Friday, May 20, 2011

ప్రణయ కావ్యం - 7

ఎయిర్ పొర్ట్ బయట వాళ్ళ కొసం ఓ డ్రైవర్ ఎదురుచూస్తు అభిరామ్ అని పేరున్న ప్లకార్డ్ పట్టుకొని నిల్చున్నాడు. వాళ్ళిద్దరు దగ్గరకు రాగానే లగేజీ అందుకొని, కార్ దగ్గరకు తీసుకొచ్చాడు. ట్రావల్ అండ్ పికప్ అరేంజమెంట్స్ అన్ని భవ్య డాడీ చేయించారు.

" సర్ నా పేరు ఇక్బాల్." డ్రైవర్ కార్ ముందు సీట్లొ కూర్చొంటు పరిచయం చేసుకున్నాడు.

"మీ ఊరు వెళ్ళడానికి ఎంత టైమ్ పడుతుంది." భవ్య అడిగింది వెనుక సీట్లొ కూర్చుంటు.

"ఎనిమిదిగంటలు" ఇక్బాల్ సమాదానం చెప్పాడు.

"ఓ మైగాడ్" అనుకుంటు వెనక్కి చేరబడింది. అబిరామ్ ఏదొ ఆలొచిస్తు కూర్చొవడం చూసి "మరి జానకి పెళ్ళి ఎలా ఆగింది?" అడిగింది.

"జానకి పెళ్ళి ఆగలేదు. వాళ్ళ నాన్న నిర్ణయించిన ముహుర్తానికే జరిగింది." అభిరామ్ చెప్పాడు.. ఆ మాటలకు ఉలిక్కిపడింది భవ్య.

"ఎవరితొ?" వెంటనే అడిగింది.
"వాళ్ళ నాన్న తీసుకొచ్చిన అబ్బాయితొనా?!" మళ్ళీ తనే అంది.
"కాదు" అన్నాడు. అయొమయంగా చూసింది.

"మా మావయ్య పాలేరు కొడుకు రఘురాం తొ జరిగింది. నేనే దగ్గరుండి మరీ జానకి పెళ్ళి చేసాను." అభిరామ్ చెప్తున్నప్పుడు, అతని గొంతులొ చాలా విలువైనది పొగొట్టుకున్న బాధ తొణికిసలాడింది.

"వాట్?" అర్దం కానట్లు చూస్తు అరిచినంతపని చేసింది.

భవ్య తనేం వింటుందొ అర్దం కాక, కాసేపు మౌనంగా వుండిపొయింది.

అభిరామ్ చెప్పడం మొదలు పెట్టాడు.
"ఆ రొజు కొనేరు గట్టుమీద కూర్చొని ఎదురుచూస్తుంటే, జానకి, రఘు ఇద్దరు కలసి నాదగ్గరకొచ్చారు. మొదట నాకు అర్దం కాలేదు. తర్వత తర్వాత నెమ్మదిగా అర్దమయ్యింది.

"బావా... నాకు రఘు అంటే ఇష్టం. తనకి కూడా నేనంటే ప్రాణం. నాన్నకి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు. నువ్వే ఎలాగైనా మా పెళ్ళి జరిపించాలి బావా" అంది.
నా కళ్ళు, మనసు, జరుగుతొంది... చూస్తుంది... అబద్దం కావాలని బలంగా కొరుకున్నాయి ఆ క్షణంలొ.

కానీ అబద్దం కాదన్నట్లుగా... తను చెప్తున్నంతసేపు ఆమె చేయి రఘు చేతిలొనే వుండటం కంటపడింది. వాళ్ళిద్దరి చేతులు చూస్తుంటే ఒక్క క్షణం కుడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢమైన ప్రేమలొ ఉన్నట్లుగా అనిపించింది. ఆ సమయంలొ రఘుని చూస్తే జెలసీలాంటి ఫీలింగ్. తను జానకి మనసు గెలిచాడన్న అసూయ. మీదపడి కొట్టాలన్న కసి. కాని ఏమి చేయలేని స్తితి. ఒక్కసారిగా పాతాళంలొకి జారిపోయిన ఫీలింగ్.

"నువ్వే చెప్పు బావా...చిన్నప్పటినుండి చూస్తున్న నిన్నే నా భర్తగా ఊహించుకొవాలంటే మనసొప్పుకొవడంలేదు. అలాంటిది ఎవరొ ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి వీడే నీకు కాబొయే మొగుడంటే ఆ ఆడపిల్ల పరిస్తితి ఎలా వుంటుందొ??
ఎందుకు బావా ఈ పెద్దొళ్ళు పిల్లల మనసు అర్దం చేసుకొరు??" ఆవేశంగా మాట్లాడుతుంటే...

"నిజం చెప్పు నా మీద నీకెలాంటి ఫీలింగ్స్ లేవా?" అడ్డుపడి అడిగేసాను. పక్కన రఘు వున్నాడన్న సంగతి మరిచిపొయాను. అయినా తనకి తెలియని విషయం కాదు. చిన్నప్పటినుండి జానకి నా భార్య అని ఊరంతా అనుకున్నారు. ఎప్పుడు ఎవరు ఇలా తను పాలేరు మీద మనసుపడుతుందని ఊహించి వుండరు.

నా ప్రశ్నకి "పో బావా నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జొక్ లేస్తావు" అంది బుంగమూతి పెడుతు.

"జొక్ కాదు. సీరియస్ గానే అడుగుతున్నాను. చిన్నప్పటి నుండి నిన్నే నా భార్య గా ఊహించుకుంటు వచ్చాను. ఆ విషయం నీకు తెలియనట్లు నటించకు" అన్నాను.

నేనలా మాట్లాడతానని ఊహించలేదేమో షాక్ కొట్టినదానిలా కొయ్యబారిపోయింది.

"నిజం చెప్పు నేను నిన్ను ఇష్ట పడుతున్న విషయం నీకు తెలీదా?" అడిగాను. అప్పుడంది తను..

"బావా ఇష్టం వేరు. ప్రేమ వేరు. నువ్వంటే నాకిష్టం. అది ప్రేమనుకొని నువ్వెలా పొరబడ్డావు బావా? అయినా నా అబిప్రాయాలు..అలవాట్లు..నీకు నచ్చవు. నాకనిపించే చిన్న చిన్న ఆనందాలు నీకు నచ్చవు. నా మనసు నీకు అర్దం కాదు బావా. నేను చిన్నప్పుడు ఆడుకొవడానికి తొటకు రమ్మంటే ప్రెండ్స్ తొ ఆడుకొ అన్నావు. నాకిష్టమైన కలువపూలు నీకిస్తుంటే.."ఏం చేసుకొను అని అడిగావు గానీ, నా మనసు అర్దం చేసుకొలేదు.

వదిలేయ్ బావా నాకు నీకు కుదరదు. మనం కలిసి నాలుగేళ్ళు అయ్యింది. ఏ రొజన్నా నన్ను చూడాలని, నాతొ మాట్లాడలని నీకు అనిపించిందా? లేదు!. ఎందుకంటే నీకు అస్తమానం పుస్తకాలు, రాంకులు ఇదే గొల! నువ్వొ చదువు పిచ్చొడివి బావా!.

రఘు మాత్రం అలా కాదు. నేను కనపడకపోతే అతనికి పొద్దు పొదు. ఎప్పుడన్నా అమ్మమ్మా వాళ్ళ ఊరెల్తే నేను వచ్చేవరకు అన్నం కూడా ముట్టడు. నాకొసం ఎదురుచూస్తు బస్ స్టాండ్ లొనే కూర్చొనేవాడు. నా కొసం ఆరొజు ఈత రాకపొయినా ప్రాణాలకు తెగించి కొనేట్లొ దిగి పూలు కొసుకొచ్చాడు. ప్రేమంటే అది బావా." చెప్పడం ఆపింది.

ఇంకేం మాట్లాడాలొ అర్దంకాలేదు. తను రఘు ని ప్రేమించింది. రఘుని తప్ప ఇంకెవరినీ చేసుకొవాలని లేదని తెగేసి చెప్పింది. ఇంతకన్నా బయంకరమైన అవమానం ఏ మగాడికి జరిగి ఉండదు.

జానకి నన్ను ప్రేమించలేదు. ఇష్టపడింది. అంతే. ఆమె దృష్టిలొ ప్రేమ వేరు. ఇష్టం వేరు. పిచ్చొడ్ని తేడా తెలుసుకొలేకపొయాను.

జీవితంలొ మొదటిసారి ఓడిపోయాను. ఓ ఆడపిల్ల మనసు గెలవలేకపోయాను. కనీసం వాళ్ళ పెళ్ళి చేసైనా సంతృప్తి పడాలని మనసుకు సర్దిచెప్పుకున్నాను.

నా మనసు అర్దం చేసుకున్నదానిలా..." నిన్ను చాలా బాధ పెట్టినట్లున్నాను మన్నించు బావా" అనేసి రఘుతొ కలసి వెళ్ళిపొయింది. వెనక్కి తిరిగిచూడలేదు.

కుప్పకూలిపోయాను. నా మనసు భారంగా తయరైంది. ఎక్కడినుండొ జొరుగాలి వీయడం మొదలుపెట్టింది. మబ్బులు ఒక సారిగా ఉరిమాయి. సడన్ గా మొదలైన వర్షం నన్ను నిలువునా తడిపేసింది. కొనేట్లొ పూలు నన్ను వెక్కిరిస్తున్నట్లుగా జొరుగాలికి ఊగుతున్నాయి.
చాలా సేపు వరకు మాములు మనిషి కాలేకపొయాను.
----

"రాముడు... నీకేమన్నా పిచ్చి పట్టిందా? పాలేరు తొ జానకి పెళ్ళేంట్రా??" అమ్మమ్మ, అత్త, అమ్మ మూకుమ్మడిగా నాపైదాడి చేసారు.
"రఘుని మీరు పాలేరు గా మాత్రమే చూసారు. జానకి మాత్రం తన జీవితబాగస్వామిగా చూసింది. వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంది. ఎవరేమన్నా వాళ్ళ పెళ్ళి జరిగితీరుతుంది." అన్నాను.

"నొరుమూయ్."
ఎక్కడినించి వచ్చాడొ నా మాటలు విన్న మావయ్య ఒక్కసారిగా విరుచుకుపడుతు అన్నాడు.
"అసలు నువ్వు ఎవడివిరా నా కూతురి పెళ్ళి చేయడానికి. అసలు నీకే దాన్ని ఇవ్వనొడ్ని....పాలేరు నాకొడుకు కు ఎలా ఇస్తారా?" అంటు, ఇల్లంతా కలియజూస్తు "ఎక్కడే..నీ దరిద్రగొట్టు కూతురు" అని అత్తని అడిగాడు. అందరూ హడలిపొతు చెరొవైపు వెళ్ళిపొయారు.

(ఇంకావుంది)

No comments:

Post a Comment