వాళ్ళు ఎక్కిన విమానం టేకాఫ్ తీసుకోవడానికి రనవే పై వేగం గా కదిలింది.
అబిరామ్ భవ్య పక్క పక్కనే కుర్చున్నా అపరిచితులు లా మాటలడుకొవడం లేదు. ఎర్ పొర్ట్ వచ్చే వరకు ఇద్దరు మాట్లాడకొకుండానే వున్నారు. భవ్య ని కదిలించాలంటే భయంగా వుంది అతనికి. అసలే అతని మనసు చాల సెన్సిటివ్. త్వరగా విమర్శలను స్వీకరించలేడు. తన ని ఎవరన్నా ఎమన్నా అంటే సాదారణం గా వురుకునే రకం అసలు కాదు. కాని తప్పదు. ఆమెని భరించాలి. పెళ్ళి చేసుకొవాలి. ఆమెకి ఇష్టం వున్నా లేకున్నా...వాళ్ళ పెళ్ళి జరగాలి. తనది స్వార్దం అని తెలుసు...అందుకు ఓ ఆడపిల్ల జీవితం తొ ఆడుకుంటున్నాడని తెలుసు. అయినా తప్పదు. మనసంతా గిల్టి ఫిలింగ్ తొలిచేస్తుంటే అసహనంగా సీట్లొ కదిలాడు.
"నాకు అలా సైలంట్ గా వుంటే నచ్చదు. ఎదైనా మాట్లాడండి" అతన్ని మాట్లాడించాలని భవ్యనే మాటలు కలిపింది. ఆమె మాటలు చాలా డిమాండింగ్ గా వున్నాయి. "ఎం మాట్లాడాలి.." ఆలొచిస్తు "మీరే మాట్లాడండి" అన్నాడు.
కాసేపు ఆలొచించి...
"మీరు మా డాడి కి పరిచయం అయిన రొజు నుండి మా డాడి మిమ్మల్ని అల్లుడు చేసుకొవాలని ఒకటే మాట కలవరిస్తుండేవారు. మీ ఫొటొ చుపించి నచ్చాడా నచ్చాడా అని నా బుర్ర తినేసేవారు. కొన్నాళ్ళు నన్ను చదువుకొనివ్వండి డాడి అంటే నా మాట వినలేదు. మీరు నా ఫొటొ కుడా చుడకుండా నన్ను పెళ్ళి చేసుకొవడానికి ఒప్పుకున్నారని తెలిసి ఎగిరి గంతేసారు. నా ఇష్టాఇష్టాలు తొ పని లేకుండా నన్ను మీతొ బలవంతంగా ఇండియా పంపిస్తున్నారు." చెప్పడం ఆపింది.
ఆమె నిజాయితి నచ్చింది అతనికి.
"నాక్కుడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయినా కొన్ని బలమైన కారణాల వలన నిన్ను మేరేజ్ చెసుకొంటానని మీ డాడి కి చెప్పాను. బట్ అయామ్ రియల్లి సొరీ." అన్నాడు. అతను ఎమి చెపుతున్నాడొ ఆమె కి అర్దం కాలేదు. విచిత్రంగా చుసింది.
"నీకు క్లియర్ గా అర్దమవ్వాలంటే..నా కధ నీకు తెలియాలి." అన్నాడు.
చెప్పమన్నట్లు చుసింది.
అబిరామ్ దీర్ఘంగా ఊపిరి తీసి చెప్పడం మొదలుపెట్టాడు.
మీ డాడి ఇప్పుడు చుస్తున్న అబిరామ్ పెద్ద బిలియనీర్. కాని ఒకప్పుడు తినడానికి తిండి లేక చేయి చాచి అడగడానికి అబిమానం అడ్డొచ్చి ఆకలి తొ కాళ్లు ముడుచుకొని పడుకున్న రాత్రులు గురించి ఆయనకు తెలియవు. నేను చాలా పూర్ ఫామిలి నుండి సొంత కష్టం మీద పైకి వచ్చాను. నా వెనుక ఏ గాడ్ ఫాదర్ లేరు. తాతలు సంపాదించిన ఆస్థులు ఏమి లేవు. నన్ను ఈ ప్రస్థానానికి చేర్చిన నా కధ ...మా ఊరు గొదావరి జిల్లాల మద్యన వున్న అవిసెపాలెం లొ మొదలైంది.
అదొక అందమైన పల్లెటురు. ఊరి చివర వెలివేసినట్లు మా ఇల్లు వుండేది. మా ఇంటి చుట్టుపక్కల దరి దాఫుల్లొ ఏ ఇల్లు వుండేది కాదు. మా నాన్నకు వాళ్ల నాన్న పొతు పొతు ఇచ్చిన పొలం అంటే ప్రాణ్ం. ఆ పొలం లొనే వాల్ల అమ్మ నాన్నలను చుసుకునేవాడు. పొలం కు దగ్గర గా వుండాలని ఇల్లు కుడా ఊరి చివర పొలంకు దగ్గర గా కట్టుకున్నాడు. తనకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఆ పొలం కి వెల్లి మనసు కుదుట పడే వరకు అక్కడే కుర్చునేవాడు. చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేసేవాడిని, నా అల్లరిని మా అమ్మ అదుపు లొ పెట్టలేకపొతున్నానని అస్తమానం నాన్న దగ్గర వాపొయేది." అని చెప్పడం ఆపాడు అబిరామ్.
"హలొ చిన్నప్పుడు అందరం అల్లరి చేస్తాం అదేం పెద్ద విషయమా? ఇంట్రస్ట్ంగ్ గా ఎదైనా చెప్పు" విసుగ్గా మొహం పెట్టి అంది భవ్య.
ఆమె అడిగిన తీరుకు అతనికి నవ్వు వచ్చింది.
"అందరిలాంటి అల్లరి నాది కాదు భవ్య. నాకు ఆడుకొవడానికి అన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరు. ఇంటి చుట్టుపక్కల దరిదాపుల్లొ ఇల్లు లేకపొవడం వలన చిన్నపిల్లలు ఎవరు లేక నా చిన్నతనం ఎక్కువ ఒంటరిగా గడిచింది. ఏదొ తెలియని మొండితనం ఎవరిమీదొ తెలియని కసి తొ నాలొ బాగా అల్లరి ఎక్కువైంది. ఒంటరిగా నాలొ నేనే మాట్లాడుకొనేవాడిని,,నాతొ నేనే ఆడుకునేవాడిని. ఏపుగా ఎదిగిన చెట్లు... పొలం గట్లు నా స్నేహితులు.
నాకు ఏడేళ్ళప్పుడే... గొదారి నీళ్ళలొ ఒక్కడినే అలుపువచ్చేదాకా ఈదేవాడిని, చేపలు పట్టడానికి వచ్చే నాటుపడవల తొ ఈత కొడుతు పొటిపడేవాడిని, వలేసి చిక్కిన చేపలను..ఒద్దిక గా బుట్టలొ దాచుకునే జాలార్ల కళ్ళు కప్పి బుట్టడు చేపలను నీటిలొ వదిలేసేవాడిని, వేట పడవలకు దురంగా స్వచ్చమైన గొదారి నీట్లొ స్వేచ్చ గా ఈదుకుంటు పారిపొతున్న చేపల్ని చుసి ఆనందంతొ ఒక్క అంగలొ నీట్లొ దుకేవాడిని.
"వావ్ ఇంట్రెస్ట్ంగ్..మరి వాళ్ళు నిన్ను ఏమి అనేవారు కాదా?" అడిగింది.
"అబ్బొ చాలా సార్లు మా నాన్నకు చెప్పారు. మా నాన్న నన్నేమి అనేవాడు కాదు. నాకు కావల్సినంత స్వేచ్చ ఇచ్చేవారయన. నాన్న తొ చెప్పిలాభం లేదని, ఓ సారి గోదారి ఓడ్దున చెట్టుకేసి కట్టేసారు. మే నెల ఎండలుకు ఒంటినుండి చెమట దారాళంగా కారుతుంది. కాళ్ళకింద ఇసుక సర్రున కాలుతుంది.
"ఏరా మళ్ళీ ఇంకెప్పుడు...ఇలాంటి ఎదవపని చేయనని చెప్పు..వదిలేస్తాం" ఓ జాలారి నా దగ్గరికి వచ్చి అడిగాడు. నా కళ్ళలొ వాడికి ఎలాంటి భయం కనిపించక "ఏంటి చెప్తావా..రాత్రయ్యేదాకా చెట్టుకే వుంటావా?" మళ్ళి అడిగాడు.
"నువ్వే చేపలు పట్టడం మానేయ్" అన్నాను. ఉలిక్కిపడ్డాడు. నా వంక తినేసేటట్లు చుసాడు. చుట్టు చేరి చిత్రంగా చుస్తున్న మిగతా జాలార్లు నా సమాదానం విని ఆశ్చర్యపొయారు.
ఆ వయసులొ ఎక్కడినించి వచ్చిందొ ఆ ద్యెర్యం..నాకు ఎప్పటికి అంతు చిక్కదు.
"నీకు మాములుగా చేప్తే వినవురా. కడుపుకాలేతే గాని దారిలొకి రావు. ఒరేయ్..వీడి అమ్మ బాబు వచ్చినా వీడిని వదలోద్దు. ఎలా దారికి రాడొ నేను చుస్తా" అనేసి.. జెబులొ వున్న చుట్ట తీసుకొని వెలిగించుకుని దురంగా వున్న తన గుడిశ లొకి వెళ్ళాడు.
చీకటి అయ్యేదాక మానాన్న పొలం నుండి ఇంటికి వచ్చేవాడు కాదు. రాత్రవుతున్నా నేను ఇంకా ఇంటికి రాలేదని అమ్మకు ఖంగారు మొదలయ్యింది. గొదారి ఒడ్డున ఇసుక తిన్నేల మీద పొద్దుపొయేదాక ఆడుకుని ఈపాటికి ఇంటికి వచ్చెసేవాడిని అలాంటిది..ఇంతవరకు రాలేదేంటని మరొనిమషం ఇంటిదగ్గర వుండలేక, నాన్న వచ్చెవరకు ఆగ లేక నదిఒడ్డుకు బయలుదేరింది. మద్యలొ ఎవరొ ఎదురై అసలు విషయం చెప్పారు.
అమ్మకు ఒక్కసారిగా వాళ్ళమీద కొపం పొంగుకొచ్చింది. పరుగులాంటి నడక తొ నన్ను కట్టేసిన చెట్టు దగ్గరకు వచ్చింది. దాహంతొ నొరు ఎండిపొయిన నేను వెంటనే అమ్మా అని పిలవలేకపొయాను. నా పరిస్థితి చుసి అమ్మకు కళ్ళలొ నీళ్ళు పొంగుకొచ్చాయు.
(ఇంకావుంది)
కధ సహజత్వానికి దగ్గరగా వస్తూ రమ్యత సంతరించుకొంది మాష్టారూ .అభినందనలు. Nutakki Raghavendra Raao.
ReplyDeleteThank you Nutakki garu
ReplyDeleteకథా శిల్పం చాలా బాగుంది...ప్రస్తుత జీవన శైలికి దగ్గరగా వుంది.. మంచి రచన..
ReplyDeleteగోదావరి గట్టు...అమెరికా అబ్బాయి...ఈ రెండు హిట్ పేర్ లాగ కనపడుతోంది...
కీప్ ఇట్ అప్ శ్రీనివాస్..అల్ ది బెస్ట్..
సుధా రాణి చల్లా
Thank you Sudha Rani garu
ReplyDelete