Thursday, May 19, 2011
ప్రణయ కావ్యం - 5
ఇంటర్ ఈ సారి స్టేట్ ఫస్ట్. నా ములానా నేను చదివిన ఇంటర్ కాలేజీకి ఒక్కసారిగా గుర్తింపు వచ్చేసింది. అప్పటివరకు అది ఓ మారుముల గ్రామంలొ వున్న మాములు ప్రభుత్వ కళాశాల. నా రిజల్ట్ రాగానే ఆ కాలేజీ దశ మారిపోయింది. అందులొ లెక్చరర్స్ అందరికి, మంచి మంచి జీతాలతొ సిటీలొ ప్రైవేట్ కాలేజీలలొ అవకాశాలు వచ్చాయి. మిగిలిన నా చదువు బాద్యత మొత్తం తీసుకుంటామంటు చాల విద్యాసంస్తలు ముందుకొచ్చాయి. నాకు ఇంజనీరింగ్ చదవాలని వుందని నాన్నతొ చెప్పాను. ఆయన సరే అన్నారు.
సడన్ గా నొకొచ్చిన గుర్తింపుకు లెక్చరర్స్ ఇంటికొచ్చి అభినందించారు. ఊర్లొవాళ్ళంతా తిట్టిన నొళ్ళతొనే పొగుడుతుంటే అమ్మ మురిసిపోయిందొ. ఈ సారి మావయ్య.."నా అల్లుడా మజాకా??" అని ఇంకొ రెండడుగులు ముందుకేసి గర్వంగా అన్నాడు. ఆ మాటలు విన్న నా మనసు ఆనందంతొ ఎగిరిగెంతేసింది.
"జానకి ఎక్కడ మావయ్యా?" అప్పుడే ఇంటికొచ్చిన అతన్ని అడిగాను.
"వాళ్ళ అమ్మతొ కలసి గుడికి వెళ్ళింది రా" చెప్పాడు మావయ్య. ఆయన మాట పూర్తి కాకుండానే ఊరి చివరనున్న గుడికి పరిగెత్తాను.
మా ఊరిలొ ఒకటే గుడి ఉంది. అది సీతారాములది. కొనేటి ఒడ్డున నుండి చూస్తే, ఆ గుడి గొపురం నీళ్ళలొ కనిపిస్తుంది. ఏ కాలంలొ నైనా ఆ కొనేటి నిండా కలువపూలు వుంటాయి. ఆ గుడి చుట్టు మూడు ప్రదక్షణలు చేసి, రాముల వారిని, సీతమ్మ తల్లిని ఏం కొరుకున్నా నెరవేరుస్తారని అమ్మమ్మ అంటుంటాది. అమ్మమ్మ మావయ్య వాళ్ళతొ వుంటుంది. వాళ్ళుండేది మా ఊర్లొనే అయినా, అమ్మ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళదు. మావయ్య, అమ్మమ్మా అప్పుడప్పుడు వచ్చి చూసి వెలుతుంటారు. అస్తమానం పుట్టింటికి వెలితే అలుసయిపొతామని అమ్మ అమ్మమ్మతొ వాదిస్తుంటుంది.
జానకి గుడి లొ కనపడలేదు. అత్త గుడిలొ ప్రదక్షణలు చేస్తు కనపడింది. పక్కన జానకి కనపడక, గుడి బయటకొచ్చి చూసాను. కొనేరు ఒడ్డున నిల్చొని, "అది...అది కాదు, ఇది....ఆహ అదే కావలి" అంటు ఎవరినొ తికమకపెడుతు కనపడింది. గబగబ అక్కడికి వెళ్ళి చూస్తే, మా మావయ్య పాలేరు కొడుకు, రఘు కొనేటి నీళ్ళలొ దిగి కలువపూలు కొస్తు కనపించాడు.
నన్ను చూస్తునే జానకి కళ్ళు పెద్దవయ్యాయి.
"బావా కంగ్రాట్స్! నీ కొసమే పూలు కొయిస్తున్నా?" అంది.
"దాంక్స్ రా" అన్నాను.
ఆమె మాట్లాడుతుంటే ఎదొ మత్తు మందు చల్లినట్లుగా అనిపించేది. అప్పుడు జానకి ఇంకా ఎనిమిదొ తరగతి పరిక్షలు రాసి వుంటుంది. ప్రేమించుకొనే వయసు కాదు అది. ఆకర్షించే వయసు అసలు కాదు. కానీ జానకి నాది అనే ఫీలింగ్! తనంటే ఇష్టం తప్ప, ఇంక వేరే ఎలాంటి భావాలు వుండేవి కావు.
కొనేటి బురదలొ నుండి రఘు బయటకు వచ్చాడు. తను కొసిన రంగు రంగు కలువలన్ని గుత్తులా చేసి "ఇదిగొండి అమ్మాయిగారు" అంటు జానకి కి ఇచ్చాడు.
తను వాటిని మురిపంగా చుస్తు.."తీసుకొ బావా" అంది.
తీసుకొకుండా "పూలు నేనేం చేసుకొను" అన్నాను. తన మొహం చిన్నబొయింది.
"మరి ఇంకేం కావాలి?" అడిగింది.
"నాకేం వద్దు నిన్ను చూడాలనిపించి ఇలా వచ్చాను. అది సరేగానీ నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకొంటున్నాను. అది జాయిన్ అయితే ఈ ఊర్లొ వుండటం కుదరదు. సిటీలొ వుండాలి. ఎప్పుడొ పండగలకొ సెలవలకొ తప్పు అస్తమానం నిన్ను చూడటం కుదరదు. ఏం చేయమంటావ్?" అడిగాను.
పూలు తీసుకొలేదన్న కొపంలొ వుంది తను. " నీకు నచ్చినట్లు చేయ్. నాకెందు కు చెప్పడం" ఉక్రొషంగా అంది.
"అది కాదు రా" అని నేను అనబొతుంటే
"పొ బావా నాతొ మాట్లాడకు" అనేసి, "రా రఘు మనం వెల్దాం" అని లేచి నిలబడింది. తనకి ఎందుకు కొపం వచ్చిందొ అప్పుడు తెలియలేదు. ఎందుకంటే ఆడపిల్ల మనసు తెలుసుకొనే వయసు కాదది.
జానకి కి కొపం వస్తే ఒక పట్టాన వదలదు. హరిహరాదులు వచ్చి చెప్పినా సరే...అంత మొండిది. నా మాటలు పట్టించుకొకుండా అక్కడి నుండి వెళ్ళిపొయింది. తన కొపం ఎలా పొగొట్టాల అని ఆ క్షణం నేను ఆలొచించి వుంటే..జానకి నాకు దూరమయ్యేది కాదు.
ఆ తర్వాత, నేను సిటీలొ కాలేజి లొ చేరాను. నేను చదువులొ మళ్ళీ బిజీ అయిపొయాను. నాలుగేళ్ళ కాలం చాలా వేగంగా పరిగెత్తింది. జానకి కి నాకు దూరం పెరిగింది.
కాలంతొ పాటు చాలా మార్పులొచ్చాయి. వర్షాలు లేక పంటలు పండక నాన్న అప్పులు పాలయ్యారు. మావయ్య వ్యవసాయం మానేసి, ఎన్నికలలొ నిలుచున్నాడు. ఎమ్ ఎల్ యే గా గెలిచాక, స్టేటస్ మారిపోయింది. హొదా పెరిగాక ఇంటికి రావడం మానేసాడని అమ్మ సెలవులకు వెళ్ళినప్పుడు చెప్పింది. ప్రతీ సెలవలకు, జానకి వాళ్ళ అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళిపొయేది. ఆమెని చూసి నాలుగు సంవత్సరాలు అయ్యింది.
(ఇంకావుంది)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment