని రిజక్ట్ చేయడానికి అలాంటి కారణాలే కరక్ట్ అని అనిపించి అలా అన్నాను. నిజానికి నాకు ఇండియన్..అదీ అచ్చ తెలుగు ఆంద్రా వాడ్ని చేసుకొవాలని కొరిక. జేమ్స్ మంచొడేగానీ ప్రేమించేంత కాదు.
“Common Bhavya, Don’t tell me silly reasons” కొపంగా అన్నాడు,
"అది కాదు జేమ్స్. టు బి ఫ్రాంక్.. మన రంగులు లాగే మన దేశాలు, ఆచారాలు, సంప్రదాయాలు వేరు. లవ్ చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. తర్వాతే అసలు సమస్యలు మొదలౌతాయి. నాకు నచ్చినట్లు నువ్వు ఉండలేవు.. నీకు నచ్చినట్లు నేను ఉండలేను. నువ్వు నాకొసం నా బాష నేర్చుకున్నంత ఈజీ కాదు...నాతొ కల్సి ఉండటం. Try to Understand J. నువ్వు నన్ను ఒక వారం కూడా భరించలేవు.” అన్నాను.
“I can. Please don’t reject my love” అన్నాడు. చెప్తున్నప్పుడు అతని కళ్ళలొ చూసాను. నన్ను బలంగా కావలనుకొంటున్నట్లున్నాడు. నా తిరస్కారాన్ని భరించలేనివాడిలా మొహం పెట్టాడు.
తనకు మాటలతొ చెప్తే లాభం లేదు. నా చేతల తొ అతనికి అసహ్యం కలిగేలా చేయాలని నిర్ణయించుకొని " సరే ఒక పని చేద్దాం" అన్నాను. ఏంటన్నట్లు ఇంట్రస్టింగ్ గా చూసాడు.
“కావలంటే మనిద్దరం ఒన్ వీక్ కల్సి ఉందాం. అప్పటికీ నన్ను నువ్వు లవ్ చేస్తే.. I will marry you. But one thing అడ్జస్ట్ అవ్వడం అసలు నా బ్లడ్ లొనే లేదు. నీ కొసం నా అలవాట్లు మార్చుకొలేను.” అన్నాను.
“I will adjust for you. Because I need you” అన్నాడు ఉత్సాహంగా.
నా ప్రపొజల్ విని ప్రెండ్స్ ఇద్దరూ షాక్ అయ్యారు. కానీ నాకు జేమ్స్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నన్ను బరించలేక గుడ్ బై చెప్పేస్తాడు. అమ్మా వాళ్ళకు చెప్పొద్దని రొజీ, నిమ్మీలకు వార్నింగ్ ఇచ్చాను.
వారంరొజులు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కి జేమ్స్ వాళ్ళ ఫామ్ హౌస్ లొ అన్ని అరేంజ్ మెంట్స్ చేస్తానని చెప్పాడు. ఒంటరిగా రావడానికి భయమైతే ప్రెండ్స్ ని కూడా తెచ్చుకొమని చెప్పాడు.
నిమ్మీ వాళ్ళ డాడీ ఒప్పుకొడంది. నాకు ఏం భయం లేదు...ఎవరూ అవసరం లేదన్నాను. రోజీ మాత్రం ఒక్కదాన్నే అతనితొ వెళ్ళడానికి ఒప్పుకొకుండా తనూ వస్తానంది.
జేమ్స్ హుషారుగా.." దాంక్యూ భవ్యా" అనుకుంటు వెళ్ళిపొయాడు.
ఆ రొజు ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఏదొ తెలియని కంగారు.. భయం ముసురుకొన్నాయి. ఆవేశంలొ కమిటైపొయానా? అమ్మకి తెలిస్తే...పర్లేదు మేనేజ్ చేయోచ్చు. కానీ డాడీ కి తెలిస్తే, జేమ్స్ శాల్తీ గల్లంతే. అమెరికాలొ డాడీ కు అంత పలుకుబడి వుంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
ఉదయాన్నే ఎరుపెక్కిన కళ్ళను చూసి.."ఏంట్రా బంగారు సరిగా నిద్ర పొలేదా?" కాఫీ కప్పుతొ అమ్మ దగ్గరకొచ్చి అడిగింది.
"అమ్మా ప్రెండ్స్ తొ టూర్ వెల్తున్నా..వన్ వీక్! నాతొ రొజీ కూడా వస్తుంది. డాడీ కి ఏదొ చెప్పి నువ్వే మేనేజ్ చేయాలి" అన్నాను. ఎక్కడికి ఏంటని అడిగింది. అమెరికా లొ మా ఇల్లుతప్ప మరొలొకం తెలియని అమ్మకి నొటికొచ్చిన సిటీ పేరు చెప్పేసాను.
అదేదొ మీ డాడీ కి నువ్వే ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడు ఏదొ బిజినెస్ పని మీద బాంకాక్ వెళ్ళారు. మరొ వన్ వీక్ వరకు రానని నిన్ననే చెప్పారు గా మర్చిపొయావా?" అమ్మ అడిగితే అప్పుడు గుర్తొచ్చింది. ఈ వారం రొజులు డాడీ సిటీ లొ ఉండటం లేదని.
"ఔను కదు.. అయితే డాడీ కి ఏం చెప్పక్కర్లేదు. ఫొన్ చేస్తే ఇంట్లొనే ఉన్నానని చెప్పు. డాడీ వచ్చేలొపు మా టూర్ కూడా అయిపొతుంది" అమ్మతొ కన్నుగీటుతు అన్నాను.
"అమ్మో అబద్దమా నావల్ల కాదు." కాఫీ కప్పు వెనక్కి తీసుకుంటు అంది.
"నాకున్న దైర్యంలొ నీకు ఒక వంతు కూడా లేదమ్మా. నువ్వసలు నాకు తల్లివేనా?? ఇలా అయితే నువ్వు తెచ్చిన అబ్బాయిని చేసుకొను. పొ! ఇక్కడే ఏ వైట్ గొట్ నొ చేసుకుంటా...అప్పుడు గానీ మీ తిక్క కుదరదు." వార్నింగ్ లా అన్నాను.
"అమ్మో తెల్లబకరానా?? అంత ఘనకార్యం అక్కర్లేదు గానీ. ఏదొ మేనేజ్ చేస్తాలే. రొజుకొక్కసారైనా ఫొన్ చేయ్...సరేనా?" అంది. పిచ్చి అమ్మ. అందుకే డాడీ అంత ఈజీగా అమ్మతొ అబద్దాలు చెప్పేస్తాడు. నేనొక అబ్బాయితొ వారం రొజులు గడపడానికి వెల్తున్నానని తెలిస్తే..అదీ ఓ అమెరికన్ తొ అని తెలిస్తే..కళ్ళు తిరిగిపడిపొతుందేమో! ఎదేమైతేనేం..ఒప్పుకుంది. హమ్మయ్యా అనుకొని "మా మంచి అమ్మ" అని అమ్మ చెంపలమీదొ ముద్దిచ్చి...స్నానానికి వెళ్ళాను.
షవర్ లొ నీళ్లు చల్లగా శరీరాన్ని తాకుతుంటే...హయిగా అనిపించింది. త్వరత్వరగా స్నానం ముగించుకుని, టవల్ చుట్టుకొని అద్దం ముందుకొచ్చాను. అద్దంలొ నా ఒంటిపై అక్కడక్కడా నీటి ముత్యాలు మెరుస్తు కనిపించాయి. తీక్షణంగా నన్నొసారి తేరిపార చూసుకున్నాను. నాకు నేనే ముద్దొస్తున్నాను. ఇంత అందాన్ని చూసి జేమ్స్ కుదురుగా ఉంటాడా అని ఆలొచన రాగానే గుబులేసింది."
ఇక్బాల్ కార్ కు సడన్ బ్రేక్ వేయడంతొ, భవ్య మాట్లాడటం ఆపింది.
అప్పటివరకు ఇంట్రస్టింగ్ గా వింటున్న అబిరామ్ వాళ్లతొ పాటు డ్రైవర్ కూడా తమ కబుర్లు వింటున్నాడని అప్పుడు తెలుసుకున్నాడు.
అబిరామ్ కార్ ను పక్కకు తీసి ఆపమన్నాడు. ఇక్బాల్ ను బస్ లొ రమ్మని కావల్సినంత డబ్బులు చేతిలొ పెట్టి, తను వచ్చి డైవింగ్ సీట్లొ కూర్చున్నాడు.
అలా అబిరామ్ ఎందుకు చేసాడొ అర్దమయిన భవ్య " దాంక్యు. నేను అతను ఉన్నాడనే విషయమే మర్చిపొయాను. సిగ్గుతొ ముడుచుకుపొతు అంది.
మళ్ళీ తనే "ఫర్వాలేదే ఆడపిల్ల మనసు అర్దం చేసుకుంటున్నారు." అంది వాతావరణం తేలిక చేస్తు. అబిరామ్ ఆ మాటను కాంప్లీమెంట్ గా స్వీకరించాలొ, కామెంట్ గా బావించాలొ అర్దం కాక మౌనం గా ఉండిపొయాడు.
తర్వాత ఏమైంది..అని అబిరామ్ అడుగుతాడేమో అని ఎదురుచూస్తు కూర్చుంది భవ్య. అతనేం అడగలేదు.
కార్ నేషనల్ హైవేపై వేగంగా దూసుకుపోతుంది.
(ఇంకావుంది)
No comments:
Post a Comment